చెళ్ళపిళ్ళ సత్యం , Chellapilla Satyam

- ******************************************************
- చెళ్ళపిళ్ళ సత్యం తెలుగు సినిమాలలో ప్రముఖ సంగీత దర్శకులు. ఇతడు విజయనగరం జిల్లాలో కొమరాడగ్రామంలో జన్మించారు. సంగీతం మీద ఆసక్తి ఉన్నందున మొదటి లో కొన్ని స్టేజి డ్రామా లో నటిచి పాటలు పాడేవారు . తరువాత మద్రాస్ వెళ్లి సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు ఆర్కెస్ట్రా లో చేరారు ... కొన్నాలు టి.వి. రాజు దగ్గర అసిస్టెంట్ గా ఉన్నారు .
- పేరు : చెల్లపిల్లి సత్యం ,
- ఊరు : కొమరాడ గ్రామము - విజయనగరం జిల్లా ,
- మరణము : * - * - 1989 ,
- అంకుశం (1990)
- ఆహుతి (1988)
- తలంబ్రాలు (1987)
- Aaj Ke Sholey (1985)
- మహానగరంలో మాయగాడు (1984)
- పట్నం వచ్చిన పతివ్రతలు (1982)
- ప్రేమ నాటకం (1981)
- గడసరి అత్త సొగసరి కోడలు (1981)
- ప్రేమ తరంగాలు (1980)
- నకిలీ మనిషి (1980)
- ఆరని మంటలు (1980)
- కోరికలే గుర్రాలైతే (1979)
- దొంగల దోపిడి (1978)
- మనుషులు చేసిన దొంగలు (1977)
- అందమే ఆనందం (1977)
- ప్రేమలేఖలు (1977)
- భక్త కన్నప్ప (1976)
- మంచివాళ్ళకు మంచివాడు (1973)
- రాణీ ఔర్ జనీ (1973)
- పాపం పసివాడు (1972) *
- మట్టిలో మాణిక్యం (1971).
ఇతడు విజయనగరం జిల్లాలో కొమరాడ గ్రామంలో జన్మించారు. సత్యం వంశస్థులంతా సంగీత సాహిత్యాలలో ఉద్దండులే. ముఖ్యంగా ముత్తాత చెళ్లపిళ్ల వేంకట కవి, ఆ కాలంలో తిరుపతి వేంకట కవులలో ఒకనిగా, మహాకవిగా కీర్తి గడించారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఆసక్తి కనబరిచేవాడు. హరికధా భాగవతార్ అయిన తాతయ్య చెళ్ళపిళ్ళ సత్యనారాయణ దగ్గర పదేళ్ళ వయసులోనే సంగీతం పాఠాలు ప్రారంభించి కృతులు వరకూ నేర్చుకున్నడు. సాలూరుకు చెందిన పట్రాయని సీతారామశాస్త్రి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో పేరొందిన విద్వాంసుడు. ఆయన దగ్గర కొంతకాలం సంగీతం నేర్చుకున్నాడు. ఓరోజు కాకినాడకు చెందిన "యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్" వారి డ్రామా వేయడానికి సాలూరు వెళ్లాడు. ఆదినారాయణరావు గారు ఆ క్లబ్ కు కీలక వ్యక్తి. స్నేహితులంతా సత్యాన్ని తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. అక్కడి నుంచి "యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్"లో ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో ఆదినారయణరావుకు అంజలీ దేవితో వివాహం అయింది. ఆదినారాయణరావు గారు ఓపెద్ద ఇల్లు తీసుకున్నారు. వాళ్ళతో పాటే సత్యం కూడా అందులో చేరాడు. ఆదినారాయణరావు ఆర్కెస్ట్రాలో తబలా నిపుణుడైన పెద్ద అంజయ్య ఉండేవారు. ఆయన డోలక్ ఎలా వాయిస్తున్నాడో సునిశితంగా గమనిస్తూ, ఎవరూ లేనప్పుడు అలా అనుకరిస్తూ నేర్చుకుంటుండే వాడు. ఆ తరువాత టి.వి. రాజు గారి ఆర్కెస్ట్రాలో ఎనిమిదేళ్లు అక్కడే పనిచేశాడు.
