తాప్సి , Tapsi

పరిచయ(introduction) :
  • బాలీవుడ్ నటి . 2008 లో మిస్ ఇండియా కాంటెస్ట్ లో తుది జాబితా వరకూ వ్చ్చినది . సంతోషాన్ని , సంతృప్తిని రంగరించి తన నవ్వుల్లోనే చూపగల తాప్సి దర్శకుడు రాఘవేంద్రరావు ' ఝమ్మంది నాదం ' సినిమా తో తెలుగు తెరకు పరిచయం చేసారు . ఈ సినిమాకోసం హీరొయిన్‌ కోసం వెదుకుతున్నట్లు తెలుసుకున్న తాప్సి తన స్టిల్సు పంపించారట . పిలుపురాగా అడిషన్‌ కు వెల్ళగా లక్ష్మీప్రసన్న , రాఘవేంద్రరావు లు తనని ఎంపిక చేసారని తాప్సి మాట . ఈమె మంచి మోడల్ గా పేరుతెచ్చుకున్నారు .
వ్యక్తిగత విషయాలు (profile) :
  • పేరు : తాప్సి ,
  • పూర్తి పేరు : తాప్సి బాను(Tapsee pannu) ,
  • పుట్టిన ఊరు : పంజాబ్ లోని ' లుధియానా "
  • పెరిగింది : డిల్లీ లో
  • పుట్తిన తేదీ : 01-ఆగస్టు -1988,
  • ఎత్తు : 5' 8'' (అయిదు అడుగుల ఎనిమిది అంగులాలు)
  • నాన్న : రియల్ ఎస్టేట్ వ్యాపారి ,
  • అమ్మ : గృహిణి ,
  • తోబుట్టువులు : ఒక చెల్లి - దిగ్రీ చదువుతోంది .
  • చదువు : సాప్ట్ వేర్ ప్రొఫెషనల్--న్యూఢిల్లీలోని గురు టెఘ్ బహదూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ,
  • ఫెవరెట్ హీరోయిన్లు : ప్రియమణి , కరీనాకపూర్ , ప్రియంకచొప్రా , మీరాజాస్మిన్‌,
  • ఫేవరెట్ హీరోలు : తెలుగులో ప్రభాస్ , హిందీలో అమీర్ఖాన్‌ , షాహిద్ కపూర్ ,
  • ఫేవరెట్ దర్శకుడు : మణిరత్నం ,
  • హాబీలు : ఎనిమిదేళ్ల పాతు కథక్ నాట్యము నేర్చుకున్నారు . కొన్ని స్టేజీ షోలు కూడా ఇచ్చారు . ఖాలీ దొరికినప్పుల్ల నాట్యము ప్ర్రాక్టీస్ చేసారు .
హాపీడేస్ : (ఆమె మాటల్లో)-->
  • నాచదువంతా ఢిల్లీలోనే సాగింది. అల్లరి చాలా ఎక్కువ. అందరూ 'ఇదెక్కడి పిల్లరా బాబూ...' అనేవారు. ఇక మా అమ్మను చూడాలి.. తల పట్టుకోకుంటే ఒట్టు. అంతలా ఇబ్బందిపెట్టేదాన్ని. నా ఫ్రెండ్స్‌ అందరిలాగానే నేనూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ అవుదామనుకున్నా మొదట్లో. ఏదో కొత్తగా చేయాలనిపించేది. ఏం చేయాలన్నదానిపై ఎటూ తేల్చుకునేదాన్ని కాదు. అంతా గందరగోళంగా ఉండేది. కానీ చదువులో ఎప్పుడూ టాపే. ఇంటర్‌లో 90 శాతం పైగా మార్కులొచ్చాయి. స్కూల్లో అన్నీ నిబంధనలే. కఠినంగా ఉండేవి. దానికితోడు, నేనే హెడ్‌గర్ల్‌ని కాబట్టి స్కూలు పిల్లలంతా నిబంధనలు పాటించేలా చూడాలి. అలాంటిది కాలేజీకి వచ్చేసరికి ఒక్కసారిగా ఏదో స్వేచ్ఛ వచ్చినట్టనిపించింది. కాలేజీలో ఉండగా పబ్లిక్‌ సమావేశాల్లో ప్రత్యేక అంశాలపై ప్రసంగాలు చేసేదాన్ని. నాకసలు వెుదట్నుంచి స్టేజ్‌ఫియర్‌ లేదు. డాన్స్‌ అంటే చాలా ఇష్టం కాబట్టి కాలేజీలో డాన్స్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి చాలామందికి నేర్పించాను. దాంతో కాలేజీలో బాగా పాపులర్‌ అయిపోయా. ఇంటర్‌ కాలేజీ పోటీల్లో బహుమతులతో వెుదటేడాదికే నాకు మంచి క్రేజ్‌ వచ్చింది. ఆ అభినందనలు నా ఆలోచనల్ని మరోవైపు తిప్పాయి. వోడలింగ్‌పై మక్కువ ఏర్పడింది. దాంతో కాలేజీకి బాగా డుమ్మా కొట్టేదాన్ని. లెక్చరర్లు కోప్పడినా... నాకు మంచి మార్కులు రావడం, అన్నింటా ముందుండే తత్వం చూసి- చూసీచూడనట్లు వూరుకునేవారు. ఇప్పటికీ నా కాలేజ్‌ ఫ్రెండ్స్‌కు నేను చాలా విలువ ఇస్తాను. ఢిల్లీ వెళ్లిన ప్రతీసారీ వారిని కలవకుండా మాత్రం రాను.
  • నటించిన సినిమాలు (filmography) :
తెలుగు
  • ఝుంది నాదం (మనోజ్ సరసన నటించారు )--2010,
  • వస్తాడు నా రాజు ,
  • మిస్టర్ పెర్ఫెక్ట్ ,
  • వీర ,
తమిళం :
  • ఆడుకలమ్‌ .
  • ===========================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala