చంద్రశేఖర్ రెడ్డి పి , Chandrashekhar reddy P

  •  
  •  
  • ---------------------------------------------------- 

పరిచయం :
  • పందిల్లపల్లి చంద్రశేఖర్ రెడ్డి ఒక సినీ దర్శకుడు . సుమారు 75 సినిమాలకు దర్శకత్వం వహించారు .
ప్రొఫైల్ :
  • పేరు : పి. సి. రెడ్డి
  • ఊరు : అనుమ సముద్రం - ఆత్మకూరు దగ్గర --నెల్లూరు జిల్లా .
  • పుట్టిన తేది : 15 అక్టోబర్ 1933 ,
  • నాన్న : పందిల్లపల్లి నారపరెడ్డి , గ్రామా మునసబు.
  • అమ్మ :సుబ్బమ్మ ,
  • చదువు : డిగ్రీ ..
  • పిల్లలు : ఇద్దరు ఆడపిల్లలు ,
ఫిల్మోగ్రఫీ :
  • అసిస్టెంట్ డైరెక్టర్ గా .... 1959 నుండి
  • శ్రీకృష్ణ రాయభారము ,
  • అన్నపూర్ణ ,
  • పూలరంగడు .
  • టాక్సీ డ్రైవర్ ,
  • లక్షాధికారి ,
దర్శకుడు గా : 1971 నుండి
  • అనురాధ ,
  • విచిత్ర దాంపత్యం ,
  • అత్తలు-కోడళ్ళు ,
  • మనవుడు -దానవుడు ,
  • ఇల్లు-ఇల్లాలు ,
  • పేర్రాజు ,
  • బడిపంతులు ,
  • చిన్న పులి -పెద్దపులి ,(చిరంజీవి హీరో)
  • శాంతిసందేశం ,
సీరియల్స్ :డైరెక్టర్ గా
  • అన్నయ్య -- ఈటివి ,
  • భీష్మ --దూరదర్శన్
  • భుద్ధ -- సోని టి వి ,
Career : story of entry to film industry: 
  • చిత్ర పరిశ్రమలో నిత్యచైతన్య శీలి పి.సి.రెడ్డి. దర్శకుడిగా పరిచయమైన నాటి నుంచీ ఆయన ప్రయాణానికి అలుపు లేదు. ఎనభైకి పైగా సినిమాలు తీసి, యాభై మంది శిష్యులను దర్శకులుగా పరిచయం చేసిన ఘనుడాయన. పాడిపంటలు, బడిపంతులు, బంగారుభూమి, మానవుడు దానవుడు, నా పిలుపే ప్రభంజనం వంటి సినిమాలతో పరిశ్రమలో ప్రభంజనం సృష్టించిన పి.సి.రెడ్డి తన తొలియత్నం ‘అనూరాధ’ గురించి చెప్పిన విశేషాలు...

సినిమా పరిశ్రమలో అవకాశం అంటే, చీకట్లో దారి వెతుక్కోవడం లాంటిది. లైట్ ఎవరి మీద పడుతుందో, ఎప్పుడు ఎవరు లైమ్‌లైట్‌లోకి వస్తారో చెప్పడం అసాధ్యం. మొదట వి.బి.రాజేంద్రప్రసాద్‌గారు నన్ను డెరైక్టర్‌ని చేద్దామనుకున్నారు. తరువాత అన్నపూర్ణ వాళ్లు మొదట మేమే అవకాశమిస్తామన్నారు. రకరకాల కారణాలతో ఏదీ ఒక స్పష్టమైన రూపు దాల్చలేదు. నా మొదటి సినిమా మొదటి నుంచీ చివరిదాకా ఊహించలేని మలుపులను నాకు చూపించింది.

మా బంధువు ఎస్వీ ప్రభాకర్‌రెడ్డికి సినిమాలంటే చాలా ఆసక్తి. నేను వి.మధుసూదనరావుగారి దగ్గర, ఆదుర్తి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. ఇద్దరం సినిమాల గురించి గంటల తరబడి మాట్లాడుకునేవాళ్లం. కొన్నాళ్ల తరువాత ‘ఇలా ఎన్నాళ్లు రెడ్డీ’ అని, ‘నేను ప్రొడ్యూస్ చేస్తాను, నువ్వు డెరైక్ట్ చెయ్యి’ అన్నారు. కానీ అంత బడ్జెట్ అతను భరించగలడా అని నేను ఆలోచించాను. ఒకసారి బంధువుల పెళ్లికి వెళ్లినప్పుడు అక్కడ సినిమా ఫైనాన్షియర్ తిక్కవరపు శివకుమార్‌రెడ్డి కలిశాం. అతను మాకు బంధువు కూడా. అతనికి మేం సినిమా తీయాలనుకుంటున్న విషయం చెప్పాను. ఏమైనా సమస్య వస్తే మీరు హెల్ప్ చేయగలరా అని అడిగాను. శివకుమార్‌రెడ్డి వెంటనే ‘నువ్వు ధైర్యంగా పి.సి.రెడ్డితో సినిమా తీయి, ఏమైనా డబ్బు అవసరమైతే నేను ఇస్తాను’ అని ప్రభాకర్‌రెడ్డితో అన్నారు.

తరువాత ఈ విషయం వి.బి.రాజేంద్రప్రసాద్‌గారికి చెప్పాను. ఆయన ఒక పెద్ద డి స్ట్రిబ్యూటర్‌తో మాట్లాడి నన్ను ఆయన దగ్గరికి పంపించారు. అప్పట్లో ప్రొడ్యూసర్ ఒక వంతు డబ్బులు పెడితే, మూడొంతులు డిస్ట్రిబ్యూటర్లు పెట్టేవారు. నేను వెళ్లి డిస్ట్రిబ్యూటర్‌ను కలిశాను. నాతో మాట్లాడిన తరువాత ఇద్దరూ కొత్తవాళ్లయితే ఎలా అంటూ మళ్లీ రాజేంద్రప్రసాద్‌గారితో మాట్లాడారు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మీరు గ్యారంటీ ఇస్తారా అన్నారు. అవసరమైతే ఉంటానన్నారాయన. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి నమ్మకం కలిగాక హీరో కోసం వెదుకులాట మొదలైంది.

జగపతి బ్యానర్లో చేస్తున్నప్పటినుంచీ నాగేశ్వరరావుగారితో నాకు మంచి అనుబంధం ఉంది. ఆయనతో సినిమా తీయాలనుకుని వెళ్లి కలిశాం. చాలా ఆప్యాయంగా రిసీవ్ చేసుకుని ‘రెడ్డిగారూ! నా పాలసీ ప్రకారం నిర్మాత, దర్శకుడు ఇద్దరూ కొత్తవారైతే నేను పనిచేయలేను. మీ తరువాతి సినిమా తప్పకుండా చేస్తాను’ అన్నారు. రామారావుగారేమో బిజీగా ఉన్నారు. ఇక మరేమిటి ప్రత్యామ్నాయం అని ఆలోచిస్తున్నప్పుడు కృష్ణగారు మెదిలారు. కొత్తవాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అందులోనూ నేను ఆదుర్తిగారి శిష్యుణ్ని కాబట్టి, ఆయన తీసుకొచ్చిన కృష్ణగారైతే సెంటిమెంట్‌గా బాగుంటుందనుకున్నాను.

అనుకున్నట్టుగానే ఆయన అంగీకరించారు. దాంతో సగం సినిమా అయిపోయినంత నమ్మకం వచ్చేసింది. అంతా బాగానే ఉంది కానీ, అప్పటివరకు చేతిలో స్క్రిప్టు లేదు. కృష్ణగారికి ఎలాంటి కథ అయితే బాగుంటుందని ఆలోచించి ఫ్యామిలీ సబ్జెక్ట్ చేద్దామని నేనన్నాను. నిర్మాత ప్రభాకర్‌రెడ్డి దీనికి కొంత సస్పెన్స్ కలిపితే బాగుంటుందన్నారు. నేను, ప్రభాకర్‌రెడ్డి, రచయిత పినిశెట్టి శ్రీరామమూర్తి (దర్శకుడు రవిరాజా పినిశెట్టి తండ్రి), ఎడిటర్ సత్య కూర్చుని కథాచర్చలు జరిపాం. శ్రీరామమూర్తిగారు కథారచనలో చాలావరకు సహకరించారు. ఆత్రేయగారితో జగపతి పిక్చర్స్ నుంచీ ఉన్న పరిచయం కొద్దీ ఈ సినిమాకు మాటలు, పాటలు రాయించాం.

కథాచర్చల దశలోనే ఫలానా పాత్రకు ఫలానా ఆర్టిస్ట్ అయితే బాగుంటుందని అనుకున్నాం. నేను ‘పూలరంగడు’కు అసిస్టెంట్‌గా పనిచేసినప్పుడు అందులో నటించిన విజయనిర్మలను కృష్ణ సరసన తీసుకున్నాం. అన్న పాత్ర కోసం ఎస్వీ రంగారావుగారిని కలిసి రెండు మూడు సీన్లు చెబితే బాగున్నాయని మెచ్చుకున్నారు. చెల్లి పాత్రకు జి.వరలక్ష్మిని అనుకున్నాం. మరో జంటగా కృష్ణంరాజు, రాజేశ్వరి నటించారు. టైటిల్ విషయానికి వచ్చేసరికి చాలా ఆలోచించాం. మా ప్రొడ్యూసర్‌గారి అమ్మాయి పేరు మీద మా బ్యానర్‌కు ‘అనురాధ పిక్చర్స్’ అని పెట్టాం. సినిమాలో విజయనిర్మల క్యారెక్టర్‌కు అదే పేరు పెట్టాం. సినిమాకు కూడా అదే బాగుంటుందని అనుకున్నాం. సినిమా మొదలైంది.

ఎస్వీ రంగారావుగారు మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ చెప్పే డైలాగులు, హావభావాలు చూసి నేను కట్ చెప్పలేకపోయాను. రంగారావుగారు ఏరోజూ తానొక మహానటుడిని అన్నట్టు ప్రవర్తించలేదు. సెట్లో ఏదైనా డైలాగ్‌ని కొంత తనకు అనువుగా మలుచుకోవాలని అనుకుంటే, ‘డెరైక్టర్‌గారూ! దీన్ని ఇలా అనవచ్చా?’ అని చాలా వినయంగా అడిగేవారు. అంత గొప్ప సంస్కారి ఆయన!

కథ ప్రకారం చెల్లెలి ప్రేమ విషయంలో అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు వచ్చి విడిపోతారు. వాళ్ల పిల్లలు విజయనిర్మల, కృష్ణ బావామరదళ్లమనే విషయం తెలియకుండా ప్రేమించుకుంటారు. తెలిసిన తరువాత పెద్దవాళ్ల పంతాల మధ్య వీళ్ల ప్రేమ నలిగిపోతుంది. ఆ సందర్భంలో పాతికేళ్ల తరువాత అన్న ఇంటికి చెల్లి వస్తుంది. పెద్దవాళ్ల పట్టుదలకు చిన్నవాళ్ల ప్రేమను బలి చేయొద్దని చెబుతుంది. ఆ సీన్‌లో జి.వరలక్ష్మి... కింద నిలబడి మాట్లాడుతున్నప్పుడు పై అంతస్తులో ఉన్న ఎస్వీ రంగారావుగారు మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ చెప్పే డైలాగులు, హావభావాలు చూసి నేను కట్ చెప్పలేకపోయాను. రంగారావుగారు ఏరోజూ తానొక మహానటుడిని అన్నట్టు ప్రవర్తించలేదు. సెట్లో ఏదైనా డైలాగ్ కొంత తనకు అనువుగా మలుచుకోవాలని అనుకుంటే, ‘డెరైక్టర్‌గారూ! దీన్ని ఇలా అనవచ్చా?’ అని చాలా వినయంగా అడిగేవారు. అంత గొప్ప సంస్కారి!

ఇందులో కృష్ణంరాజు పాత్ర అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతుంది. అతను ప్రేమించి వదిలేసిన అమ్మాయే హత్యచేసిందని చివరిదాకా సినిమాలో పోలీసులు, థియేటర్లో ప్రేక్షకులు భావిస్తారు. ఈ సస్పెన్స్ బాగా పండింది. ఆ అమ్మాయికి శిక్ష పడబోయేలోపు ‘చంపింది తను కాదు నేను’ అంటూ రాజబాబు ముందుకొస్తాడు. అదే ఈ సినిమాకు కీలక మలుపు. రాజబాబుకు ఉన్న ఇమేజ్‌కు ఇది భిన్నమైన పాత్ర. ప్రేక్షకులు ఈ కొత్తదనాన్ని ఆహ్వానిస్తారన్న మా అంచనా నిజమైంది.

చివరకు ఒక సాంగ్ బ్యాలన్స్ ఉండిపోయింది. అందులో నటించాల్సిన విజయలలితకు మరుసటిరోజు బెంగళూరులో వేరే షూట్ ఉండటంతో ఆ సాయంత్రం ఫ్లయిట్‌కు వెళ్లిపోవాలి. డ్యాన్స్ మాస్టర్ హీరాలాల్‌గారు ఆ రోజంతా భోజనం చేయకుండా తన టీమ్‌తో కలిసి సాయంత్రానికల్లా పాట పూర్తిచేశారు. విజయ గార్డెన్స్‌లోకి ఎంటర్ అవగానే ఒక పిల్లర్ ఉండేది. దాని చుట్టూ ఇరవై అడుగుల దిమ్మె ఉండేది. దిమ్మె చుట్టూ హీరో హీరోయిన్స్ చేతిలో చేయి వేసుకుని పరిగెడుతున్న దృశ్యం తీయడానికి రౌండ్ ట్రాలీ అవసరమైంది. అంత పెద్ద ట్రాలీ లేదని టెక్నీషియన్లు చెప్పడంతో నేను సీరియస్ అయ్యాను. కెమెరామెన్ వెంకటరత్నం నా ఆలోచనను అర్థం చేసుకుని ఒక కార్ డిక్కీలో కూర్చుని రౌండ్‌గా తిరుగుతూ హీరో హీరోయిన్లను ఫాలో అయ్యారు. అది అద్భుతంగా వచ్చింది. అన్ని పాటలూ హీరాలాల్‌గారు చేస్తే ఈ ఒక్క పాటకీ కె.ఎస్.రెడ్డిగారు నృత్య దర్శకత్వం వహించారు.

రకరకాల కారణాల వల్ల సినిమా కొంత ఆలస్యమైంది. అయితే నా చుట్టూ ఒక మంచి సర్కిల్ ఉండటంతో నేనే రోజూ సినిమా ఆగిపోతుందని భయపడలేదు. నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పటి నుంచీ సన్నిహితంగా మెలిగిన కె.వి.మహదేవన్‌గారు ‘అనురాధ’కు సంగీత బాధ్యతలు తీసుకున్నారు. రాగాల పట్ల నాకు పెద్దగా అవగాహన లేదు. మహదేవన్‌గారు పాట వినిపించినప్పుడు బాగుంటే చెప్పేవాణ్ని. బాగా లేకపోతే నా ముఖ కవళికలు గమనించి, ఆయన మరో ట్యూన్ చేసేవారు. నేను అసిస్టెంట్‌గా పనిచేస్తున్నప్పుడు దగ్గరగా మెలిగిన టెక్నీషియన్లంతా ఈ సినిమాకు పనిచేశారు. వాళ్లు నాకు పూర్తి సహకారం అందించారు.

ఈ సినిమా మధ్యలో ఉండగానే నాకు మరో రెండు సిని మాలు డెరైక్ట్ చేసే అవకాశం వచ్చింది. కృష్ణ, వాణిశ్రీ జంటగా ‘అత్తాకోడళ్లు’, ఉషశ్రీ పిక్చర్స్ వారికి ‘విచిత్ర దాంపత్యం’ చేశాను. అత్తాకోడళ్లు, విచిత్ర దాంపత్యం రెండూ ముందు విడుదలైతే నా మొదటి సినిమా ‘అనురాధ’ మూడో సినిమాగా విడుదలైంది. ముందు ఇచ్చిన మాట ప్రకారం ఫైనాన్షియర్ శివకుమార్‌రెడ్డి సినిమా విడుదల సమయంలో సహకరించారు. రాజేంద్రప్రసాద్‌గారు ఈ సినిమాకు నిర్మాత కాకపోయినా మొదటినుంచీ చివరిదాకా కంటికి రెప్పలా కాచుకున్నారు. మూడూ పెద్ద హిట్టయ్యాయి. ఆ రకంగా హ్యాట్రిక్ డెరైక్టర్‌ని అయ్యాను. అది నిజంగా అరుదైన అనుభవం!

- కె.క్రాంతికుమార్‌రెడ్డి -@saakshi Telugu news paper

  • =====================
visit my website : Dr.seshagirirao.com

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala