N.Sankar-ఎన్.శంకర్(film director)

      •  

       
      •  పరిచయం
      నల్గొండ జిల్లా చిరుమర్తి గ్రామానికి చెందిన ఎన్.శంకర్ ‘ఎన్‌కౌంటర్’ చిత్రంతో 1997లో దర్శకుడిగా సినీ పరిక్షిశమలోకి అడుగుపెట్టారు. సామాజిక సందేశంతో పాటు అభ్యుదయ భావాల్ని తన చిత్రాల ద్వారా తెలియజెప్పిన ఎన్. శంకర్ తెలుగు చిత్రసీమపై తనదైన ముద్రను వేశారు. చిత్రాలు దర్శకునిగా ఆయనకు చక్కటి గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో ఆయన నిర్మించిన ‘జై బోలో తెలంగాణ’ యావత్ తెలంగాణ ప్రజల్ని ఉర్రూతలూగించింది. గోవాలో జరిగిన దక్షిణాసియా చలన చిత్రోత్సవంలో కూడా ఈ చిత్రం ప్రదర్శింపబడింది.

      •  హైదరాబాద్ : ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కార వేడుకలకు భారతీయ సినిమాలు ప్రతిపాదించేందుకు ఏటా ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. మొత్తం 17 మంది సభ్యులున్న ఈ కమిటీలో తెలుగు నుంచి ప్రముఖ దర్శకుడు ఎన్‌.శంకర్‌ ఈ యేడు ఎంపికయ్యారు. ఆస్కార్‌ పురస్కారాల్లో విదేశీ భాషా విభాగానికి మన దేశం నుంచి పంపాల్సిన సినిమాల్ని ఈ కమిటీ ఎంపిక చేస్తుంది. ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఈ ప్రక్రియలో ఎన్‌.శంకర్‌ పాల్గొంటారు. ఈయన గతంలో నంది పురస్కార కమిటీ సభ్యునిగా రెండు సార్లు, అధ్యక్షునిగా ఒకసారి వ్యవహరించారు. దీంతోపాటు గోవా ఫిలిం ఫెస్టివల్‌, జాతీయ సినిమా అకాడమీ పురస్కారాల జ్యూరీకి సభ్యునిగానూ పని చేశారు. ప్రస్తుత ఆస్కార్‌ స్క్రీనింగ్‌ కమిటీలో ఈయనతోపాటు నిర్మాత సీవీరెడ్డి కూడా తెలుగు నుంచి సభ్యులుగా ఎంపికయ్యారు. 

      ఇక సీనియర్ దర్శకుడిగా చిత్ర పరిక్షిశమకు చెందిన పలు అవార్డు కమిటీల్లో వివిధ హోదాల్లో పనిచేశారాయన. తాజాగా ఆయన ప్రతిష్టాత్మక ఆస్కార్ ఫిల్మ్ అవార్డు కమిటీ జ్యూరీ మెంబర్‌గా ఎన్నికవటంతో పరిశ్రమ ఆనందం వ్యక్తం చేస్తోంది.
      ఆస్కార్ అవార్డుల కోసం నామినేట్ చేసే భారతీయ సినిమాల్ని ఈ కమిటీ ఎంపికచేస్తుంది. సినిమాకు సామాజిక ప్రయోజనం వుందని బలంగా విశ్వసించే దర్శకుల్లో ఎన్.శంకర్ ఒకరు. ఆయన సినిమాల్లో అంతర్లీనంగా సామాజిక స్పృహ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
      తె లుగులో తొమ్మిది చిత్రాలను రూ పొందించిన ఆయన దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకున్నారు. 
      • 2003 లో నేషనల్ ఫిలిం అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా విశిష్ట సేవలందించిన శంకర్ 2010లో రాష్ట్ర ప్రభుత్వం అందజేసే నంది అవార్డుల కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు. మరో రెండు సార్లు నంది అవార్డుల కమిటీలో జ్యూరీ మెంబర్‌గా పనిచేసిన ఆయన 2009లో గోవా ఫిలిం ఫెస్టివల్‌కు జ్యూరీ మెంబర్‌గా సేవలందించారు. తెలుగు చిత్రసీమకు చెందిన ఎన్.శంకర్ ఆస్కార్ కమిటీ జ్యూరీ మెంబర్‌గా ఎంపిక కావడం పట్ల పలువురు చిత్రసీమకు చెందిన ప్రముఖులు ఆయనకు అభినందనలు అందజేశారు. జాతీయ స్థాయిలోనేగాక, అంతర్జాతీయ స్థాయిలో మన తెలుగు చిత్రసీమ ఖ్యాతి ఇనుమడింపజేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు

      ప్రొఫైల్ :
      • పేరు :  ఎన్.శంకర్,
      • ఊరు :  నల్గొండ జిల్లా చిరుమర్తి (గ్రా),
      • అమ్మ : సక్కుభాయమ్మ , 
      • నాన్న : కే.శే.గురువయ్య 
      • భార్య : మాధవి . 
      • పిల్లలు : బాబు - దినేష్ , పాప - మహలక్ష్మి , .

      filmography :

      తె లుగులో తొమ్మిది చిత్రాలను రూ పొందించి దర్శకుడిగా-------

      • శ్రీరాములయ్య,
      • జయం మనదేరా,
      • భద్రాచలం,
      • ఆయుధం,
      • జై బోలో తెలంగాణ

      source : http://telugu.oneindia.in/movies/spotnews/September 4, 2013

      • ================================

      visiti my website > Dr.Seshagirirao-MBBS.

      Comments

      Popular posts from this blog

      లీలారాణి , Leelarani

      Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

      పరిటాల ఓంకార్,Omkar Paritala