Chalam.B(cinima art driector)-చలం.బి(కళా దర్శకుడు)

  • image : courtesy with Eenadu cinema paper.
పరిచయం (Introduction) :
  • ఏ పనిలో విజయం సాధించాలన్నా - తపన, కృషి అవసరం అని పెద్దల మాట. ఈ మాటను ప్రపంచంలో ఎందరో రుజువు చేశారు. సినిమా ప్రపంచంలోనూ చేశారు. సినిమా దర్శకత్వ శాఖలో కేవలం అప్రెంటిస్‌గా చేరి- గొప్ప దర్శకులయి పేరు తెచ్చుకున్నవాళ్లు కొందరైతే, మొదట్లో ఎడిటింగ్‌ ఫిల్ము డబ్బాలను మోసి తిరిగినవాళ్లు- ప్రసిద్ధ ఎడిటర్లయిన వాళ్లు కొందరు. అలాగే ఛాయాగ్రాహకులు, ఇతర టెక్నీషియన్లూ..! కళా దర్శకుల విభాగాన్ని పరిశీలిస్తే - స్టూడియోలో బ్యాగ్రౌండ్‌ పెయింటింగ్‌ శాఖలో సహాయకుడిగా చేరి తరవాత తరవాత ఎదిగిన వారు... బి.చలం. కళా దర్శకుడిగా తన శైలిని వెండి తెరపై చూపించారాయన.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : బి.చలం -- కళా దర్శకుడు ,
  • పుట్తిన తేదీ : 1933 లో,
  • జన్మస్థలము : పర్లాకిమిడి (ప్రస్తుతము ఒరిస్సా రాస్ట్రము ),
  • చదువు : 10 వ తరగతి ,
కెరీర్ :
  • బొమ్మలు గీయడం అంటే మహా ఉత్సాహం. అనేక మంది చిత్రకారులు వేసిన చిత్రాలను పరిశీలిస్తూ తానూ చిత్రాలు వేశారు. స్కూలు చదువు తరవాత ఏం చెయ్యాలి? సినిమాలు చూసి, సినిమాలు మీద ఉత్సాహం పెంచుకుని- శ్రేయోభిలాషుల ప్రోత్సాహంతో మద్రాసు చేరుకున్నారు. అప్పుడు వాహిని స్టూడియో నిర్మాణంలో ఉంది. అది 1948వ సంవత్సరం. చలంగారు తను గీసిన చిత్రాలు చూపించి, పెయింటింగ్‌ శాఖ అధిపతుల్ని, తక్కినవాళ్లనీ కలిసి స్టూడియోలో ఉద్యోగం సంపాదించుకున్నారు. అవసరం వచ్చినప్పుడు రాత్రింబవళ్లు పనిచేసి, పెయింటింగ్‌ శాఖలో ప్రావీణ్యం సంపాదించుకున్నారు. ప్రసిద్ధ కళాదర్శకుడు ఎమ్‌.కె.శేఖర్‌గారి మెప్పుపొంది, ఆయన దగ్గర సహాయకూడిగా చేరారు. ఆ సినిమా వాహినివారి 'పెద్దమనుషులు'. చలంగారి పనితనం, చురుకుదనం, ఆలోచన చూసి శేఖర్‌గారు తనదగ్గరే పెట్టుకుని పని నేర్పుతూ ప్రోత్సహించారు. 'బంగారు పాప' చిత్రానికి ముఖ్య సహాయకుడైనారు. మూడేళ్లకు పైగా పెయింటింగ్‌ శాఖ, మరికొన్నేళ్లు కళాదర్శకత్వ శాఖల్లో పనిచేసి, శేఖర్‌గారి ప్రోత్సాహంతో కళాదర్శకుడి స్థానం పొందారాయన. ఆ చిత్రం ప్రతిభా వారి 'ఏది నిజం?'. యస్‌.బాలచందర్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రానికి రాష్ట్రపతి బహుమతి లభించింది. నిదానంగా చలంగారికి అవకాశాలు రాశాగాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ చిత్రాలకూ ఆయన కళాదర్శకుడిగా పనిచేశారు. దాదాపు 800 చిత్రాలో ఆయన తన కళా నైపుణ్యాన్ని చూపించారు.
నటించిన సినిమాలు (filmography ): తెలుగు --- లో కొన్ని ..
  • బంగారు పాప ,
  • ఏది నిజం ,
  • జగదేకవీరుడు అతిలోకసుందరి ,
  • ఆపద్బాంధవుడు ,
  • బృందావనం ,
  • భైరవ ద్వీపం ,
  • శ్రీకృష్ణార్జున విజయం ,
Hindi : కొన్ని
  • Jung (1996)Art DirectorBuy,
  • Gair Kaanooni (1989)Art DirectorBuy,
  • Wafadaar (1985)Art DirectorBuy,
  • Gangvaa (1984)Art DirectorBuy,
  • 1999 Devi ,
  • 1993 Prateeksha (as B. Challam) ,
  • 1986/II Mr. Bharath,
  • 1983 Jeet Hamaari,
  • 1983 Paayum Puli
అవార్డులు :
  • ఏవియమ్‌ స్టూడియో తీసిన 25 చిత్రాలకు ఆయన కళాదర్శకత్వం వహించారు. 1963లో కాంగ్రెస్‌ మహాసభలు జరిగాయి. ఆ సభలకు వేదికల్ని తీర్చిదిద్దారు. ఆ ఆకర్షణీయమైన ఆ సభా ప్రాంగణానికి మురిసిపోయిన పెద్దలు 'ఇందిరాగాంధి అవార్డ్‌'తో చలం గారిని సత్కరించారు. దక్షిణ భారత చలనచిత్ర కళా దర్శకుల సంఘానికి అధ్యక్షులుగా మూడుసార్లు ఎన్నికయ్యారు ఆయన.
మూలము : రావి కొండలరావు గారి పాతబంగారం ... సౌజన్యము తో
  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala