ఝాన్సీ , Jhansi(anchor)


--

  •  






పరిచయం :

  • ఝాన్సీ చిన్న వయసు లోనే బుల్లితెర నటి గా జీవితాన్ని ప్రారంభించి .. తరువాత యాంకర్ గా బుల్లితెర పై ఎన్నోప్రయోగాలతో అలరించి , అనంతరం కేరక్టర్ నటిగా మారింది .ఝాన్సీ... టీవీ చూసే వాళ్లకి ఆమెను పరిచయం చేయక్కర్లేదు. పద్దెనిమిదేళ్ల నుంచి ప్రేక్షకులకి సుపరిచితురాలు. ప్రతిరోజూ ఏదో ఒక కార్యక్రమంతో తనదైన శైలిలో అలరిస్తోంది. మన రాష్ట్రంలోని అన్ని యాసల్లో మాట్లాడి, హావభావాలతో సహా అనుకరించే అమ్మాయి ఝాన్సీ .
ప్రొఫైల్ :
  • పేరు : ఝాన్సీ ,
  • అమ్మ పేరు : శారద అల్ ఇండియా రేడియో లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా రిటైరయ్యారు .
  • నాన్న : ఎలక్ట్రికల్ కంట్రాక్టర్ .
  • పుట్టిన ఊరు : విజయవాడ ( అమ్మ వాళ్ల ఊరు)
  • పెరిగిన ఊరు : హైదరాబాద్ ,
  • చదువు : బి.ఎ.
  • భర్త : జోగి నాయుడు ,
  • పిల్లలు : ఒక కూతురు - ధన్య.
  • ఇష్టమైన హీరోలు : నాగార్జున , జగపతి బాబు , రాజేంద్రప్రసాద్ ,
  • ఇష్టమైన హీరోయిన్స్: సౌందర్య ,ఛార్మి ,

కెరీర్ : తన మాటల్లో ->
  •  నేను పదిహేడో ఏటనే ఈ రంగంలోకి వచ్చానని చాలామందికి తెలియదు. మాది విజయవాడ. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాం. అమ్మ శారద ఆలిండియా రేడియాలో పని చేసేది. ఆదివారం వచ్చిందంటే చాలు అమ్మతో కలిసి నేనూ, తమ్ముడూ 'బాలానందం' వంటి కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లం. అమ్మ మాతో పుస్తకాలు బాగా చదివించేది. నాకు తెలుగు భాష మీద మంచి పట్టు ఉందంటే అది అమ్మ వల్లనే చెప్పాలి. ఇప్పటికీ నేను పుస్తకాలు చదవకుండా నిద్రపోను. మా ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉంది.

ఐఏఎస్‌ అవ్వాలనుకున్నా...
నేను బాగా చదివేదాన్ని. ఐఏఎస్‌ అవ్వాలనేది నా లక్ష్యం. టీవీలూ, సినిమాల మీద ధ్యాస ఉండేది కాదు. చిన్నప్పుడు అమ్మానాన్నలు 'అశ్విని', 'సూపర్‌ మ్యాన్‌'... ఈ రెండు సినిమాలే చూపించారు. కాలేజీలో చేరాక కూడా సినిమాలు చూసింది లేదు. కోఠి విమెన్స్‌ కాలేజీలో డిగ్రీ చదివేప్పుడు మా అమ్మ స్నేహితురాలు దూరదర్శన్‌లో ఓ సీరియల్‌ తీస్తున్నారు. 'ఇందులో ఝాన్సీ నటిస్తే బాగుంటుంది' అని మా ఇంటికొచ్చి అడిగింది. 'చదువు మానకుండా నటిస్తే అభ్యంతరం లేదు' అని అమ్మ అనడంతో 1995లో 'విజేత' అనే ధారావాహికలో ప్రధాన పాత్రలో నటించా. మొదటిసారి నన్ను నేను తెర మీద చూసుకున్నప్పుడు నాకు నేను నచ్చలేదు. ఇంత సన్నగా ఉన్నానేంటి అనుకున్నా. ఆ తరవాత 'అందెల రవళి', 'మువ్వల సవ్వడి'.. కొన్ని కార్యక్రమాలూ, నాలుగు ధారావాహికలూ చేశా. క్షణం తీరిక లేకుండా బిజీగా మారా. దాంతో రోజూ కాలేజీకెళ్లి చదవడం కుదరలేదు. డిగ్రీ, పీజీ దూరవిద్యలో పూర్తి చేశా.

గమనించి గెటప్‌లు వేశా...
1996లో శాటిలైట్‌ ఛానళ్ల ప్రస్థానం మొదలైంది. 'పోస్ట్‌బాక్స్‌ నంబర్‌ 1562', 'టాప్‌టెన్‌', 'స్టూడియో రౌండప్‌', 'కౌంట్‌డౌన్‌', 'సండేసందడి'.... ఇలా కార్యక్రమాలు వెల్లువలా వచ్చాయి. జెమినీలో వచ్చిన 'టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌' అయితే పదేళ్ల పాటు ప్రసారమైంది. వారానికో కొత్త రకం గెటప్‌లో కనిపించేదాన్ని. ఆ పాత్రలన్నీ ఎలా పుట్టుకొచ్చాయంటే... నేను బయటికెళ్లినప్పుడు కండక్టర్లూ, డ్రైవర్లూ, వైద్యులూ, న్యాయవాదులూ... ఇలా కనిపించిన వాళ్లందరి విధులూ, భాష, యాస, దుస్తులను గమనించేదాన్ని. వాటినే పాత్రలుగా పోషించేదాన్ని. సీరియళ్ల విషయానికొస్తే ఈటీవీ 'మనోయజ్ఞం', రాఘవేంద్రరావు గారి 'శాంతి నివాసం' మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. కాలేజీలో చేయాల్సిన అల్లరి అంతా తోటి నటులతో సెట్‌లో చేసి ఆ లోటు తీర్చుకున్నా.

హీరోయిన్‌గా నంది అందుకున్నా...
ఓల్గాగారు రాసిన కథ ఆధారంగా అక్కినేని కుటుంబరావుగారు తీసిన 'తోడు'లో ప్రధాన పాత్ర చేశా. అది విడుదల కాలేదు. కానీ నాకు నందిని తెచ్చిపెట్టింది. 'ఎగిరేపావురమా' నా మొదటి సినిమా. 'జయం మనదేరా!', 'తులసి', 'సింహా'.. సినిమాలకు నందులు అందుకున్నా. టీవీలో చేసిన రెండు కార్యక్రమాలకూ నందులు దక్కాయి. నాకు బాగా ప్రత్యేకంగా అనిపించిన కార్యక్రమం 'బ్లాక్‌'. అదెంత హిట్‌ అయ్యిందంటే... 'ఝాన్సీ, బ్లాక్‌' అని రాసిన ఉత్తరాలూ నన్ను చేరాయి. అదంతా ఈటీవీ గొప్పతనమే. అయితే ఒకానొక సమయంలో 'బ్లాక్‌', 'బ్రెయిన్‌ ఆఫ్‌ ఆంధ్ర', 'నవీన' వంటి సీరియస్‌ కార్యక్రమాలకు పరిమితమియ్యా. అదీకాక ఆ సమయంలో బాగా లావయ్యా. అవకాశాలు తగ్గాయి. గేమ్‌ షోలు చేద్దామంటే ఎవరూ పిలవలేదు. ఆఖరికి ఓ ఛానల్‌ నిర్వహకులు 'అబ్బే... తను వినోదానికి పనికి రాదు' అనేశారు. దాంతో నాలో కసి పెరిగింది. కష్టపడి బరువు తగ్గా. నాలుగేళ్ల తరవాత అంటే గతేడాదే 'లక్కుకిక్కు'తో ఉత్సాహంగా కనిపించా. విమర్శించిన వాళ్లకి రేటింగ్స్‌తో సమాధానం చెప్పా. తరవాత 'కో అంటే కోటి', 'బాక్సులో బంగారం' మీకు తెలిసినవే!

శక్తిమంతుల జాబితాలో...
  • 2005లో ఇండియాటుడే దేశవ్యాప్తంగా అత్యంత శక్తిమంతులూ, ప్రభావితుల జాబితాను విడుదల చేసింది అందులో నా స్థానం పాతిక. ముఖచిత్రంలో అమితాబచ్చన్‌, బాలూగారు, రామోజీరావుగారు... వాళ్ల పక్కన నా ఫొటో కూడా వేశారు. ఆ గుర్తింపు ముందు ఎన్ని అవార్డులైనా బలాదూరే! అవకాశాలు వచ్చినప్పుడు పొంగిపోలేదు. రానప్పుడు కుంగిపోలేదు. పరిస్థితులకు తగ్గట్టు నన్ను నేను మలుచుకుంటా. నీటి ప్రవాహం నాకు ఆదర్శం. ప్రవాహానికి అడ్డు వస్తే నీళ్లు అక్కడే ఆగిపోవు. కొత్తదారి వెతుక్కొని కొండల్లో జలపాతాలుగా, రాళ్లమధ్య పాయలుగా, ఇసుక మేటల్లో ఏర్లుగా ప్రయాణాన్ని సాగిస్తాయి. నేనూ అంతే! ప్రస్తుతం పదేళ్ల మా అమ్మాయి ధన్యని చూసుకుంటూ.. నిర్మాణ రంగంపై దృష్టిపెట్టా.
 ఫిల్మోగ్రఫీ : సీరియల్స్ :
  • విజేత ,
  • వీడని నీడలు ,
  • శుభా కాంక్షలు ,
  • సంక్రాంతి సంబరాలు ,
  • వెంకటేశ్వర వైభవం ;
  • రావోయి చందమామ ,
  • శాంతి నివాసం ,
  • తులసి దళం ,
  • మనోయగ్యం ,
యాంకరింగ్ :
  • అందేలా రవళి -దూరదర్శన్
  • డాన్స్ బేబీ డాన్స్ .
  • బ్రెయిన్ అఫ్ ఆంధ్ర ,
  • హలో మంత్రి గారు ,
  • పెళ్లి పుస్తకం,
  • నవీన ,
,,ఇంకాఎన్నో సినిమాలు : 30 కి పైగా సినిమాలు చేసారు ,
  • శారద ,(నాగబాబు గారిది)
  • జయం మనదేరా,
  • తోడూ ,
  • ఎగిరే పావురమా ,
  • తులసి ,
అవార్డ్స్ :
  • టాక్ అఫ్ థి టౌన్ ,
  • నంది అవార్డ్స్ ,
  • =============================
Visit my Website : Dr.Seshagirirao.com /
 

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala