Nanditha Raj , నందిత రాజ్

  •  

  •  

పరిచయం (Introduction) : 
  •  ప్రేమకథా చిత్రం  తో తెలుగు సినిమా కు పరిచయమైనది .మొదట మోడల్ గా చేసారు . ''నీకు నాకు డ్యాస్ డ్యాస్''(తెలుగు) అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఈమె ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం. నాన్న ఆర్మీ ఆఫీషర్ అయినందున అనేక సిటీలలో బాల్యము గడిపారు. 
జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : నందిత రాజ్  ,
  • పుట్టిన ఊరు : ముంబై  ,
  • పుట్టిన తేదీ : 30-ఆగస్ట్ -1994,
  • తండ్రి : ఆర్మీ ఆఫీషర్ -రాజ్ కుమార్ ,
  • తల్లి : వస్థి రాజ్(లీగల్ అడ్వైజర్ ) ,
  • తోబుట్టువులు : ఒక తమ్ముడు ,
  • చదువు : డిగ్రీ - B.Com,
  • నివాసము : హైదరాబాద్ , 
  • తొలి సినిమా : నీకు నాకు డ్యాస్ డ్యాస్ (తెలుగు),
సంక్రాంతి నాడు : 


  •  తమ మనసంతా పండగ ఊసులే అంటున్నారు 'ప్రేమకథా చిత్రమ్‌' నాయిక నందిత, పండగ కలిసొచ్చింది: నందిత. నేను అచ్చ తెలుగమ్మాయినే అయినా పుట్టి పెరిగింది ఉత్తరాదిన. నాన్న సైనికాధికారి. తరచూ బదిలీ అయ్యేది. ముంబయి, ఢిల్లీ, పంజాబ్‌ ఇలా.. చాలా రాష్ట్రాల్లో నా బాల్యం గడిచింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా సంక్రాంతి జరుపుకుంటారు. నేను మాత్రం మన రాష్ట్రంలోనే పండగ చేసుకోవడానికి ఇష్టపడేదాన్ని. ఏడాదంతా సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసేదాన్ని. ఎందుకంటే... ఆ సెలవుల్లో అమ్మ మమ్మల్ని విశాఖపట్నంలోని అమ్మమ్మ ఇంటికి తీసుకొచ్చేది. అక్కడ పొద్దున్నే లేవడం, ముగ్గులేయడం, చెరకుగడలు తినడం... ఒకటే సందడి. ఎక్కడెక్కడో స్థిరపడిన మా బంధువులంతా ఈ పండక్కి వైజాగ్‌ తప్పనిసరిగా వచ్చేవారు. అత్తయ్యలూ, మామయ్యలూ, బాబాయిలూ, చిన్నమ్మలూ... వాళ్లు చెప్పే కబుర్లతో సమయం తెలిసేది కాదు. అమ్మమ్మ నాకిష్టమైన అరిసెలూ, పులిహోరా, కాజాలూ.. చేసి సిద్ధంగా ఉంచేది. మా కజిన్‌లతో కలిసి బీచ్‌కి వెళ్లి, పోటీలు పడి మరీ గాలిపటాలు ఎగరేసేదాన్ని. ఊహ తెలిశాక అవి పక్షులకు చేసే హాని గురించి తెలిసింది. అప్పట్నుంచి తక్కువ ఎత్తులో చూసుకొని మరీ గాలి పటాలు ఎగరేస్తున్నా. అమ్మ చాలా చక్కగా ముగ్గులు పెట్టేది. నేను వాటిల్లో రంగులు నింపేదాన్ని. నేనూ చుక్కల ముగ్గులు వేయాలని ప్రయత్నించా. ఇప్పుడిప్పుడు కొన్ని వేయగలుగుతున్నా. నాకు దైవభక్తి ఎక్కువే. సంక్రాంతి నాడు లక్ష్మీదేవికి, సూర్యభగవానుడికీ పూజ చేస్తా. ఢిల్లీలో భోగి పండగను చాలా ఘనంగా చేసుకుంటారు. భోగిమంటల్లో మరమరాలూ, నువ్వులూ వేస్తారు. అలా చేస్తే కీడు పోతుందని వాళ్ల నమ్మకం. అక్కడ సంక్రాంతికి బహుమతులు ఇచ్చిపుచ్చుకునే ఆనవాయితీ కూడా ఉంది. కానీ కొత్త దుస్తులు ధరించాం అన్న సంతృప్తి ఉండదు. ఎందుకంటే విపరీతమైన చలి. స్వెటర్‌తో కప్పేసుకోవాల్సిందే! అమ్మ ఇంట్లో పూజలు బాగా చేస్తుంది. నేను తక్కువే. కానీ నా సినిమా విడుదలయ్యే ముందు చిలుకూరు బాలాజీ దగ్గరకు వెళ్లొస్తా. తరచూ శిరిడీ, కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయానికి వెళుతుంటా. సంక్రాంతి నాకెంతో ప్రత్యేకమైంది. మూడేళ్ల క్రితం మేం హైదరాబాద్‌ వచ్చాక... సినిమాల్లోకి రావాలన్న నిర్ణయం ఈ పండగప్పుడే తీసుకున్నా. బాగా కలిసొచ్చింది. మంచి పేరొచ్చింది. ప్రేక్షకులు తెలుగమ్మాయిగానే కాదు.. 'మన అమ్మాయి' అనే భావనతో చూస్తున్నారు. అందుకే సంక్రాంతి నాకు లక్కీ అనుకుంటా. సినిమాల్లోకి వచ్చిన దగ్గర్నుంచి ఈ పండగ సమయంలో షూటింగ్‌ ఉంటోంది. సెట్‌లోనే పండగ చేసుకుంటున్నా. ఇన్నాళ్లూ కుటుంబ సభ్యుల మధ్య చేసుకున్న నేను... ఇప్పుడు అంతకంటే పెద్దదైన సినిమా కుటుంబంతో కలిసి పండగ జరుపుకుంటున్నా.

నటించిన సినిమాలు (filmography ): 
  • నీకు నాకు డ్యాస్ డ్యాస్ (తెలుగు)--2012 ,
  •  ప్రేమకథా చిత్రం-2013 ,
  • లండన్‌  బ్రిడ్జి(మలయాళం ) -2013,
  • లవర్స్ (2014)

  • ============================= 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala