Thursday, February 24, 2011

మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ,Mikkilileni RadhakrishnaMurty

పరిచయం (Introduction) :
 • ప్రముఖ చలనచిత్ర నటులు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ఇకలేరు. మంగళవారం తెల్లవారుజామున 3గంటలకు విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. కొద్ది రోజులుగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడ్డారు. మిక్కిలినేనికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలూ ఉన్నారు. విజయవాడ సమీపంలోని కోలవెన్నులో బాల్యం, విద్యాభ్యాసం సాగింది. చిరుప్రాయం నుంచే జానపద కళలంటే ఆసక్తి కనబరచిన మిక్కిలినేని నాటక కళాకారుడిగా, సినీ నటుడిగా, సాంస్కృతిక పరిశోధకుడిగా పేరొందారు.సుమారు 150 సినిమాలలో నటించారు .
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి ,
 • ఊరు : గుంటూరు జిల్లా లింగాయపాలెంలో ఆయన జన్మించారు.
 • బాల్యం, విద్యాభ్యాసం : కోలవెన్నులో జరిగినది .
 • పుట్టిన తేదీ :07-july-1914లో, వయసు --95 సం.లు ,
 • చదువు : వెటనరీ సైన్స్ లో డిప్లమో ,
 • మరణము :22 -02-2011 ,
 • భార్య : సీతారత్నం
 • పిల్లలు : ఒక కుమారుడు(వెటనరీ డాక్టర్ ) , ఇద్దరు కుమార్తెలు ,
 • మొదటి సినిమా : దీక్ష ,
కెరీర్ :
 • గాంధీజీ పిలుపుతో 15ఏళ్ల ప్రాయంలోనే స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. గ్రామాల్లో పర్యటిస్తూ జాతీయ గీతాలను ఆలపించారు. 1938లో కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుశిక్ష కూడా అనుభవించారు. స్వాతంత్య్రానంతరం నిజామ్‌ నవాబుకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. సతీమణి సీతారత్నంతో కలిసి 'మా భూమి' నాటకాన్ని ఊరూరా ప్రదర్శించారు. ఆ సమయంలోనూ రెండుసార్లు జైలుకి వెళ్లారు. ప్రజానాట్యమండలితో ఆయనకు సన్నిహిత సంబంధాలుండేవి.
 • సినీ నటుడిగా...: ప్రభుత్వ నిర్బంధం పెరగడంతో మిత్రుడు కేఎస్‌ ప్రకాశరావు ప్రోత్సాహంతో సినీ రంగంలోకి ప్రవేశించారు. ప్రకాశరావు దర్శకత్వంలో రూపొందిన 'దీక్ష'లో తొలిసారి మిక్కిలినేని నటించారు. ఆరడుగుల ఆజానుబాహు విగ్రహం, సువిశాల ఫాలభాగం, ఖంగున మోగే కంఠస్వరం... ఇవన్నీ మిక్కిలినేని సొంతం. ఈ అర్హతలే ఆయనకు చిత్రసీమలో ఎన్నో అవకాశాల్ని తెచ్చిపెట్టాయి. ఆయన ఎక్కువ సాత్వికాభినయ ప్రధానమైన పాత్రలే పోషించారు. 'తెనాలి రామకృష్ణ'లో ప్రతినాయక ఛాయలున్న కనకరాజు, 'కులగోత్రాలు'లో సొంతవారినే వంచించే చలపతిగా, 'గుండమ్మకథ'లో హుందా అయిన జమిందారుగా భిన్నమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా ఎన్టీఆర్‌తో కలిసి చేసిన పౌరాణిక చిత్రాలు మిక్కిలినేనికి ఎంతో పేరుని తీసుకొచ్చాయి. 'పాండవవనవాసం'లో దుశ్శాసనునిగా, 'నర్తనశాల'లో ధర్మరాజుగా, 'మాయాబజార్‌'లో కర్ణుడిగా గుర్తుండిపోయే స్థాయిలో హావభావాల్ని ప్రదర్శించారు. గండికోట రహస్యం, బందిపోటు, కథానాయకుడు, పరివర్తన, మంచిమనిషి, భలేతమ్ముడు, పూజాఫలం లాంటి చిత్రాలు మిక్కిలినేనిలోని నటుణ్ని ఆవిష్కరించాయి. ఎన్టీఆర్‌తో కలిసి దాదాపు 150 చిత్రాల్లో నటించారు. ఆయన చివరి చిత్రం 1997లో వచ్చిన 'శ్రీకృష్ణార్జున విజయం'.
నటించిన సినిమాలు (filmography ): రచయితగా: సినిమాల్లో నటిస్తున్నప్పటకీ తన ఉన్నతికి కారణమైన నాటక, జానపద కళారంగాల్ని విస్మరించలేదాయన.
 • 'నటరత్నాలు',
 • 'తెలుగువారి జానపద కళారూపాలు',
 • 'ఆంధ్రనాటక రంగ చరిత్ర' గ్రంథాలను రచించారు.
అవార్డులు : ఈ సేవలకు గుర్తింపుగా
 • 1982లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ,
 • రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆత్మగౌరవ పురస్కారం అందించాయి. పలు సత్కారాలు, పురస్కారాలు ఆయన్ని వరించాయి.
ఫిల్మోగ్రఫీ
 • 1. పులి బెబ్బులి (1983)
 • 2. రామ్ రాబర్ట్ రహీమ్ (1980)
 • 3. దాన వీర శూర కర్ణ (1977) .... ద్రుతరస్త్రుడు
 • 4. సీత కళ్యాణం (1976) .... జనక
 • 5. బాల భరతం (1972) .... ధృతరాష్ట్రాడు
 • 6. సంపూర్ణ రామాయణం (1971) .... జనక
 • 7. బాలరాజు కథ (1970)
 • 8. దేవకన్య (1968)
 • 9. కలిసొచ్చిన అదృష్టం (1968)
 • 10. పల్నాటి యుధం (1966) .... కొమ్మరాజు
 • 11. అంతస్తులు (1965)
 • 12. C.I.D (1965) .... రామదాసు
 • 13. పాండవ వనవాసం (1965) .... దుష్యసనుడు
 • 14. బబ్రువాహన (1964) .... ధర్మరాజు
 • 15. మంచి మనిషి (1964)
 • 16. పూజాఫలం (1964)
 • 17. రాముడు భీముడు (1964)
 • 18. నర్తనశాల (1963) .... ధర్మరాజు 19. తిరుపతమ్మ కథ (1963)
 • 20. లక్షాధికారి (1963)
 • 21. బందిపోటు (1963)
 • 22. పరువు ప్రతిష్ట (1963)
 • 23. శ్రీ కృష్ణార్జున యుధం (1963) .... బలరామ
 • 24. మహామంత్రి తిమ్మరుసు (1962)
 • 25. గుండమ్మ కథ (1962) .... జామిందర్
 • 26. దక్షయజ్ఞం (1962/I)
 • 27. కుల గోత్రాలు (1962) .... చలపతి 28. జగదేక వీరుని కథ (1961) .... ఇంద్రుడు
 • 29. శ్రీ సీత రామ కళ్యాణం (1961) .... జనకుడు
 • 30. రేణుకాదేవి మహత్యం (1960)
 • 31. అప్పు చేసి పప్పు కూడు (1958) .... కింగ్ in the డ్రామా
 • 32. మాయ బజార్ (1957/I) .... కర్ణ
 • 33. సారంగధర (1957)
 • 34. తెనాలి రామకృష్ణ (1956/I) .... కనక రాజు
 • 35. సంతానం (1955)
 • 36. పరివర్తన (1954)
 • 37. మేనరికం (1954)
 • 38. కన్నా తల్లి (1953)
 • 39. పుట్టిల్లు (1953)
 • 40. పల్లెటూరు (1952)
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

 1. అపురూప జ్ఞాపకాన్నిచ్చిన శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ గారికి అశ్రు నివాళి

  visit : http://johnhaidekanumuri.blogspot.com/2011/02/mikkilineni.html

  john hyde

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog