కోలీవుడ్‌లో తెలుగు తంబీలు, Telugu actors in Kollywood

    Image : courtesy with eenadu news paper.

    టాలీవుడ్‌ అంటే తెలుగు చిత్రసీమ. ఇక్కడ హీరోలంతా తెలుగువారే. మరి కోలీవుడ్‌ అంటే... తమిళ చిత్రసీమ. కానీ అక్కడ హీరోలలో తమిళులే కాదు తెలుగువారూ ఉన్నారు. ముఖ్యంగా యువ కథానాయకుల్లో...
కోలీవుడ్‌లో రాణిస్తున్న తెలుగు హీరోల్లో విశాల్‌ ఒకడు. తండ్రి జి.కె.రెడ్డి సినీ నిర్మాత. ఓ సినిమాకి సహాయ దర్శకుడిగా పనిచేసిన విశాల్‌, 2004లో కోలీవుడ్‌లో 'చెల్లమే' సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు. అతడి తమిళ సినిమాలు ప్రేమచదరంగం, సెల్యూట్‌ి, పందెంకోడి, పొగరు, భరణి, భయ్యా, పిస్తా, వాడు-వీడు... పేర్లతో తెలుగులోకీ అనువాదమై వచ్చాయి. ఇంతవరకూ తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ విశాల్‌కు టాలీవుడ్‌లోనూ యాక్షన్‌ హీరోగా మంచి ఆదరణ ఉంది. విశాల్‌ అన్నయ్య విక్రమ్‌కృష్ణ కోలీవుడ్‌లో నిర్మాత. 'రంగం'తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో జీవా. ఇతడు సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆర్‌.బి.చౌదరి కొడుకు. తమిళ్‌లో సుమారు 20 సినిమాలు చేశాడు. సొంత బ్యానర్‌తోనే వెండితెరకు పరిచయమైనా తర్వాత నెమ్మదిగా తనలోని నటుణ్ని నిరూపించుకుని ఇతర నిర్మాణ సంస్థలతోనూ పనిచేశాడు. 'రంగం(కో)'కు ముందు 'డిష్యుం', 'ఈ', 'శివ మనసుల శక్తి'... లాంటి భారీ విజయాలు జీవా ఖాతాలో ఉన్నాయి. జీవా అన్నయ్య రమేష్‌ కూడా కోలీవుడ్‌ హీరో, తెలుగులో 'విద్యార్థి' సినిమా చేశాడు.
  •  



  •  
 * * *
'ఒకరికి ఒకరు'తో తెలుగు ప్రేక్షకుల మెప్పుపొందిన శ్రీరామ్‌, తమిళ చిత్రసీమలో విజయవంతమైన హీరో. రోజాకూటమ్‌(రోజాపూలు)తో కోలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన శ్రీరామ్‌ తర్వాత 'ఏప్రిల్‌ మాదత్తిల్‌', 'పార్తిబన్‌ కనవు'లతో హ్యాట్రిక్‌ విజయాలు సాధించాడు. హైదరాబాద్‌లోనే చదువుకున్న శ్రీరామ్‌ పదేళ్లుగా తమిళ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం శంకర్‌ తీస్తున్న '3 ఇడియట్స్‌' రీమేక్‌లో చేస్తున్నాడు.

అంతా తమిళ సినిమాల్ని తెలుగులోకి డబ్బింగ్‌చేసి సొమ్ము చేసుకుంటే ఇక్కడి సినిమాలను రీమేక్‌చేసి స్టార్‌డమ్‌ సంపాదించాడు 'జయం రవి'. ఇతడు ఎడిటర్‌ వోహన్‌ కొడుకు. తెలుగు 'జయం' రీమేక్‌తో రవి కోలీవుడ్‌లో పరిచయమయ్యాడు. రవి అన్నయ్య రాజానే దీని దర్శకుడు. అది బంపర్‌ హిట్‌. దాంతో రవికి సినిమా పేరే ఇంటిపేరుగా మారిపోయింది. ఈ అన్నదమ్ముల జోడీ తీసిన 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' రీమేక్‌లో అక్కడ ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్నాడు రవి. ఇవే కాకుండా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు', 'కిక్‌'ల రీమేక్‌లోనూ రవి హీరోగా నటించాడు. కోలీవుడ్‌లో నేరుగా తీసిన 'దీపావళి', 'దాస్‌', 'పేరాన్మై'తోనూ విజయాలు సాధించాడు. ఇతడి తమిళ 'ధామ్‌ధూమ్‌' తెలుగులో 'రక్షకుడు'గా అనువదించినా పెద్దగా అలరించలేదు.