సినీ జీవితం:
62వ సంవత్సరంలో ఎం.ఎస్.నాయక్ నిర్మించిన "శ్రీ రామాంజనేయ యుద్ధ" అనే కన్నడ సినిమాకి మొదటిసారిగా సంగీత దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని నూటికి నూరు పాళ్ళు సద్వినియోగం చేసుకున్నాడు సత్యం. మొదట్లో తెలుగులో అడప దడప సినిమాలు చేస్తూన్నా మంచి గుర్తింపు రాలేదు ' ఈలోపు కన్నడంలో 42 సినిమాలకు స్వరకల్పన చేశాక 1973 లో "కన్నె వయసు" సినిమా తరువాత ఇక తెలుగులో వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. సత్యం స్వరజీవితంలోనే అగ్రతాంబూలం ఇవాల్సిన "ఏ దివిలో విరిసిన పారిజాతమో" పాట ఈ సినిమాలోనిదే. ఇలా తన 20 ఏళ్ల సినీ జీవితంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు. కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్రతారల చిత్రాలకు విజయవంతమైన సంగీతం అందించారు. 70 వ దశకంలో దాదాపు కృష్ణ నటించిన అన్నీ కౌబాయ్ చిత్రాలకు సత్యమే స్వరసారధి. నటుడు చలం నిర్మాతగా తీసిన మరియు హీరోగా నటించిన దాదాపు 20 సినిమాలకు సత్యమే ఆస్థాన సంగీత దర్శకుడు. సత్యానికి బాగా ఇష్టమైన వాద్యం తబలా. తబలా లేకపొతే సత్యం సంగీతం లేదు అని చాలాసార్లు చెప్పేవారు. రీరికార్డింగ్ సమకూర్చడంలో సత్యానిది ఓ ప్రత్యేక శైలి.
ప్రతిభ కోసం అన్వేషణ
ఒక వ్యక్తిలో అవసరమైనంత ప్రతిభ వుందా లేదా అన్నది - ఇవాళ మృగ్యం అయిపోయిందిగాని, ఆరోజుల్లో 'ప్రతిభ' కోసం దర్శకనిర్మాతలు వెతికేవారు. యస్. భావనారాయణ గారు 'పాలమనసులు' (1968) సినిమా మొదలు పెట్టారు. సాధారణంగా పాటల రికార్డింగ్‌తో మొదలవుతాయి సినిమాలు. కానీ భావనారాయణ గారు షూటింగ్‌తోనే మొదలు పెట్టారు. కారణం ఏమిటంటే ఆయన అనుకున్నట్టు కొత్త సంగీత దర్శకుడు లభ్యం కాక 'పాలమనసులు' కన్నడంలో వచ్చిన 'బెళ్లిమోడ'కు సంగీత దర్శకుడు విజయభాస్కర్. భావనారాయణగారు ముందుగా, విజయభాస్కర్‌నేపెట్టుకొని కొత్త వరసలు కల్పించమన్నారు - కన్నడ చిత్రంలో వున్నవే కాకుండా. ఎందుకనో, నిర్మాతకి తృప్తి అనిపించలేదు. 'ఒక కొత్త సంగీత దర్శకుడి కోసం వెతుకుదాం' అనుకున్నారు. ఆ జాప్యంతో షూటింగ్ మొదలైంది. నిర్మాత స్థానంలో నిర్మాణ వ్యవహారాలు చూస్తున్న వై.వి.రావును పిలిచి, ''ఓ కుర్రాడిని చూశాను రావూ. ఆదినారాయణరావు దగ్గర అసిస్టెంటుగా వున్నాడు. రిహార్సల్సులోనూ, రికార్డింగ్‌లోనూ మంచి ప్రతిభ గలవాడనిపించింది. పేరూ వూరు తెలీదు. పొట్టిగా వుంటాడు, స్కూటర్ మీద తిరుగుతూ వుంటాడు. ఎవరో పట్టుకో. అతని చేత సంగీతం చేయిద్దాం'' అన్నారు - భావనారాయణ. రావుగారు రెండు రోజుల్లోనే అతన్ని తీసుకొచ్చారు. అతనే సత్యం! 'డోలక్ సత్యం' అనేవారు. పూర్తిపేరు చెళ్లపిళ్ల సత్యనారాయణమూర్తి. భావనారాయణగారు అతనికి సంగీత దర్శకత్వం అప్పజెప్పారు. సత్యం చేసిన వరసలు అందరికీ నచ్చాయి. 'పాలమనసులు'తో సత్యం - తెలుగు సినిమా సంగీత దర్శకుడై - ఎన్నో చిత్రాలు చేశారు. ఆ రోజుల్లో సంగీత దర్శకులెవరూ నిర్మాతల వెంటపడలేదు. నిర్మాతలే అన్వేషించేవారు. ''కొత్త వాళ్లలో ప్రతిభగలవారుంటారు. వాళ్లని పట్టుకోవాలి'' అని ఆలోచించే రోజులవి.
courtesy @ Pathabangaram by Ravi kondalarao
- ===================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog