Thursday, February 18, 2010

సుమన్ బాబు , Suman Babu


పరిచయం :
 • ఈటీవీ సుమన్ గా పేరొందిన రామోజీరావు గారి చిన్న కుమారుడు సుమన్ బాబు చేసిన రెండో సినిమా ప్రయత్నం కూడా ఫలించలేదు. మొదటి చిత్రం ఉషా పరిణయం ఓ స్టేజీ డ్రామా లా ఉందని అందరూ విమర్శిస్తే..ఈ సారి పూర్తి ఎంటర్టైనర్ అందిస్తానని ఈ నాన్ స్టాప్ బోర్ చిత్రాన్ని తీసారు. బుల్లి తెరపై తన అద్భుతమైన క్రియేటివిటీ ని చాటుకున్నారు .
ప్రొఫైల్ :
 • పేరు : చెరుకూరి సుమన్ బాబు ,
 • జన్మ నామం చెరుకూరి సుమన్,
 • ఊరు : హైదరాబాద్ ,
 • పుట్టిన తేదీ : 23-డిసెంబర్ -1966,
 • మరణము : 10-09-2012,
 • పుట్టిన ఊరు : హైదరాబాద్ ,
 • చదువు : B.A , B.C.J.
 • నివాసం హైదరాబాదు
  • ఇతర పేర్లు సుమన్
  • ప్రాముఖ్యత నటుడు
  • వృత్తి జర్నలిజం
  • మతం హిందూ
 • తండ్రి : రామోజీ రావు
 • తల్లి :ఉష ,
 • భార్య : విజయేశ్వరి ,
 • తోబుట్టువులు : కిరణ్ (అన్నయ్య; వదిన : శైలజ కిరణ్ ),
 • పిల్లలు : ఇద్దరు - కొడుకు = సుజయ్‌ , కూతురు =
 • మరణము : ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్. బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు ఇతను. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే 6-9-2012 రాత్రి రాత్రి 12.18 నిమిషాలకు అస్తమించాడు. కాన్సర్ వ్యాదితో.. 07 సెప్టెంబర్ 2012, శుక్రవారం వేకువజామన యశోదా హాస్పిటల్ - హైదరబాద్ లో చనిపోయారు
కెరీర్ :
 • ఈనాడు దినపత్రిక సెంట్రల్ డెస్క్‌లో పనిచేసిన సుమన్ సంపాదకీయ పేజీకి వ్యాసాలు కూడా రాశారు. సుమన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా 1995 ఆగస్టు 27వ తేదీన ఈటీవీ ప్రారంభమైంది. అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, స్నేహ, ఎండమావులు, కళంకిత వంటి ధారావాహికలకు ఆయన కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సమకూర్చారు. కేవలం టీవీ చానెల్ నిర్వహణకే పరిమితం కాకుండా సృజనాత్మక విభాగాల్లోనూ పని చేశారు.
 • ఉషా పరిణయం చిత్రంలో సుమన్ నటించారు. దానికి ఆయనే దర్శకత్వం వహించారు. భాగవత గాథ ఆధారంగా నిర్మించిన చిత్రం అది. ఇందులో ఆయన శ్రీకృష్ణుడిగా నటించారు. ఆ తర్వాత పూర్తిస్ఝాయి వినోదాత్మక చిత్రం నాన్ స్టాప్ నిర్మించారు. ఇది ఆయన దర్శకత్వంలోనే వచ్చింది. ఇందులో ఆయన కథానాయకుడిగా నటించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్న సుమన్ శ్రీహరి స్వరాలు పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ రూపొందించారు. తాను రాసిన గీతాలకు ఆయనే బాణీలు కట్టుకున్నారు.
ఫిల్మోగ్రఫీ :
 • ఉషా పరిణయం
 • నాన్ స్టాప్ (2010),
 • =================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

 1. డాక్టరు గారు మీరు ఇస్తున్న ఇన్ఫర్మెషను చాలా బాగుంది. మీరు ఏమి అనుకోకపోతే ఒక మనవి . తెలుగు టైపింగు దోషాలు కలవు సవరించగలరు.

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog