సుధా చంద్రన్ , Sudha chandran
పరిచయమ :
- మయూరి చిత్రం తరువాత ‘కాలం మారి కథ మారి’ అనే చిత్రంలో నటించినా ఆ తరువాత బాలీవుడ్ రంగప్రవేశం చేసింది. ‘పతి పరమేశ్వర్’తో మొదలైన బాలీవుడ్ ప్రస్థానం మరెన్నో సినిమాల దారితీసింది. దాదాపు ఇరవైకి పైగా సినిమాల్లో నటించింది. వీటిలో 1994లో వచ్చిన అంజామ్ సినిమా నటిగా సుధాచంద్రన్‌కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
నెమలికి సైతం నాట్యం నేర్పగలిగే నేర్పరి. ఆమె పాదాలు కదిపితే భరతనాట్యం పరవశిస్తుంది, కూచిపూడి ఆనంద పారవశ్యంలో మునిగిపోతుంది. దాదాపు అన్ని భారతీయ సంప్రదాయ నృత్యాలను అవపోసనపట్టిన ఆమెకు నాట్యమంటే ప్రాణం. ఆమె కేవలం నర్తకి మాత్రమే కాదు నటి కూడా తన అద్భుతమైన నటనతో ఎన్నో సినిమాలకు, టీవి సీరియళ్ళకు ప్రాణ ప్రతిష్ట చేసింది. విధివంచనకు గురై కాలును పోగొట్టుకొన్నా... మొక్కవోని ధైర్యంతో నిలబడి ఆ విధినే సవాలు చేసిన ధీరవనిత. ఆమే సుధాచంద్రన్. నర్తకిగానే కాకుండా నటిగాకూడా ఈమె కొల్లగొట్టిన అవార్డులకు అంతేలేదు. మయూరి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించన నాట్య మయూరి సుధాచంద్రన్. జీ తెలుగు ఛానల్ నిర్వహిస్తున్న మగధీర డ్యాన్స్ రియాలిటీ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ద్వారా చాలాకాలం తరువాత మళ్ళీ తెలు గు ప్రేక్షకులకు కనువిందు చేయ బోతోంది.సుధాచంద్రన్ జీవితచరిత్ర ఆధా రం గా రామోజీరా వు నిర్మించిన మ యూరి సినిమా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకు ల గుండెల్లో మెదులుతూనే ఉంటుంది. 1984లో విడుదలైన ఈ సిని మా కొన్ని చోట్ట సిల్వర్ జూబ్లీని సైతం పూర్తి చేసుకొని సంచలనం సృష్టించింది. అంతేకాదు హిందీలో నాచే మయూరి పేరుతో పునర్నిర్మాణం జరుపుకొని అక్కడకూడా సూపర్ హిట్టయింది. ప్రాథమిక విద్యార్థుల తెలుగు పాఠ్యపుస్త కాల్లో ఎందరికో స్ఫూర్తిదా యకమైన ఆమె జీవితచరిత్రను పాఠ్యాంశంగా అందించడం విశేషం. - సుధా చంద్రన్ పేరు వింటే చాలు ఎంతో మంది ఉత్తెజితులవురారు . వికలాంగు లకు ఆమె ఒక స్పూర్తి . ఓటమి లోంచివిజయాన్ని వెతుక్కున్న సుధా ఇప్పుడు ఇండియన్ టెలివిజన్ లో మంచి పేరు తెచ్చుకున్నారు . డాన్సర్ గాను , మోడల్ గాతన కెరీర్ ని మొదలు పెట్టి తెలుగులో " మయూరి " సినిమా ద్వార పరిచయ మయ్యారు . 1982 లో ప్రమాదము లో కాలుపోగొట్టుకొని జైపూర్ లో పెట్టిన కుత్రిమ కాలు తో అవిటి తనమని కుడా చూడకుండా నాట్యం చేస్తూ కెరీర్ ని తిరిగి ప్రారంభించి , వికలాంగులకు సేవ చేస్తూ జీవితం సాగిస్తున్నారు . బి.జె.పి. పార్టీ లో చేరి సమాజ సేవ చేసేందు కు సిద్ధం గా ఉన్నారు .
- పేరు : సుధా చంద్రెన్ ,
- పుట్టిన తేది : 21-సెప్టెంబర్ - 1964 ,
- పుట్టిన ఊరు : - - కేరళ స్టేట్--born in Tamil family .
- నివాసం : ముంబై ,
- చదువు : బి.ఎ.(ముంబై లో) ఎం.ఎ. (ఎకనామిక్స్ ),
- భర్త : Ravikumar Dang,
- మతము : కేరళ బ్రాహ్మిన్, హిందూ.
- తోబుట్టువులు : లేరు . తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు.
- నాన్న : Mr.K.D.Chandran,
- అమ్మ : Mrs.Thangam
- Sathyam(2008) - Sathyam's mother
- Shaadi Karke Phas Gaya Yaar (2006) .... Doctor
- Malamaal Weekly (2006) .... Thakurain
- Tune Mera Dil Le Liyaa (2000) .... Rani (Veeru's girlfriend)
- Hum Aapke Dil Mein Rehte Hain (1999) .... Manju
- Milan (1995) .... Jaya
- Raghuveer (1995) .... Aarti Verma
- Anjaam (1994) .... Shivani's sister
- Daldu Chorayu Dhire Dhire
- Baali Umar Ko Salaam (1994)
- Phoolan Hasina Ramkali (1993)
- Nishchaiy (1992) .... Julie ... aka Nishchay (India: Hindi title: video box title)
- Inteha Pyar Ki (1992) .... Dancer at Tania's wedding
- Qaid Mein Hai Bulbul (1992) .... Julie
- Insaaf Ki Devi (1992) .... Sita S. Prakash
- Kurbaan (1991) .... Prithvi's sister
- Jaan Pechaan (1991) .... Hema
- Jeene Ki Sazaa (1991) .... Sheetal
- Thanedaar (1990) .... Mrs. Jagdish Chandra
- Pati Parmeshwar (1990)
- Kalam Mari Katha Mari (1987)
- Mayuri (film) (1984)
- Naache Mayuri (1986) .... మయూరి