Rajamma M V - రాజమ్మ ఎమ్.వి



పరిచయం : 
  • ఎమ్.వి.రాజమ్మ దక్షిణ భారతదేశపు కన్నడ నటి. బహుముఖ ప్రజ్ఞాశాలి. కన్నడలోనే కాకుండా భారతదేశంలో మొదటి మహిళా నిర్మాతగా పేరుగాంచింది. తెలుగు, తమిళ, కన్నడం మూడు భాషలలో 100కు పైగా సినిమాలలో నటించి తారగా వెలుగొందింది. ఈమె రాజ్‌కుమార్ తో కలిసి అనేక సినిమాలలో నటించింది, ఆ తరువాత రాజ్ కుమార్ సినిమాలలో తల్లి పాత్రలు కూడా చేసింది.ఈమె పంతులమ్మ వంటి సామాజిక పాత్రలైనా, కిత్తూరు చెన్నమ్మ మొదలైన పౌరాణిక పాత్రలైన వాటికే తనదైన ఒక ప్రత్యేక ముద్ర వేసేది. ఈమె కె.సుబ్రమణ్యం సినిమాలు అనంతశయనం, భక్త ప్రహ్లాద మరియు గోకుల దాసి సినిమాలలో నటించింది.
ప్రొఫైల్ (జీవితవిశేషాలు):
  • పేరు : ఎం.వి. రాజమ్మ ,
  • పుట్టిన ఊరు : అగ్గండనహళ్ళి (బెంగుళూరు గ్రామీణ జిల్లా),
  • పు్ట్టిన తేదీ : *-*-1923,
  • మాతృ భాష : కన్నడ , 
  • చదువు : 8 వ తరగతి (బెంగుళూరు లో), 
  • తల్లి : సుబ్బమ్మ ,
  • తండ్రి : సంజప్ప , 
  • నివాసము : చెన్నై , 
  • మరణము : 24-ఏప్రిల్ -1999 -చెన్నైలో,
కెరీర్ : 
  • ఎనిమిదవ తరగతిలో ఉండగానే ఈమె నాటకాలలో నటించడం ప్రారంభించింది. ఈమె ముఖ్యంగా బి.ఆర్.పంతులు సినిమాలలో కనిపించేంది. ఆయనతో కలిసి పూర్వరంగంలో చంద్రకళా నాటక మండలి స్తాపించి రంగస్థలంపై నటించింది. ఈమె కథానాయకిగా తొలి చిత్రం సింహా యొక్క సమర నౌక. 1943లో రాధా రమణ సినిమా తీయడానికి విజయ ప్రొడక్షన్స్ అనే సొంత నిర్మాణ సంస్థని స్తాపించింది, తరువాత బి.ఆర్.పంతులు సంస్థ పద్మినీ పిక్చర్స్ తో కలిపి సినిమాలు తీశారు. రాధా రమణ ఒక మహిళా నిర్మాతచే నిర్మించిన తొలి సినిమా. ఇందులో దర్శకుడు, రచయిత జీ.వి.అయ్యర్‌ను, నటుడు బాలకృష్ణను సినిమారంగానికి పరిచయం చేసింది.
నటించిన తెలుగు సినిమాలు : 
  • అనంతశయనం, 
  • భక్త ప్రహ్లాద , 
  • గోకుల దాసి ,
  • ============================================

visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala