రఘు యం వి , Raghu M V (cinematographar)

- యన్.టి.రామారావు ------------ M.v.రఘు పరిచయం :
  • మాడపాక వెంకట రఘు (ఎం.వి.రఘు) తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు (సినీమాటోగ్రాఫర్) మరియు దర్శకుడు. ఈయన వివిధ భాషలలో యాభైకి(50) పైగా సినిమాలకి,10 డాక్యుమెంటరీలకి ఛాయగ్రాహణం నిర్వర్తించారు. రెండు సినిమాలకి దర్శకత్వం వహించారు. ఛాయగ్రాహకునిగా మరియు దర్శకునిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డులతో పాటు వివిధ సాంస్కృతిక సంస్థల నుండి యాభైకి పైగా అవార్డులు పొందిన లబ్దప్రతిష్టుడు.
ప్రొఫైల్ :
  • పేరు : మాదపాక వెంకట రఘు ,
  • పుట్టిన తేది : ౦౫-అక్టోబర్ -౧౯౫౪ .
  • పుట్టిన ఊరు : విజయవాడ ,
  • నివాసము : హైదరాబాద్ ,
  • ఇతర పేర్లు : యం . వి . రఘు ,
  • వ్రుత్తి : ఛాయాగ్రాహకుడు /సినీ దర్శకుడు ,
  • మతము : హిందూ ,
  • భార్య : లక్ష్మి ,
  • పిల్లలు : దిలీప్ , ధీరజ్ ,
  • తండ్రి : యం.యస్.చిన్నయ్య ,
  • తల్లి : యం .నాగేస్వరమ్మ ,
  • చదువు : బి.యస్.సి . , ఫోటోగ్రఫి లో డిప్లమో
సినీరంగ ప్రవేశం
  • రఘు తండ్రి చిన్నయ్య, నేపథ్యగాయకుడు పిఠాపురం నాగేశ్వరరావు మంచి స్నేహితులు. చిన్నయ్య కొడుకు గురించినాగేశ్వరరావుకు సిఫారుసు చేయగా, ఆయన తన ఇంట్లో అద్దెకుంటున్న కెమెరామెన్ వి.ఎస్.ఆర్.స్వామితో రఘవిషయమై ప్రస్తావించాడు. ఇలా 1976లో వి.ఎస్.ఆర్.స్వామి సహాయంతో రఘు విజయవాహినీ స్టూడియోసహాయకునిగా చేరాడు. కెమెరా విభాగంలో సహాయకునిగా రఘు తొలి చిత్రము, శివాజీ గణేషన్ కథానాయకునిగాదర్శకుడు యోగానంద్ నిర్మించిన గృహప్రవేశం. సినిమాను స్టూడియోలోని నాలుగవ అంతస్థులో చిత్రీకరించారు.
ఫిల్మోగ్రఫీ :
  • చిత్రము ------- నటీ నటులు - విడుదల సంవత్సరము- భాష - బాధ్యతలు
  • మగమహారాజు- చిరంజీవి,సుహాసిని- 1983- తెలుగు- ఛాయాగ్రాహకత్వం
  • సితార-------- భానుప్రియ, సుమన్- 1983- తెలుగు - ఛాయాగ్రాహకత్వం
  • స్వాతిముత్యం- కమలహాసన్, రాధిక - 1985- తెలుగు - ఛాయాగ్రాహకత్వం
  • అన్వేషణ----- కార్తీక్, భానుప్రియ- 1985- తెలుగు - ఛాయాగ్రాహకత్వం
  • సంసార్------ రేఖ,రాజ్ బబ్బర్,అనుపమ్ ఖేర్- 1985- హిందీ- ఛాయాగ్రాహకత్వం
  • మేరా పతీ సిర్ఫ్ మేరా హై- జితేంద్ర, రేఖ, రాధిక- 1990- హిందీ- ఛాయాగ్రాహకత్వం
  • ఏప్రిల్ 1 విడుదల- రాజేంద్రప్రసాద్,శోభన- 1991- తెలుగు ఛాయాగ్రాహకత్వం
  • డిటెక్టివ్ నారద-- మోహన్ బాబు,మోహిని,నిరోషా- 1993- తెలుగు- ఛాయాగ్రాహకత్వం
  • వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్- వినీత్,ఆవని,ఎస్.పీ.బాలసుబ్రమణ్యం,జె.డి.చక్రవర్తి- 1998- తెలుగు- ఛాయాగ్రాహకత్వం
visiti my website > http://dr.seshagirirao.tripod.com/

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala