రాధాకృష్ణ భమిడిపాటి , Radhakrishna Bhamidipati

పరిచయం :
  • భమిడిపాటి రాధాకృష్ణ ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. భమిడిపాటి రాధాకృష్ణ క్యాలెండర్‌ పేరిట క్రీస్తుపూర్వం 45 నుంచి క్రీస్తుశకం 5555 వరకు అంటే ఆరు వేల సంవత్సరాల క్యాలెండర్‌ రూపొందించారు. జ్యోతిషరంగంలో కూడా ఆయనకి పట్టు ఉంది. సంఖ్యాశాస్త్రపరంగానే కాకుండా చిన్నారుల నామకరణ సమయంలో బియ్యంలో రాసే అక్షరాలను బట్టి కూడా ఆయన జాతకాలు చెబుతారనే పేరుంది. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ప్రోద్బలంతో సినీ రంగంలోకి ప్రవేశించి 150 సినిమాలకు కథలందించారు. ఇందులో కె.విశ్వనాథ్‌ తొలి చిత్రమైన ఆత్మగౌరవం కూడా ఉంది.
ప్రొఫైల్ :
  • పేరు : రాధాకృష్ణ భమిడిపాటి ,
  • పుట్టిన ఊరు : రాజమండ్రి ,
  • పుట్టిన తేది : 24 నవంబర్ 1929 ,
  • మరణము : 04 సెప్టెంబర్ 2007 - ఆస్తమా , ఉపిరి తెత్తుల వ్యాది తో ,
  • తండ్రి. : ప్రముఖ హస్య రచయిత, "హాస్య బ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు
  • భార్య : సుశీల ,
  • సంతానము : ఒక కుమార్తె , ఐదుగురు కుమారులు ,
ఫిల్మోగ్రఫీ : నాటికలు, నాటకా లు :
  • ఇదేమిటి,
  • కీర్తిశేషులు,
  • మనస్తత్వాలు,
  • భజంత్రీలు,
  • దంత వేదాంతం
కధలు వ్రాసిన చిత్రాలు :
  • బ్రహ్మచారి,
  • కథానాయకుడు,
  • కీర్తిశేషులు,
  • మరపురాని కథ,
  • విచిత్ర కుటుంబం,
  • పల్లెటూరి బావ,
  • ఎదురులేని మనిషి,
  • గోవుల గోపన్న,
  • సీతారామ కళ్యాణం,
  • నారీనారీ నడుమ మురారి,
  • కాలేజీ బుల్లోడు

Comments

  1. భమిడిపాటి రాధాకృష్ణగారి గురించి ఇంకో విషయం --' ఆయన సిధ్ధం చేసుకున్న జ్యోతిష్యం ఎంత నిర్దుష్టంగా సాగిందో చెప్పడానికి ఓ ఉదాహరణ, ఆయన పుస్తకంలో "2007 సెప్టెంబర్ 4 న గంట కొట్టేస్తానూ " అని రాసుకున్నారు. సరీగా అదే రోజున తన 78 వ ఏట కన్ను మూశారు ' ...గొల్లపూడి మారుతీరావు గారు " భమిడిపాటి జ్ఞాపకాలు" వ్యాసంలో వ్రాశారు.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala