Monday, August 24, 2009

సెంథిల్ కుమార్ , Senthil Kumar

పరిచయం :
 • సెంథిల్ కుమార్ నైపుణ్యం పొందిన సినిమా ఫోటోగ్రాఫర్ . పుట్టుకతో తమిళియన్ అయినా హైదరాబాద్ లో పెరిగారు .
ప్రొఫైల్ :
 • పేరు : సెంథిల్ కుమార్ ,
 • చదువు : గ్రాడ్యుయేట్ - పూణే ఫిలిం ఇన్స్టిట్యుట్ ,
 • భార్య : రుహీ ( మ్యారేజ్ డేట్ -25 జూన్ 2009)యోగా టీచర్ ,
 • పిల్లలు : ఒక అబ్బాయి - రేయాన్‌ కార్తికేయ ,
 • కుటుంబ సబ్యులు : అమ్మ , నాన్న , ఇద్దరు చెల్లెల్లు . తనే పెద్ద వాడు .
 • మొదటి సినిమా : అదర్ -మరాటి ఫిలిం(మొదటి ఫిలిం) , ఐతే (Aithey) తెలుగు ,
కెరీర్ :
 • చిన్నప్పటి నుంచి సినిమాలు చూడ్డం వరకే గానీ ఎప్పుడూ ఈ పరిశ్రమలోకి రావాలనుకోలేదు. వస్తానని కనీసం కలలోనైనా వూహించ లేదు. ఎందుకంటే మొదట్నుంచి నేను క్రికెట్‌ అభిమానిని. ఎప్పటికైనా పెద్ద క్రికెటర్‌ని అవ్వాలనుకునేవాణ్ని. కపిల్‌దేవ్‌ అంటే చాలా ఇష్టం. స్కూల్‌, కాలేజీ స్థాయుల్లో బాగా ఆడేవాణ్ని కూడా. కానీ డిగ్రీకొచ్చేసరికి... క్రికెట్‌లో ఎదగాలంటే చాలా రాజకీయాలు ఉంటాయని అర్థమైంది. వాటన్నిటినీ నెగ్గుకువచ్చే నేపథ్యం నాకులేదు. దాంతో నా ఆలోచన సివిల్‌ సర్వీసెస్‌ వైపు మళ్లింది. డిగ్రీ అయిపోగానే సివిల్స్‌కి అప్త్లె చేశాను. ఈలోగా ఆ మూడ్‌లో ఉండటానికని ఆర్‌ఆర్‌బీ, బ్యాంకింగ్‌... ఇలా అన్ని ప్రవేశపరీక్షలూ రాస్తుండేవాణ్ని.
ఆ సమయంలోనే నా స్నేహితుడు ఒకడు పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అప్లికేషన్‌ తెచ్చుకున్నాడు. అందులో చేరడానికి కనీస అర్హత డిగ్రీ. కానీ అతని డిగ్రీ ఇంకా పూర్తికాలేదు. ఫైనలియర్లో ఉన్నాడు. దాంతో ఆ దరఖాస్తు ఫారం నాకిచ్చాడు. అప్పటికి నేను రాస్తున్న మిగతా పరీక్షల్లాగే ఇది కూడా అనుకుని దాన్ని నింపాను. అందులో నాలుగు కోర్సులున్నాయి. డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌, సౌండ్‌ రికార్డింగ్‌. సరదాగా 'సినిమాటోగ్రఫీ' ఆప్షన్‌ని టిక్‌ చేశా.
 • సివిల్స్‌కి ప్రిపేరవుతున్నాను కాబట్టి నాకు ఆ పరీక్ష పెద్ద కష్టమనిపించలేదు. సినిమా గురించి అస్సలు ఐడియా లేని నేను... పరీక్షల్లో భాగంగా ఒక వారం రోజులపాటు పుణె ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడు ఓ కొత్తప్రపంచాన్ని చూశాను. అప్పటిదాకా నాకు తెలిసిన గొప్ప దర్శకుడంటే మణిరత్నం. అలాంటిది వెుదటిసారి అక్కడ అకిరా కురొసావా, గొడార్డ్‌ లాంటి గొప్ప దర్శకుల సినిమాలు చూసేసరికి మతిపోయింది. ఇక సివిల్‌సర్వీసెస్‌ గురించి మర్చిపోయాను.
ఫిల్మోగ్రఫీ : అసిస్టెంట్ గా :
 • ప్రేమకు వేళాయెరా ,
 • జాబిలి ,
టీవీ సేరియల్స్ :
 • అమృతం ,
సినేమతోగ్రఫార్ గా :
 • ఐతే ,
 • సై ,
 • ఛత్రపతి ,
 • అశోక్ ,
 • అరుంధతి ,
 • యమదొంగా ,
 • త్రీ ,
 • మగధీర ,
 • అదర్ -మరాటి ఫిలిం(మొదటి ఫిలిం)

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog