Sunday, December 14, 2008

రజిత , Rajitha

పరిచయం :
 • రజిత ఒక తెలుగు సినీ కారెక్టర్ నటి . నటి 'కృష్ణవేణి ' , 'రాగిణి 'ఈమెకు పిన్నెలు అవుతారు . . ఒరియా , కన్నడ , మలయాళం లో హీరోయిన్ గా చేసారు . 
 •   పాతికేళ్ల క్రితం వెండి తెర మీద వెలగాలంటే... సినిమా ఆఫీసుల చుట్టూ తిరగాలి. ఆల్బమ్‌లు పట్టుకొని ఆడిషన్లకు వెళ్లాలి. ఒక్క అవకాశం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూడాలి. నటి రజిత అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. అవకాశమే తనని వెతుక్కుంటూ వచ్చింది. నటిగా నిలబెట్టింది. అమ్మ, అక్క, వదిన... పాత్రల్లో ఒదిగిపోతున్న రజిత డాక్టర్‌ కాబోయి యాక్టర్‌  అయింది.

ప్రొఫైల్ :
 • పేరు : మల్లెల రజిత .
 • నాన్న :మల్లెల రామారావు .(తన చిన్నతనములోనే చనిపోయారు)
 • నాన్న గారి ఊరు : కొల్ల -- తూర్పు గోదావరి జిల్లా .
 • అమ్మ : మల్లెల Vijayalaxmi .
 • నివాసము : కర్ణాటక లో తాతలు సెటిల్ అయ్యారు .
 • తోబుట్టువులు :ఇద్దరు అక్కలు , తను - మొత్తము ముగ్గురు .
 • పెళ్లి : కాలేదు --  తల్లి తో ఉంటున్నారు .
 • ముద్దు పేరు ------------- బుజ్జి
 • పుట్టిన తేదీ-------------- 18-10-1972
 • ఎత్తు ------------------ 5'2'
 • తొలి చిత్రం--------------- అగ్నిపుత్రుడు
 • అభిమాన హీరో -----------జాకీచాన్‌
 • అభిమాన హీరోయిన్‌ -------సావిత్రి, మాధురీ దీక్షిత్‌
 • ఆశయం---------------- చంద్రమండల దర్శనం
 • ఇష్టమైన దేశం------------ సింగపూర్‌
 • ఇష్టమైన రంగు------------పింక్‌
 • ఇష్టమైన డ్రింక్‌------------ మజ్జిగ
 • బెడ్‌రూమ్‌లో మీకిష్టమైనది---- అద్దం
 • విహార ప్రదేశం------------- నా ఇల్లు
 • ప్లస్‌ పాయింట్‌------------ ఆత్మవిశ్వాసం--
 • మీదృష్టిలో సెక్సియస్ట్‌ పర్సన్‌-- ఏ.బి.వాజ్‌ పేయి
 • ఇష్టపడేది--------------- ఎదుటి వాళ్ళని బాధపెట్టని మంచివాళ్ళని
 • సినిమాల్లోకి రాకపోతే.. ----- గృహిణిగా స్థిరపడేదాన్ని
career : 

 • కాకినాడలో తొమ్మిదో తరగతి చదువుకునే వరకూ డాక్టర్ని అవ్వాలనే కలలు కనేదాన్ని. నాన్న చిన్నతనంలోనే దూరమైనా అమ్మ నన్నూ, ఇద్దరు అక్కల్నీ కష్టపడి చదివించింది. తనని చూస్తూ పెరిగిన నేను డాక్టర్‌ అయి.. అమ్మని బాగా చూసుకోవాలనుకున్నా. మా పిన్ని కృష్ణవేణి సినిమా రంగంలోనే ఉన్నా, తన ప్రభావం నా మీద అసలు లేదనే చెప్పాలి. చిన్నప్పుడు నేనసలు సినిమాల గురించి పట్టించుకునే దాన్నే కాదు. తొమ్మిదో తరగతి అయ్యాక వేసవి సెలవుల్లో పిన్ని దగ్గరకు చెన్నై వెళ్లా. అక్కడే నా జీవితం మలుపు తిరిగింది. తనతో కలిసి ఒకరోజు షూటింగ్‌కి వెళ్లా. నాగార్జున సినిమా 'అగ్నిపుత్రుడు' చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ నన్ను చూసి పరుచూరి గోపాలకృష్ణ గారు... నా గురించి రాఘవేంద్రరావుగారికి చెప్పారు. 'నాగేశ్వరరావుగారి కూతురి పాత్ర ఒకటుంది. చేస్తారా' అని అడిగారు. అప్పటి వరకూ సినిమా ఆలోచనే లేదుగా! చేయనని చెప్పేశా. రాఘవేంద్రరావుగారు పిన్నితో చెప్పి ఒప్పించారు. అలా 'అగ్నిపుత్రుడు'తో వెండి తెరకు పరిచయమయ్యా. తరవాత వరుసగా అవకాశాలు వచ్చాయి. నాకు మాత్రం చదువు మీదే ఆసక్తి. తప్పక కొన్ని ప్రాజెక్టులు ఒప్పుకొని చేసినా, మళ్లీ కాకినాడ వచ్చి పదో తరగతి పూర్తి చేశా. ఇంటర్‌ చదివేందుకు చెన్నై వెళ్లిపోయాను. చదువుకుంటూ షూటింగ్‌లలో పాల్గొనేదాన్ని. 'సాహసం సేయరా డింభకా', 'వివాహ భోజనంబు', 'చినరాయుడు'.. వంటి సినిమాల్లో నటించా. తమిళం, కన్నడ భాషల్లో హీరోయిన్‌గా చేశా. మొదట్లో అంతగా సినిమాల మీద దృష్టి పెట్టలేదు కానీ 1995 నుంచి సీరియస్‌గా తీసుకున్నా.
 • ఎనిమిదేళ్ల తరవాత: రాఘవేంద్రరావుగారి 'పెళ్లి సందడి'తో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టా. తరవాత వచ్చిన 'పెళ్లి కానుక'కు నంది వచ్చింది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'ప్రేమించుకుందాం రా', 'సూర్యవంశం', 'ఇంద్ర', 'మల్లీశ్వరి', 'కొత్తబంగారు లోకం', 'చందమామ', 'సింహ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'అత్తారింటికి దారేది'.. ఇలా మూడొందల సినిమాల్లో నటించా. హాస్యం, సెంటిమెంట్‌, సీరియస్‌.. సానుకూల, ప్రతికూల పాత్రలు పోషించా. 'మా ఇంటి ఆడపడుచు', 'నాయుడుగారి కుటుంబం', 'నాగప్రతిష్ఠ'.. వంటి కొన్నింట్లో మాత్రం ప్రతినాయక పాత్ర పోషించా. విలన్‌గా నటించడమంటేనే నాకూ ఇష్టం. 'అత్తారింటికి దారేది'లో పవన్‌ కల్యాణ్‌ని 'అన్ని పనులకూ వాడేయండీ' అని నేను అనడం ఈ మధ్యకాలంలో ఆదరణ పొందిన డైలాగ్‌. బయటికి వెళ్లినప్పుడు 'మా హీరోని అన్ని పనులకు వాడేయమంటారేంటి...'అని ప్రేక్షకులు అడుగుతున్నారు. ఈ గుర్తింపు చాలా సంతోషంగా అనిపించింది.నటించిన సినిమాలు కొన్ని :
 • ప్రేమ ఖైది .
 • కూలి నె.1 .
 • సూరిగాడు .
 • ఆలోచించండి .
 • పెళ్లి సందడి .
 • పెళ్లి కనుక .
 • నాయుడు గారి కుటుంబం .
 • మా ఇంటి ఆడపడుచు .
 • నాగ ప్రతిష్ట .
 • సీమ శాస్త్రి .
 • మల్లీశ్వరి .
 • రవియి చందమామ .
 • మనసంతా నువ్వే .... ఎన్నో .. రెండు మూడు సీరియల్స్ లో నటించారు .(బాపు గారి భాగవతం లో దేవయాని కారక్టర్)

 • ================================
visit my website : dr.seshagirirao.com