M.S.Reddy(producer)-ఎం.ఎస్.రెడ్డి

పరిచయం (Introduction) :
  • యం.యస్.రెడ్డి గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు రచియిత . చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు..1963 లో నెల్లూరు లో సుందర్ మహల్ థియేటర్ ను నిర్మించారు . హైదరాబాద్ లో ' శబ్ధాలా స్టుడియోను స్థాపించారు . నిర్మాతగా, గేయకవిగా, పద్య కవిగా, పలు సంఘాలకు నాయకుడిగా...తెలుగువారికి దగ్గరైన యం.ఎస్‌.రెడ్డి ఇకలేరు. ఆయన మరణించారన్న (11-డిసెంబర్ 2011) వార్త సినీ అభిమానుల్ని కలవరపర్చింది. మంచి సినిమాలేకాదు, మంచి మనసు కలవారని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆయనకు నివాళి అర్పించారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ఎం.ఎస్.రెడ్డి (పూర్తిపేరు -మల్లెమాల సుందర రామిరెడ్డి ),
  • కలం పేరు : మల్లెమాల ,
  • పుట్టిన తేదీ : 15- ఆగస్ట్ -1925 ,
  • నివాసము : ఫిలిం నగర్ -హైదరాబాద్ ,
  • పుట్టిన ఊరు : అలివిరి గ్రామము -నెల్లూరు జిల్లా , వెంకటగిరి తాలూక ,
  • పిల్లలు : కొడుకు - శ్యాంప్రసాద్ రెడ్డి ,
  • తొలి సినిమా : భార్య (తెలుగు),
  • మరణము : 11.డిసెంబర్ 2011,
కెరీర్ (Career):
  • నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924, ఆగస్టు 15న యం.ఎస్‌.రెడ్డి జన్మించారు. వీరిది కాస్త పేరున్న వ్యవసాయ కుటుంబం. అయినా కూడా కుటుంబ పరిస్థితులు అనుకూలించక చదువుకు దూరమయ్యారు. ఆర్థిక విషయాల్లో తండ్రి జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల యం.ఎస్‌.రెడ్డి బాల్యం కష్టాలబాట పట్టింది. చదువుకోవాలనే ప్రయత్నం సాగలేదు. వ్యవసాయం చేద్దామనుకున్నాడు. అదీ ఫలించలేదు. చివరికి వడ్డెరవాళ్లతో కూలికి సైతం వెళ్లారు. 36 రూపాయాలు సంపాదించారు. ఇందులో నుంచి 20 రూపాయల పెట్టుబడితో తాటి పీచు కొట్టించి అమ్మడం చేశారు.
తర్వాత తంగేడు పూలు, చింతకాయలు, మామిడికాయలు, మిరపకాయలు, పెసలు, మినుములు, కందులు మొదలైనవన్నీ ఆయన వ్యాపార వస్తువులుగా మారాయి. శ్రమకు మించిన ఫలితం లభించింది. కాలాగుణంగా వ్యాపారాన్ని ఎలా నడపాలో నేర్చుకున్నారు. ఈ ప్రయాణంలో కొన్నాళ్లు గడిచాయి. నిద్రాహారాలు మాని చాలా వ్యాపారాలు చేశాడు. తద్వారా ఆయన వద్ద సుమారు 40 వేల రూపాయలు పోగయ్యాయి. అప్పులు చెల్లించి తండ్రి, తాతల భూములు విడిపించారు. జీవితంలో ఆయనకు లభించిన తొలి విజయమిది. రాజకీయ, సాహితీ మిత్రులతో అనుబంధం పెంచుకున్నారు. మరోవైపు మైకా వ్యాపారం ప్రారంభించారు. సుందర్‌ మహల్‌ అనే సినిమా థియేటర్‌ను గూడురులో నిర్మించారు.
  • వ్యాపార నిమిత్తం మద్రాస్‌ పయనం ఆయన్ని సినిమావైపు మరల్చింది. ఓ తమిళ డబ్బింగ్‌ సినిమా హక్కులు కొని, తెలుగులో విడుదల చేశారు. ఆ చిత్రం పేరు 'కన్నెపిల్ల'. 1966 డిసెంబర్‌ 26న విడుదలైంది. అదే రోజు ఎన్టీఆర్‌ కంచుకోట అనే చిత్రం విడుదలైంది. అయినా 'కన్నెపిల్ల' చిత్రం విజయం సాధించింది. తర్వాత కొంటెపిల్ల, కాలచక్రం అనే రెండు డబ్బింగ్‌ సినిమాలు విడుదల చేశారు. ఇవి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. కె.యస్‌.ప్రకాష్‌రావుతో 'భార్య' అనే సినిమాను మొదలెట్టే సమయంలో శ్రీశ్రీ సాంగత్యం లభించింది. శ్రీశ్రీని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి, కొడుకుతో కప్పు కాఫీ అందించి, శ్రీశ్రీ కాళ్లకు నమస్కరించమన్నారట.
1969లో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా 'కలిసిన మనసులు' తీశారు. సినిమా మాత్రం విజయా పిక్చర్స్‌వారు విడుదల చేశారు. సినిమా అపజయం పాలైంది. యం.ఎస్‌.రెడ్డి అప్పటివరకూ సంపాదించిన డబ్బంతా తుడుచు పెట్టుకపోయింది. తర్వాత భారీ తారాగణంతో 'శ్రీకృష్ణవిజయం' తెరకెక్కించారు. ఈ సమయంలో ఇండిస్టీలోని పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఎలా వ్యవహరిస్తారన్న సంగతి స్వయంగా తెలుసుకున్నారట !
  • అందరికీ అంతో ఇంతో కొంతో ఇగో అనే ఫీలింగ్‌ ఉంటుందని పలు సందర్భాల్లో ఆయన చెప్పేవారు. 1971లో విడుదలైన 'శ్రీకృష్ణార్జున విజయం' కొద్ది లాభాలతో బయటపడ్డారు. కానీ 'ఎ.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు తీసిన 'పాండవ వనవాసం' విపరీతమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. శోభన్‌బాబుతో తీసిన 'కోడెనాగు' కూడా మంచి విజయాన్నే అందుకుంది. చిత్రం ఎంత గొప్పగా తీసినా నిర్మాతకు కన్నీళ్లే మిగులుతాయని తను తీసిన 'దొరలు-దొంగలు' చిత్రాన్ని ఉదహరిస్తారు. ఇలా చలన చిత్ర జీవితం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనెక్కి నడిచిందని తన ఆత్మకథలో చెప్పుకొన్నారు. ఆయన కష్టాలో ఉన్నప్పుడల్లా పాత పిక్చర్లలో వచ్చిన లాభాలే గట్టున పడేసాయి.--source : prajasakti news paper
నిర్మించిన /నటించిన కొన్ని సినిమాలు (filmography ):
  • భార్య ,
  • శ్రీకృష్ణ విజయం ,
  • వూరికి ఉపకారి ,
  • కోడెనాగు ,
  • ముత్యాలపల్లకి ,
  • ఏకలవ్య ,
  • పల్నాటి సింహం ,
  • బాల రామాయణం ,
  • అంకుశం ,
  • కన్నెపిల్ల ,
  • కలిసిన మనసులు ,
అవార్డులు :
  • 2005 లో రఘుపతి వెంకయ్య అవార్డు పొందినారు .
  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala