Wednesday, October 16, 2013

Mynampati Sreeram Chandra(singer)-మైనంపాటి శ్రీరామచంద్ర

 •  

 •  
పరిచయం (Introduction) :
 • మనోడు అద్దరగ్గొట్టేశాడు.. తన గాన మాధుర్యంతో కోట్లాది భారతీయుల గుండెల్లో చిరుసవ్వడిని మోగించాడు. లయబద్ధంగా తలలూగించాడు. సంగీతానికి సరికొత్త అర్థాన్ని ఆపాదించాడు. నిన్న మొన్నటి ఉత్కంఠతకు తెర దించి ‘ఇండియన్ ఐడల్’ ట్రోఫీతో తొలి దక్షిణాది గాయకుడిగా చరిత్రకెక్కి రికార్డు సృష్టించాడు. ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టాడు. మనోడే. మన తెలుగువాడే. మైనంపాటి శ్రీరామచంద్ర. హైదరాబాద్ బోయిన్‌పల్లి నివాసి. లక్షా ఎనభై వేల మంది పోటీదారులతో తలపడి తెలుగోడు సత్తాని మనసుకి హత్తుకునేలా చేశాడు. మున్నాభాయ్‌ని కంట తడిపెట్టించాడు. అమితాబ్‌తో ‘ఔరా’ అనిపించాడు. అమీర్‌ఖాన్‌తో ‘గ్రేట్..’ అనిపించుకొన్నాడు. ఆగ్రాకి చెందిన రాకేష్ మైనీని, బరోడా భూమి త్రివేదితో పోటీపడి 50 లక్షల ప్రైజ్ మనీతో.. టాటా వింగర్ కారుతో తిరిగొచ్చాడు. సోనీ జీఎంజీతో ఒక సంవత్సరం కాంట్రాక్టు. ‘యాష్‌రాజ్ ఫిల్మ్’ ప్రాజెక్టులో ఆలపించే అవకాశం.. ఇన్ని చేజిక్కించుకుని తెలుగు కీర్తి పతాకను ఎగురవేసి సగర్వంగా సరిగమల గమకాలతో మాట్లాడుతూన్నట్టు.. పాట పాడుతున్నట్టు.. నేనిప్పటికీ కలలోనే ఉన్నానా? అంటూ ప్రశ్నిస్తున్నాడు. కానీ ఇది నమ్మలేని నిజం. ప్రపంచం అంతా నాతోటే ఉందన్న ధీమా. భారతావని స్వాతంత్య్ర వేడుకల్లో మునిగి తేలుతూంటే - అదే రోజు శ్రీరామచంద్ర జీవితంలో మరపురాని రోజవటం విశేషం. అమితాబ్‌బచ్చన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవాలన్న శ్రీరామ్ అనుభూతికి చక్కటి మజిలీ. ‘ఇండియన్ ఐడల్-5’ ఏప్రిల్ 5న ప్రారంభమైంది. ప్రముఖ హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ ‘సోనీ’లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ ప్రోగ్రామ్‌లో మొదట్నుంచీ ‘శ్రీరామ్’ తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఒక్కొక్కరినే గెలుచుకుంటూ వచ్చాడు. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమలో పాటలు పాడిన అనుభవం.. ఏళ్ల తరబడి చేసిన కృషి.. ఏకాగ్రత - ఈ రోజున ‘ఇండియన్ ఐడల్-5’ గాయకుడిగా సుస్థిర స్థానాన్ని ఏర్పరచింది. తన కెరీర్‌ని బాలీవుడ్‌లోనూ తెలుగు సినీ పరిశ్రమలోనూ వేళ్లూనుకోవాలన్న ఆకాంక్ష. ఏ నటుడికి పాట పాడాలని ఉందని ప్రశ్నిస్తే - ఏ ఒక్క నటుడో నేను పరిమితం కావాలని అనుకోవటం లేదు. నేనొక ‘వెర్సటైల్ సింగర్’ని. ఎవరికైనా నేపథ్య గానాన్ని అందించేందుకు సిద్ధమేనంటాడు. చిన్నప్పట్నుంచీ లతామంగేష్కర్, కిషోర్‌కుమార్ పాటలంటే ఇష్టం. బహుశా ఆ పాటల్లో మాధుర్యం నాలో జీర్ణించుకుని పోయి ఈ విధంగా ఆలాపన చేస్తోందేమో?! అంటాడు. అప్పటి ఇష్టానికి శంకర్ మహదేవన్ సంగీతం.. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం తోడయింది. భారతీయ సంగీతాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాలన్న కోరిక ఉండిపోయిందంటాడు. ఈ సంగీత ప్రయాణంలో ‘ఇండియన్ ఐడల్-5’ ఓ మజిలీ. ఈ విజయం నా ఒక్కడిదే కాదు. ప్రతి ఒక్కరిదీ. నన్ను ప్రోత్సహించిన నా తల్లిదండ్రులదీ. స్నేహితులదీ.. ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటింగ్ చేసి నన్ను నెం.1 స్థాయికి తీసుకెళ్లిన అభిమానులదీ. భూమి, రాకేశ్ మేమంతా ఒక ఫ్యామిలీ. ఎవరు గెలిచినా... ఎవరు ఓడినా మా మధ్య పోటీతత్వమే తప్ప శత్రుత్వం లేదు అంటాడు నిజాయితీగా.
  ‘ఇండియన్ ఐడల్-5’ సీజన్ ప్రారంభమయిన నాటి నుంచీ అదే ఆవేశం.. ఇటు ప్రేక్షకుల్లోనూ... అభిమానుల్లోనూ.. శ్రీరామ్‌లోనూ. గతంలో కారుణ్య చేతుల్లోంచి జారిపోయిన కిరీటాన్ని ‘మైనంపాటి’ తలకెత్తుకున్నాడు. గుజరాతీ అమ్మాయి భూమి త్రివేది.. ఆగ్రా అబ్బాయి రాకేశ్ పోటాపోటీగానే నిలిచారు. ఫిల్మిస్థాన్ స్టూడియో హాట్‌హాట్‌గా గడిపింది. ఇప్పటికే తెలుగు సినీ గీతాలతో శ్రోతల అభిమానాన్ని చూరగొన్న తెలుగోడు జాతీయ స్థాయిలో పోటీకి దిగాడని అనటంతోనే - దేశంలోని ప్రతి ఒక్కరూ ఆ గెలుపు మాదే అనుకున్నారు. ఆఖరికి ప్రముఖ నటుడు బాలకృష్ణ సైతం ఎస్‌ఎంఎస్‌లతో ప్రోత్సహించాడు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు. యావత్ దేశాభిమానులు. మరోవైపు బిగ్ బి అమితాబ్, ఆయన భార్య జయాబచ్చన్ సైతం ‘శ్రీరామ్’ వైపు నిలిచారు. న్యాయ నిర్ణేతలు సునీతీ చౌహాన్, అనూమాలిక్, సలీమ్ మర్చంట్.. సైతం మంత్రముగ్ధులై శ్రీరామ్ గానంలో మునిగిపోయారు. ప్రియాంకా చోప్రా.. కరీనా కపూర్‌లైతే తన అభిమానులుగా మారిపోయారు. సోనీ ఛానెల్‌లో రాత్రి 9 గంటల నుంచీ ప్రసారమవుతోన్న ‘ఇండియన్ ఐడల్’ని చూట్టానికి యావత్ భారతావని తెరలకు అతుక్కుపోయింది. కొసమెరుపు ఏమిటంటే - అమితాబ్ ఆశువుగా శ్రీరామ్ గానంపై కవిత్వం చెప్పటమే. ఇంతకంటే ఓ తెలుగువాడికి ఇంకేం కావాలి?!
 జీవిత విశేషాలు (profile) :
 •  పేరు : మైనంపాటి శ్రీరామచంద్ర,
 • పుట్టిన ఊరు : అద్దంకి , 
 • పుట్టిన రోజూ : 19-జనవరి -1986,
 • తండ్రి : యం.వి.యస్ .ప్రసాద్ (హైకోర్ట్ అడ్వకేట్),
 • మతము : హిందూ బ్రాహ్మిన్‌,  
 • చదువు : ఇంజనీరింగ్ , మ్యూజిక్ అండ్ డ్యాన్స్ లో  డిప్లమో  ,
 • పాడిన పాటలు సంఖ్య : 23 సినిమాలలో 46 పాటాలు (2013),6 ఆల్బం లకు సంబంధించి 20 పైగా భక్తి పాటలు .
 • బాల్యము : హైదరాబద్ లో గడిచింది .
పాటలు పాడిన కొన్ని ముఖ్య  సినిమాలు (filmography ): 
 • అస్టాసెమా , 
 • కోతిమూక , 
 • హ్యాపీడేస్ , 
Competitions & Shows * Winner of Indian Idol Season 5 by Sony Entertainment Television. * Winner of Okkare Was conducted by ETV in 2008.(June-December). * Reached Top 18 of Amul STAR Voice of India Was conducted in the year 2007 March. * Finalist in Sye Singer’s Challenge Conducted in the year 2006-07, by ETV. * Qualified for Delhi Finals Sangam Kala Group(Delhi), Was conducted in the year November 2006, by Hero Honda. * Winner. of Radio competition Voice of Andhra, Was conducted in the year 2005-06 by FM radio. * Runner-up. in Relax songs competition, Was conducted by Mr. Ramana Gogula in the year 2005. * Winner. of Ananda Ragam Contest, Conducted by the team of ANAND (movie) in 2004.


 • ===============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog