డి.యల్.నారాయణ , D.L.Narayana(producer)

పరిచయం (Introduction) :
  • నిర్మాత డి.ఎల్‌.నారాయణగారు - సాహసం చేసి మూడు 'క్లాసిక్స్‌'ని ధైర్యంగా నిర్మించారు. ఫలితాలు ఆశించారా లేదా తెలీదు. నిరుత్సాహాలు ఎదురైనా సాహసించారు. ఆ మూడూ 'దేవదాసు', గురజాడవారి 'కన్యాశుల్కం', విశ్వనాథవారి 'ఏకవీర'. అవే పేర్లతో ఆ చిత్రాలు 'దేవదాసు' (1953), 'కన్యాశుల్కం' (1955), 'ఏకవీర' (1969)లను నిర్మించారు డి.ఎల్‌. వీటిలో 'దేవదాసు' అనూహ్యమైన విజయం సాధించింది. క్లాసూ, మాసూ తేడా లేకుండా ప్రేక్షకాదరణ పొందింది. ఇన్నేళ్లయినా ఇంకా ఆ చిత్రానికి అదే ఆదరణ లభ్యమవుతోంది. శరత్‌బాబు నవలలోని మూల కథను కాస్త మార్చినా, అది విమర్శలకు నిలబడలేదు గాని, 'కన్యాశుల్కం'లో చేసిన మార్పులు సాహితీవేత్తల చేత ఆక్షేపణలకు గురయ్యాయి. జనరంజకం కోసం, 'విలన్‌' లాంటి గిరీశాన్ని 'హీరో'ని చెయ్యడం, సుఖాంతం చెయ్యడం లాంటి పెనుమార్పులు చేసినా ఆ సినిమా ఆర్థికంగా లాభం సంపాదించలేదు. 'ఏకవీర'కు కీర్తి దక్కిందిగాని, కాసు దక్కలేదు. మంచి సాహిత్యం, సంగీతాలతో ఉన్న మంచి సినిమాగా మాత్రం ప్రశంసలు దక్కించుకుంది. తొలిసారిగా సి.నారాయణరెడ్డిగారు సంభాషణలు రాసిన చిత్రం ఇది!
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ద్రోణావఝల లక్ష్మీనారాయణ ,
  • భార్య : నాంచారమ్మగారు ,
  • పుట్తిన ఊరు : బందరు ,
  • మరణము : 1975లో మరణిస్తే- అంత్యక్రియలు జరపడానికి దగ్గరవారు రావడానికి ఆలస్యం కాగా, రమణరావుగారు (జమున భర్త) ఆ కర్మకాండ నిర్వహించారు.
నటించిన సినిమాలు (filmography ):
  • స్త్రీ సాహసం (1951).తొలి చిత్రం
  • శాంతి (1952),
  • దేవదాసు (1953),
  • కన్యాశుల్కం (1954) చిత్రాలు తీశారు. తర్వాత, తానుగా చందమామ పేరుతో కంపెనీ పెట్టి
  • చిరంజీవులు (1956),
  • దొంగల్లో దొర (1957),
  • సిపాయి కూతురు (1959) చిత్రాలు నిర్మించారు డి.ఎల్‌.
Source : Eenadu cinema --Pathabangaram by Raavi Kondalrao.
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala