ధూళిపాళ సీతారామశాస్త్రి,Sitarama sastry

============================================================== పరిచయం :
  • నాటక కళాప్రపూర్ణ ధూళిపాళ మంచి తెలుగు సిని నటుడు . అత్యాద్మిక రోల్స్ లో నటించడం ఈయన ప్రత్యేకత . శకుని పాత్ర బ్రహ్మ్మ్మండము గా చేయగలరు . సినిమా కెరీర్ ను 13 ఏళ్ళ వయసు లో ప్రారంభించి , సుమారు ౩౦౦ సినిమాల లో నటించారు .ధూళిపాళ సీతారామ శాస్త్రి తెలుగు నాటక రంగంలో మరియు తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు. తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామసేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్‌.ఆర్‌, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు. కంచి కామకోటి పీఠం జేతేంద్ర సరస్వతి చే ఉత్ప్రేరకుడై సనయసి మతము తీసుకొని 2001 లో " మారుతీ ఆశ్రం గుంటూరు లో స్థాపించారు .
ప్రొఫైల్ :
  • జన్మ నామం = ధూళిపాళ సీతారామ శాస్త్రి
  • జననం = 24-9-1921,దాచేపల్లి
  • స్వస్థలం = దాచేపల్లి
  • మరణం = ఏప్రిల్ 13, 2007, గుంటూరు , ఊపిరితిత్తుల వ్యాధి
  • ఇతర పేర్లు = ధూళిపాళ
  • వృత్తి = నటుడు
  • సంతానం = ఇద్దరు మగపిల్లలు, ముగ్గరు ఆడపిల్లలు
  • తండ్రి = శంకరయ్య
  • తల్లి = రత్నమ్మ
నటించిన కొన్ని సినిమాలు
  • మాయాబజార్ (1957)
  • మహామంత్రి తిమ్మరుసు (1962)
  • నర్తనశాల (1963)
  • శ్రీకృష్ణార్జున యుద్ధం (1963) (గయుడు)
  • బొబ్బిలి యుద్ధం (1964) (నరసరాయలు)
  • మైరావణ (1964)
  • వీరాభిమన్యు (1965) (ధర్మ రాజు)
  • శ్రీకృష్ణ పాండవీయం (1966) (శకుని)
  • పూల రంగడు (1967)
  • అగ్గిమీద గుగ్గిలం (1968)
  • బాంధవ్యాలు (1968)
  • ఆత్మీయులు (1969)
  • బాలరాజు కథ (1970)
పురస్కారాలు
  • నాటక, సినీ రంగాల్లో ఆయన ప్రతిభకు నిదర్శనంగా ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాటక అకాడమీ వారి నాటక కళాప్రపూర్ణ
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆత్మగౌరవ పురస్కారం
  • తెలుగు విశ్వవిద్యాలయం వారు తెలుగు వెలుగులు ఉగాది పురస్కారం అందజేశారు.
  • బాంధవ్యాలు చిత్రంలో ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవార్డు ప్రదానం చేసింది.
  • అజో-విభో-కందాళం ఫౌండేషన్‌ వారు సైతం 2007 ప్రతిభా పురస్కారానికి ధూళిపాళను ఎంపిక చేసింది.
  • తమిళ పత్రికలు సైతం ఆయనను ‘నడిప్పిళ్‌ పులి నడత్తళ్‌ పసువు’ అని అభివర్ణించారు. అంటే... నటనలో పులి...నడతలో (నిజజీవితంలో) గోవు అని అర్ధం.
  • ఇంకా, సాంస్కృతిక సంఘాలు, సంఘాల సత్కారాలు ఎన్నో లభించాయి
source : జ్యోతి చిత్ర .

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)

లీలారాణి , Leelarani