నరసింహారావు కోరాడ , Narasimharao Korada

పరిచయం :
  • కోరాడ నరసింహారావు - ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యుడు. కోరాడ నరసింహారావు భారత తొలి ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల సమక్షంలో నాట్యం చేయడమే కాక 23 దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించారు . భారతదేశ మొట్టమొదటి మిస్‌ ఇండియా 'పద్మభూషణ్‌' ఇంద్రాణి రెహమాన్‌, పద్మ విభూషణ్‌ యామిని కృష్ణమూర్తి, వైజయంతి మాల, రీటా చటర్జీ, గోపీకృష్ణ, హేమమాలిని, శాంతారామ్‌లకు కూచిపూడి నృత్యంలో శిక్షణ ఇచ్చారు .
ప్రొఫైల్ :
  • పేరు : కోరాడ నరసింహారావు ,
  • ఊరు : పవర్ పేట -ఏలూరు , పశ్చిమ గోదావరి జిల్లా ,
  • పుట్టిన సం. : 1936 ,
  • మరణము : 04 -జనవరి 2007 , హైదరాబాద్ లో
  • పిల్లలు : ఒక కుమారుడు , ఒక కుమార్తె ,
ఫిల్మోగ్రఫీ :
  • గిరిజ కళ్యాణం ,
  • రహస్యం (వేదాంతం రాఘవయ్య నిర్మించినది)
పురస్కారాలు :
  • 1960లలో ప్యారిస్‌లో జరిగిన విశ్వ నాట్యోత్సవాలలో కోరాడ ప్రదర్శించిన కూచిపూడి దశావతారాల ప్రదర్శనకు ప్రపంచ ఉత్తమ పురుష నర్తకుడిగా బహుమతి పొంది జగద్విఖ్యాతుడయ్యారు .
  • కోరాడ నరసింహారావును భరత కళాప్రపూర్ణ, కళాసరస్వతి లాంటి బిరుదులతో పాటు కేంద్ర, ర్రాష్ట ప్రభుత్వాలు అనేక సత్కారాలు, పురస్కారాలతో గౌరవించాయి.
  • నాట్యరంగంలో ఆయన విశిష్ట సేవలకు గాను కేంద్ర సంగీత నాటక అకాడమీ 2005 అవార్డును రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా 2006 మార్చి 20వ తేదీన న్యూఢిల్లీలో అందుకున్నారు.
మూలము : ఇంటర్నెట్.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala