వేటూరి సుందరరామ్మూర్తి , VeturiSundararamamurty
- =================================
- ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...వేటూరి సుందరరామ్మూర్తి.
- వేటూరి గా పిలవబడే వేటూరి సుందరరామ్మూర్తి (జ. 29-Jan.1936) సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత. వేటూరిజంట కవులుగా పేరు పొందిన తిరుపతి వేంకట కవులు దగ్గర శిష్యరికం చేసారు. తొలినాళ్ళలో పాత్రికేయినిగాపనిచేసిన వేటూరి , కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసారు. తర్వాత కొన్నివేల పాటలను రాసారు. మహానటుడు నందమూరి తారక రామారావు నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయేపాటలను రాసారు.
- వేటూరి చాలా రకాల పాటలను రాసారు. సంప్రదాయ కవిత్వం దగ్గర నుండి జానపద గీతాల వరకు క్లాస్ నుండిమాస్ వరకు అన్నింటిలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు. ఆయన మాతృదేవోభవ సినిమాకి రాసినరాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే... (నిర్మాత:కె.యస్.రామారావు, దర్శకుడు:అజయ్ కుమార్, సంగీతం:కీరవాణి) అనే పాటకి (తెలుగు పాటకు మొదటి జాతీయ పురస్కారం) 1994వ సంవత్సరానికి గాను ఈపురష్కారం వచ్చింది.
- పేరు : సుందర రామమూర్తి ,
- పుట్టిన ఊరు : పెద్దకల్లెపల్లి గ్రామము , కృష్ణ జిల్లా ,
- పుట్టిన తేది : 29 జనవరి 1936 ,
- నివాసము : హైదరాబాద్
- వ్రుత్తి : కవి , పాటల రచియిత
- తండ్రి : వేటూరి ఆనందమూర్తి ,
- మరణము : 22 May 2010 .
- నేసనల్ ఫిలిం అవార్డు ఫర్ బెస్ట్ ల్య్రిసిస్ట్ .
- నంది అవార్డు ఎన్నో పాటలకు ,
- మనస్విని అవార్డు -౧౯౯౨ ,
- హనరీ డాక్టరేట్ ,
- 1. కంత్రి (2008) (లిరిక్స్: "వయసునామి"
- 2. ఆనంద్ (2004) (రైటర్: "వచ్చే వచ్చే", "యమునతీరం", "నువ్వేనా", "చారుమతి ఐ లవ్ యు", "తెలిసి తెలిసి", "ఎడలోగానం")
- 3. ఠాగూర్ (2003) (రైటర్: "మన్మధ మన్మధ")
- 4. ఇంద్ర (2002) (రైటర్: "అమ్మడు అప్పచి")
- 5. మృగరాజు (2001) (రైటర్: "రామయ్య పాదలెత్తి", "సతమనమన్నదిలే", "ఎలలేయ్ ఎల్లమ్మ")
- 6. అన్నయ్య (2000) (రైటర్: "హిమసీమల్లో", "గుసగుసలే", "వాన వల్లప్ప")
- 7. ఆఖరి పోరాటం (1988) (లిరిక్స్: "తెల్ల చీరకు", "ఎప్పుడు ఎప్పుడు")
- 8. అన్వేషణ (1985) (రైటర్: "ఎదలో లయ", "కీరవాణి", "ఏకాంత వేళ", "ఇలలో కలిసే")
- 9. మంత్రిగారి వియ్యంకుడు (1983) (లిరిక్స్: "మానస శిరసా నీ నామమే పాడెద ఈ వేళ", "కోకోనట్ మనకు దోస్తీ ఒకటే ఆస్తి రా, జబరు దస్తి చేస్తే నాస్తి రా", "ఛి ఛి పో పాప ఒప్పులకుమ్మ ", "కొలువైనదే ఉర్కి కోరివయినదే మా కొబ్బరికాయల సుబ్బారాయుడే ", "ఏమనని నీ చెలి పడుడనే ", "సాల సాల నను కవించనేల ")
- 1. సుందరకాండ (2008) (ల్య్రిసిస్ట్)
- 2. మంత్రిగారి వియ్యంకుడు (1983) (లిరిక్స్)
- 3. మంచుపల్లకి (1982) (లిరిక్స్)
- ==========================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog