సముద్రాల రాఘవాచార్య , Raghavacharya Samudrala

పరిచయం :
  • ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు సముద్రాల రాఘవాచార్య.
  • సముద్రాల రాఘవాచార్య--తెలుగు సినిమా పరిశ్రమలో ' సముద్రాల సీనియర్ ' గా ప్రసిద్ధి చెందినరచయిత, నిర్మాత, దర్శకుడు మరియు నేపథ్యగాయకుడు. ఈయన కుమారుడు సముద్రాల రామానుజాచార్యసముద్రాల జూనియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమ పరిచయము. పి.వి.దాసు నిర్మించిన శశిరేఖా పరిణయం సినిమాకు కొన్ని సన్నివేశాలు వ్రాయడంతో సినీ వ్యాసంగాన్ని ప్రారంభించిన సముద్రాల వందకు పైగా సినిమాలకు స్క్రిప్టులను వ్రాశాడు. అనేక పాటలు కూడా వ్రాశాడు.
  • సినీగేయ సముద్రుడు సముద్రాల-(19/7/1902-16/3/1968):అవధానిగా సాహిత్య లోకానికి పరిచయమైన సముద్రాల... గూడవల్లి రామబ్రహ్మం ప్రోత్సాహంతో సినీరంగంలో అడుగుపెట్టారు. ‘కనకతార (1937)’తో రచయితగా పరిచయమై వాహినీవారి దృష్టిలో పడ్డారు. వందేమాతరం, సుమంగళి, దేవత, భక్తపోతన చిత్రాలకు పనిచేసి, ‘స్టార్ రైటర్’గా 40వ దశకాన్ని ‘ఏకకలాధిపత్యం’గా ఏలారు. అర్వాచీన కవులతో పోటీపడి, మరో రెండు దశాబ్దాల పాటు సినీకవిగా కొనసాగారు. మూడు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. సినిమాల్లో వ్యవహార భాషను ప్రవేశపెట్టడం, పద్యాలలో రాగాలాపనను నియంత్రించడం... సముద్రాల తీసుకొన్న సాహసోపేత నిర్ణయాలు. పౌరాణిక భక్తి గీతాలకు ఒక ఒరవడిని తీర్చారు. ‘షావుకారు (1950)’ లోని దీపావళి సందర్భానికి రాసిన ఆనంద, విషాద గీతాలతో తెలుగు సినిమాల్లో ‘బొమ్మ-బొరుసు’ పాటలకు శ్రీకారం చుట్టారు. దేవదాసు, విప్రనారాయణ, అనార్కలి, సీతారామ కళ్యాణం, లవకుశ మొదలగు చిత్రాల్లో సుమారు వెయ్యి పాటలను రాశారు.
ప్రొఫైల్ :
  • పేరు : రాఘవాచార్య సముద్రాల ,
  • పుట్టిన తేది : 19/7/1902-16,
  • పుట్టిన ఊరు : రేపల్లె -గుంటూరు జిల్లా ,
  • మరణము : 16/3/1968 .
రచయితగా
  • 1. భక్త ప్రహ్లాద (1967 సినిమా)-
  • 2. శ్రీకృష్ణ పాండవీయం (1966)-
  • 3. బభ్రువాహన (1964) (మాటలు) (కథ)-
  • 4. నర్తనశాల (1963) (మాటలు)
  • 5. లవకుశ (1963)-
  • 6. సీతారామ కళ్యాణం (1961) (మాటలు)-
  • 7. బాటసారి (1961) (మాటలు)-
  • 8. పాండవ వనవాసం (1965)-
  • 9. భూకైలాస్ (1958)-
  • 10. సారంగధర (1957)(మాటలు)-
  • 11. వినాయక చవితి (1957)-
  • 12. జయం మనదే (1956) (మాటలు) (కథ)-
  • 13. జయసింహ (1955) (మాటలు) (కథ)-
  • 14. బ్రతుకు తెరువు (1953) (మాటలు) (కథ)-
  • 15. దేవదాసు (1953)(మాటలు)-
  • 16. నవ్వితే నవరత్నాలు (1951)-
  • 17. స్వప్న సుందరి (1950)-
  • 18. షావుకారు (1950)-
  • 19. మన దేశం (1949) (మాటలు)-
  • 20. లైలా మజ్ను (1949) (మాటలు)-
  • 21. పల్నాటి యుద్ధం (1947) (మాటలు)-
  • 22. రత్నమాల (1947)-
  • 23. యోగి వేమన (1947)-
  • 24. గరుడ గర్వభంగం (1943) (మాటలు)-
  • 25. భక్త పోతన (1942 సినిమా) (కథ మరియు మాటలు)-
  • 26. దేవత (1941) (మాటలు)-
  • 27. సుమంగళి (1940) (మాటలు)-
  • 28. వందేమాతరం (1939)(మాటలు)-
  • 29. గృహలక్ష్మి (1938)
దర్శకత్వం చేసినవి :
  • 1. బభృవాహన (1964)-
  • 2. భక్త రఘునాథ్ (1960)-
  • 3. వినాయక చవితి (1957)
నిర్మాత గా :
  • 1. దేవదాసు (1953) (నిర్మాత) (uncredited)-
  • 2. శాంతి (1952) (నిర్మాత) (uncredited)-
  • 3. స్త్రీసాహసం (1951) (నిర్మాత) (uncredited)
నేపధ్య గాయకుడు గా --
  • 1. భక్త రఘునాథ్ (1960) (playback singer)
collection : Dr.Seshagirirao (Srikakulam)

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani