Rohini R - రోహిణి ఆర్


పరిచయం (Introduction) :
  • రోహిణి మలయాళంలో నటించినా తెలుగమ్మాయే...తెలుగులో బాలనటిగా చాలా సినిమాలు చేసింది.ఆమె స్వస్థలం వైజాగ్ జిల్లా అనకాపల్లి .
  • దక్షిణ భారత సినిమా నటి. సినీరంగములో బాల్యనటిగా అడుగుపెట్టిన రోహిణి తెలుగు, తమిళం, కన్నడం మరియు మళయాళం భాషలలో అనేక సినిమాలలో బాల్యనటిగా నటించింది. ఆ తర్వాత కొంతకాలము తర్వాత చాలా సినిమాలలో చెల్లెలి పాత్రలు చేసింది. నవమోహిని లాంటి సినిమాలలో గ్లామర్ పాత్రలు పోషించినా, అంతగా విజయవంతము కాలేదు. రోహిణి సినీ నటుడు రఘువరన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నది. కానీ ఈ వివాహబంధము పొసగక వివాహమైన ఏడు సంవత్సరాలకు విడాకులు తీసుకొని విడిపోయినది.
ప్రతిభావంతమైన వ్యక్తి అయిన రోహిణి ఆ తర్వాత సామాజిక సేవ కార్యక్రమాలు మరియు టీవీ కార్యక్రమాలలో నిమగ్నమైనది. చాలా వ్యవధి తర్వాత కమల్ హాసన్ సినిమా పోతురాజు (తమిళంలో విరుమాండి)లో, అయ్యన్ (తమిళం)లో నటించింది. పోతురాజు సినిమాలో ఒక పరిశోధకురాలి పాత్రలో కనిపించింది. 1995లో పాలగుమ్మి పద్మరాజు కథ ఆధారముగా కె.ఎస్.సేతుమాధవన్ నిర్మించిన ''స్త్రీ '' సినిమాలో ముఖ్యపాత్రను పోషించిన రోహిణి ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకొన్నది.
  • రోహిణి ఎయిడ్స్ వ్యాధిపై ప్రజలలో అవగాహన కల్పించడానికి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నది. స్వయంగా బాల్యనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన రోహిణి బాల్యనటుల అంతరంగంపై "సైలెంట్ హ్యూస్" అనే 52 నిమిషాల నిడివి కల డాక్యుమెంటరీని నిర్మించి దర్శకత్వం వహించింది.
 జీవిత విశేషాలు (profile) :
  • పేరు : రోహిణి . ఆర్ .
  • పుట్తిన ఊరు : అనకాపల్లి --వైజాగ్ జిల్లా -నివాసము వైజాగ సిటీ ,
  • భర్త : రఘువరన్‌ ,
  • పిల్లలు : అబ్బాయి -రిషి ,
  • తోబుట్టువులు : 4 గురు . ముగ్గురు అన్నలు , ఒక తమ్ముడు . నటుడు బాలాజీ ఒక తోబుట్టువు .
సినిమా ప్రవేశము : తన మాటల్లో->మా నాన్నగారికి సినిమాలంటే మొదట్నుండీ ఆసక్తి. మాది వైజాగ్. నాకు నాలుగేళ్ళ వయసులో అమ్మ పోవడంతో మకాం చెన్నై కి మార్చాం. సినిమాల మీద ఆసక్తితో నాన్న స్టూడియోలు తిరుగుతుంటే నేనూ వెంటవెళ్ళేదాన్ని. అలా స్టూడియోలో నన్ను చూసి బాలనటిగా అవకాశమిచ్చారు . నాన్నకూ ఇష్టమే కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండానే నటించేశాను .  

డబ్బింగు ఆర్టిస్ట్ గా చాలా తెలుగు సినిమాల్లో హీరోయిన్‌ లకు డబ్బింగు ఆర్టిస్ట్ గా చేసారు . ఆమె గొంతు గుర్తుపట్టని వారు మాత్రం కొద్ది మందే ఉంటారు. "లేచి పోదామా" అని కవ్వించే గీతాంజలి నాయిక గొంతు, "చాయ్ పిలాతే" అనే "శివ" నాయిక గొంతు రోహిణి గారిదే.  

1996లో ఉత్తమనటి అవార్డు రోహిణి తెలుగులో హీరోయిన్‌గా నటించిన చిత్రం "స్త్రీ". అయితే ఈ చిత్రం విడుదలకు నోచుకోక పోయినా ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రంలో రోహిణి ప్రదర్శించిన నటనకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి అవార్డుతో సత్కరించింది. అలాగే నేషనల్ అవార్డు కూడా ఈమెను వరించింది. వీటితో పాటు.. "వీరుమండి", "తామరైభరణి", "ఒంబదు రూబాయ్ నోట్టు" అనే తమిళ చిత్రంలో రోహిణి పోషించిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.  

బుల్లి తెరలో ప్రవేశం... సినీరంగంతో సత్‌సంబంధాలు కొనసాగిస్తూనే బుల్లితెరలో ప్రవేశించింది. వివిధ సీరియల్ కథలకు స్క్రిప్టులు రాశారు. "వీరుక్కు నీర్" అనే టెలీ ఫిల్మ్‌ కోసం అమెకు 2005లో సాహిత్య అకాడెమీ అవార్డు కూడా వరించింది. అంతేకాకుండా సమాజిక అంశాలను ప్రతిబింభించే అంశాలపై చర్చా వేదికలు నిర్వహించారు. అలాగే తమిళనాడు ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డాక్టర్ ఎంజిఆర్ విశ్వవిద్యాలయం తరపున నిర్మించిన ఎయిడ్స్ అవగాహన షార్ట్‌ ఫిల్మ్స్‌కు ఆమె దర్శకత్వం వహించారు.  

నటించిన సినిమాలు (filmography ):
  • తన ఐదేళ్ళ ప్రాయంలో వెండితెరపై ప్రవేశం చేసిన రోహిణి, దక్షిణ భారత భాషల్లో సుమారు 130 సినిమాలకు పైగా నటించారు.
  • అలా మొదలైంది-హిరో తల్లిగా
  • నాలుగు స్థంబాల ఆట్ ,
  • ఇల్లాలు ,
  • "స్త్రీ"
  • కమల్ హాసన్ సినిమా పోతురాజు (తమిళంలో విరుమాండి)లో,
  • యసోద కృష్ణ -- బాలనటిగా ,

  • ======================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala