Srilatha-శ్రీలత(T.V.artist)

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  అనుకున్నదొక్కటీ... అయ్యిందొక్కటీ... అయినా అంతా కలిసొచ్చిందిలే శ్రీలతకీ! అవును, కూచిపూడి కళాకారిణిగా పేరు తెచ్చుకోవాలన్న ఆమె కెరీర్‌ను ఒక అవకాశం మలుపు తిప్పింది. ఆ తరవాత పద్మవ్యూహం, ఆడపిల్ల, బంధం, అంతఃపురం, సుమంగళి, ఆటోభారతి వంటి డెబ్బై సీరియళ్లలో నటించిన శ్రీలత మంచి టాలెంట్ ఉన్న టి.వి.కళాకారిణి .
జీవిత విశేషాలు (profile) : 
  • ఊరు : హుజూరాబాద్- కరీంనగర్‌ జిల్లా ‌.
  • నాన్న: హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి సంబంధించిన వ్యాపారం.
  • అమ్మ : విజయలక్ష్మి గృహిణి
  • తోబుట్టువులు : అక్క, అన్నయ్య తరవాత నేను.
  • చదువు : డిగ్రీ ,
కెరీర్ :-- తన మాటల్లో->
  • చిన్నప్పుడు స్కూల్లో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ మేం పాల్గొని డాన్స్‌ చేసే వాళ్లం. చూసిన వాళ్లందరూ 'చాలా బాగా చేస్తున్నారు' అనడంతో డాన్స్‌ అంటే తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. 'స్వర్ణకమలం' సినిమాను ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదు. దానిలో భానుప్రియలా గొప్ప డాన్సర్‌ను కావాలనుకుని, డి.వి. సత్యకుమార్‌ దగ్గర కూచిపూడి నృత్యం నేర్చుకున్నా. ప్రదర్శనలివ్వడం ప్రారంభించా. ఒక కార్యక్రమంలో నా డాన్స్‌ చూసిన నిర్మాత 'భీమేశ్వర పురాణం' సీరియల్‌లో పార్వతీ దేవి పాత్ర చేయమని అడిగారు. ఇంట్లో వాళ్లకి కళా రంగంతో పరిచయం లేదు. డాన్స్‌ నేర్చుకుంటాను అన్నప్పుడే 'ఎందుకది, బుద్ధిగా చదువుకోక' అన్నారు. అమ్మ మాత్రం నా ఇష్టాన్ని సమర్థించింది. డాన్సు నేర్పించింది. టీవీ సీరియల్‌ అవకాశం వచ్చినప్పుడూ 'ఒకటి రెండింట్లో చేయనివ్వండి చూద్దాం' అని నాన్ననీ, అందరినీ ఒప్పించింది.

గ్లిజరిన్‌ లేకుండా నటిస్తా...
మొదటి సీరియల్‌తోనే మంచి పేరొచ్చింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈటీవీ 'సంతోషం', బొమ్మరిల్లు, పద్మవ్యూహం, ఆడపిల్ల, బంధం, కుంకుమరేఖ, గోరింటాకు, అంతఃపురం, ఆటోభారతి... ఇలా చాలా సీరియళ్లలో నటించా. ఇన్ని సీరియళ్లతో రోజూ కాలేజీకి వెళ్లి చదవడం ఎక్కడ కుదురుతుంది! ఇంటర్‌ తరవాత దూరవిద్యలో చేరి, డిగ్రీ పూర్తిచేశా. నిజానికి, టీవీ రంగంలో అడుగు పెట్టకముందే 'ఫ్యామిలీ సర్కస్‌', 'ఖుషీ'ల్లో చేయమంటూ అవకాశాలు వచ్చాయి. అప్పుడు అమ్మానాన్నలు ఒప్పుకోలేదు. చిన్నితెరపై నటించడానికి ఒప్పుకోవడం నా అదృష్టమేనని చెప్పాలి. దీనికి తగ్గట్టు ఇప్పటి వరకూ నటించిన పాత్రలన్నీ దేనికవే విభిన్నమైనవి. ఏడుపు పాత్రల్లో చాలావరకూ గ్లిజరిన్‌ అవసరమే లేకుండా నటించా. ఎస్వీ రంగారావు గారు, సావిత్రి గారిలా సహజంగా నటించాలన్నదే నా కోరిక. ఇప్పుడు నటిగా స్థిరపడ్డాక బంధువులూ, సన్నిహితులూ 'మా లత... ఎంత బాగా చేస్తోందో' అంటుంటే గర్వంగా అనిపిస్తుంది. నా నటనకు అమ్మ విమర్శకురాలు. నా తోటి నటుల్లోని సానుకూల అంశాలనూ, నాలోని లోపాలనూ తను ఎప్పటికప్పుడు చెబుతుంది.

అనుబంధమెంతో...
  • నటిగా ఎంత బాగా చేశాం అన్నది, అందే అభిమానాన్ని బట్టే ఉంటుంది. అటువంటి సంఘటనలు నా జీవితంలో చాలానే ఉన్నాయి. 2010లో నంది అవార్డు అందుకున్నాను. 'అంతఃపురం'లో రెండున్నరేళ్ల క్రితం నా పాత్ర చనిపోతుంది. ఆ సమయంలో ఒకరోజు ఫోను. 'మా అమ్మతో మాట్లాడండి' అంటూ ఒకమ్మాయి అడిగింది. అభిమాని కదా అని అలాగే అన్నా. కానీ నేనెంత పలకరించినా, ఆవిడ మాట్లాడదే! 'నీకలా జరగకూడదు' అంటూ ఒకటే ఏడుపు. నేను భయపడిపోయా. కొన్ని నిమిషాల తరవాత ఆ అమ్మాయి ఫోను తీసుకుని 'రాజేశ్వరి దేవి పాత్రలో మీరు చనిపోవడం అమ్మ తట్టుకోలేకపోయింది. నిన్నటి నుంచి భోజనం కూడా చేయలేదు' అని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయా. ఈ మధ్యే అదే సీరియల్‌లో, అదే పాత్రతో నేను ప్రేక్షకుల ముందుకొచ్చా. 'రాజేశ్వరీ దేవీ... మీరు మళ్లీ రావడం కాదు, ఆ మృణాళిని పని పట్టండి' అంటూ మళ్లీ ఫోన్లు రావడం మొదలైంది. నా అసలు పేరు అలా ఉంచండి! చాలామందికి నేను సీరియళ్లలోని పేర్లతోనే పరిచయం. కుంకుమరేఖ 'తులసి', ఆడపిల్లలో 'ఉమ'గానే ఎక్కువ మంది పిలుస్తుంటారు. ఎప్పటికీ వారి అభిమానం అలా అందుతుంటే చాలు... ఎలా పిలిచినా ఆనందమే!

 నటించిన  సీరియల్స్ : (filmography ): 

 సీరియల్స్ :
  • కుంకుమరేఖ '
  • తులసి'
  • ఆడపిల్ల
  • బంధం,
  • అంతఃపురం,
  • సుమంగళి,
  • ఆటోభారతి
 Source : courtesy with : Vasundara@eenadu news paper.
  • ================================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala