గంధం నాగరాజు(రచయిత)-Gandham Nagaraju(writer)

పరిచయం (Introduction) :
  • 'గమ్యం' సినిమాతో తెలుగు చిత్రసీమకి పరిచయమైన రచయిత గంధం నాగరాజు. ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నాగరాజు వయసు 42 సంవత్సరాలు. ఆయన స్వస్థలం నరసరావుపేట. ఖమ్మంలోని ఓ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు. చదువుకొనే రోజుల నుంచే నాటకాలు, నవలలు రాయడం ప్రారంభించారు. ఆయన రాసిన 'స్థితప్రజ్ఞ' నవల పాఠకాదరణ పొందింది. 'ఆలోచించండి' నాటకం పలు వేదికలపై పురస్కారాలు దక్కించుకొంది. ఈ నాటకం చూసే దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్‌) తన 'గమ్యం' చిత్రానికి నాగరాజుతో సంభాషణలు రాయించుకొన్నారు. అంతకు ముందు 'రాగం' చిత్రానికి రాసినా గమ్యంలోని మాటలకి మంచి స్పందన వచ్చింది. ఆ తరవాత 'బాణం'లోనూ పదునైన మాటలు రాశారు. 'ఓంశాంతిఓం', 'గాయం2' 'ఇంకోసారి', 'బెట్టింగ్‌ బంగార్రాజు' చిత్రాలకీ సంభాషణలు అందించారు. .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : గంధం నాగరాజు -రచయిత ,
  • వయసు : 42 సం.
  • పుట్టిన ఊరు : నరసారావు పేట -గుంటూరు జిల్లా,
  • ఉద్యోగము : అధ్యాపకుడు -- ఖమ్మం లో ఓ కళాశాలలో ,
  • తండ్రి : గంధం యజ్ఞ వాల్క్య శర్మ -సబ్ రిజిస్ట్రార్ గా పని చేసేవారు (a famous writer).
  • పెద్ద నాన్న : లోకనాధం -నరసారావు పేట .
  • చదువు : డిగ్రీ .
  • మరణము : 27-04-2011 (గురువారం ఉదయం అంత్యక్రియలు జరిగాయి),
సినిమాలు (filmography ):
  • 'రాగం--2008 (Dialogues),
  • గమ్యం--(2008) Story,Dialogues,
  • 'బాణం--(2009) Dialogues,
  • 'ఓంశాంతిఓం--(2010) Story,Dialogues,
  • 'గాయం2--(2010) Dialogues,
  • ఇంకోసారి'--(2010) Dialogues,'
  • బెట్టింగ్‌ బంగార్రాజు'--(2010) Dialogues,
  • photo source : courtesy with Eenadu news paper
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala