బాలమురళి కృష్ణ మంగళంపల్లి , Balamuralikrishna Mangalampalli


- ---------------------------------------------------------------------
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ--కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులెందరో వున్నారు. అయితే కర్నాటక సంగీతం అనగానే ఈ తరంలో వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహానుభావుడు బాలమురళి. కర్ణాటక సంగీత ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన బాలమురళి వాగ్గేయకారుడు. త్యాగయ్య లాంటి వాగ్గేయకారులు రచించిన ఎన్నో కీర్తనలకు జీవం పోసిన బాలమురళి స్వయంగా కీర్తనలు రాసారు. కొత్త రాగాలు కనిపెట్టారు.
- కోనసీమలోని శంకరగుప్తంలో సంగీత కుటుంబంలో పుట్టిన బాలమురళి త్యాగరాజు శిష్యపరంపరకు వారసుడైన బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన ఎనిమిదేళ్ళ వయసులో విజయవాడలో త్యాగరాజ గాన సభలో తొలి పూర్తి స్థాయి కచేరి చేశారు.
- జన్మస్థలం : రాజోలు తాలూకా శంకరగుప్తంలో(A.P),
- పుట్టిన తేది : 1930వ సంవత్సరంలో,
- తల్లి దండ్రులు : శ్రీ మంగళంపల్లి పట్టాభిరామయ్య, శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, కవి, వాగ్గేయకారుడు.
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ తన తల్లిదండ్రులు మురళీకృష్ణ అని నామకరణం చేశారు. బాల్యంలో - ఐదు సంవత్సరాల వయస్సులో - సంగీత కచేరి చేసి పెద్దల మన్ననలు అందుకొన్నారు. ప్రముఖ హరికథ విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ బాల అని పేరుకు ముందు చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచారు. ఆయన తండ్రి పట్టాభిరామయ్య గారు వయోలిన్, ఫ్లూటు, వీణ వాయించడంలో, తల్లి సూర్యకాంతమ్మ వీణ వాయించడంలో సిద్ధహస్తులు.
- బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నారు. ఈయన తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు .
- =====================================