మరో దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడు 'ఆది' కూడా తమిళ్‌లో గుర్తింపు ఉన్న నటుడు. విశాఖలో సత్యానంద్‌ దగ్గర నటనలో శిక్షణ తీసుకున్నాడు. 'ఒక విచిత్రం'లో అంతగా ప్రాధాన్యంలేని లారీ క్లీనర్‌ పాత్ర పోషించిన ఆది, తర్వాత కోలీవుడ్‌ వెళ్లి అయిదు సినిమాల్లో నటించాడు. ఈ మధ్యనే డబ్బింగ్‌ చిత్రం వైశాలి(ఈరమ్‌)తో మరోసారి టాలీవుడ్‌లో కనిపించాడు.

తెలుగులో గొడవ, కాస్కో సినిమాలు చేసిన వైభవ్‌, ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కొడుకు. వైభవ్‌ టాలీవుడ్‌లో అంతగా గుర్తింపు సంపాదించలేకపోయినా సరోజ, గోవా వంటి కోలీవుడ్‌ సినిమాల్లో తమిళ ప్రేక్షకుల్ని అలరించాడు. తాజాగా డబ్బింగ్‌ సినిమా 'గ్యాంబ్లర్‌'లోనూ కీలకపాత్ర పోషించాడు.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్‌ తమిళంలో నిర్మాతగా, నటుడిగా, గాయకుడిగా రాణిస్తున్నాడు. నిర్మాత ఎ.ఎమ్‌.రత్నం వారసుడు రవికృష్ణ కూడా తమిళనాడులో గుర్తింపు పొందిన నటుడు.
* * *
హీరోలే కాదు అక్కడ తెలుగు హీరోయిన్లు కూడా ఉన్నారు. హీరో విశాల్‌ వదిన శ్రియారెడ్డి చెన్నైలో స్థిరపడిన తెలుగమ్మాయే. ఈమె పొగరు సినిమాలో నటించింది. షాపింగ్‌మాల్‌(తమిళ అంగాడి తెరు) 'ఫేం' అంజలి సొంతూరు రాజమండ్రి. తెలుగులో 'ఫొటో'తో వెండితెరకు పరిచయమైనా తమిళనాట బాగా ఆదరణ పొందుతోంది. 'అంగాడి తెరు'కి ఫిల్మ్‌ఫేర్‌ అందుకుంది. హైదరాబాద్‌ అమ్మాయి మధుశాలిని కూడా పళనియప్ప కళ్లూరి, పదినారు, అవన్‌-ఇవన్‌లలో నటించింది. కలర్స్‌ స్వాతి కూడా అక్కడ సినిమాలు చేస్తోంది.
కోలీవుడ్‌లోని తెలుగు హీరోలందరి మధ్యా చాలా పోలికలున్నాయి. దాదాపు అంతా చెన్నైలో పుట్టి పెరిగినవారే, తమిళ్‌ డబ్బింగ్‌ సొంతంగా చెప్పుకోగలరు. ఎక్కువ మంది దర్శకనిర్మాతల వారసులు. అంతా గత దశాబ్దంలోనే అరంగేట్రం చేసినవారు కావడం మరో ప్రత్యేకత. అంతకుమించి ప్రయోగాలకు పెద్దపీట వేస్తారు అందుకే వారికంత ఆదరణ.
Source : Eenadu News paper Sunday Magazine.
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala