ఫరిచయం(introduction) :
- ఛాయాగ్రాహకుడు, దర్శకుడు, నిర్మాత, విక్రమ్ స్టూడియో అధినేత బి.ఎస్.రంగా ఆదివారం చెన్నైలో కన్నుమూయడంతో మరో ప్రతిభాశాలిని భారతీయ చిత్ర పరిశ్రమ కోల్పోయింది. 93 ఏళ్ల వయసు కలిగిన రంగా ఈతరం ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు కానీ 'తెనాలి రామకృష్ణ', 'అమరశిల్పి జక్కన', 'వసంతసేన', 'భక్త మార్కండేయ' చిత్రాల సృష్టికర్తగా ఆయన పాతతరం ప్రేక్షకులకు సుపరిచితులే. తెలుగులో తొలి ఈస్ట్‌మన్ కలర్ చిత్రం 'అమరశిల్పి జక్కన' ను నిర్మించిన ఘనత ఆయనదే. అలాగే 'తెనాలి రామకృష్ణ'చిత్రానికి రాష్ట్రపతి పతకం కూడా పొందారు. 45 చిత్రాలకు ఛాయాగ్రాహకునిగా, అయిదు భాషల్లో 55 చిత్రాలకు నిర్మాతగా, దర్శకునిగా రంగా పనిచేశారు. స్వతహాగా కన్నడిగుడైనా ఆయన కన్నడ చిత్రాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో చిత్రాలు నిర్మించారు.
జీవిత విశేషాలు(Profile) :
- పేరు : బి.యస్ . రంగా ,
- పూర్తి పేరు : బిందిగనవాలే శ్రీనివాస్ అయ్యంగర్ రంగా ,
- పుత్తిన తేదీ : 11 నవంబర్ 1917 ,
- పుట్టిన ఊరు : మగడి గ్రామము -- బెంగళూర్ సమీపములో ,
- తండ్రి : శ్రీనివాస్ అయంగర్ ,
- మరణము : 12 డెసెంబర్ 2010 చెన్నై లో చనిపోయారు ,
- నివాసము : మద్రాస్ ,
- పిల్లలు : 3 కుమారులు , ఒక కుమార్తె - వసంత ,
సినిమాలు(Filmography) :
- లైలామజ్ను,
- అమరశిల్పి జక్కన,
- వసంతసేన,
- భక్త మార్కండేయ,
- తెనాలి రామకృష్ణ,
- దేవదాసు ,
- బాలనాగమ్మ ,
- స్త్రీ సాహసం ,
- మా గోపి ,
- కుటుంబ గౌరవం ,
- పెళ్ళి తాంబూలం ,
- చంద్రహాస ,
- వసంత సేన ,
Details of his Filmography :
- 1984 Huliyada Kala
- 1982 Hasyarathna Ramakrishna
- 1981 Bhagyavantha
- 1978 Suli
- 1975 Ganga Ki Kasam
- 1973 Mannina Magalu
- 1973 Pattikatu Ponnaiah
- 1971 Sidila Mari
- 1970 Mr. Rajkumar
- 1969 Bhale Basava
- 1967 Parvathi Kalyanam
- 1967 Vasantha Sena
- 1965/I Chandrahasa
- 1965/II Chandrahasa
- 1965 Maha Sathi
- 1965 Mahasati Ansuya
- 1964 Amarshilpi Jakanachari
- 1964 Amarshilpi Jakanna
- 1964 Pratigne
- 1963 Pyaar Kiya To Darna Kya
- 1962 Ashajeevalu
- 1962 Thendral Veesum
- 1961 Nichaya Thamboolam
- 1961 Pelli Thambulam
- 1960 Gunavathi
- 1960 Mohabbat Ki Jeet
- 1959 Durga Mata
- 1959 Mahishasura Mardini
- 1959/I Raja Malaya Simhan
- 1959/II Raja Malaya Simhan
- 1957 Kudumba Gauravam
- 1957 Kutumba Gauravam
- 1956/I Tenali Ramakrishna
- 1956/I Bhakta Markandeya
- 1956/II Bhakta Markandeya
- 1956/III Bhakta Markandeya
- 1956/II Tenali Ramakrishna
- 1956 Tenali Raman
- 1955 Jaya Gopi
- 1954 Maa Gopi
- 1947 Bhakta Tulsidas
- 1940 Bhakta Tulsidas
Cinematographer (9 titles)
- 1967 Vasantha Sena
- 1964 Amarshilpi Jakanna
- 1956/I Tenali Ramakrishna
- 1956/II Tenali Ramakrishna
- 1956 Tenali Raman
- 1954 Nirupedalu
- 1953 Devadasu
- 1949/I Laila Majnu
- 1942 Bala Nagamma
Producer (3 titles)
- 1969 Bhai Bahen (producer-as B.S. Ranga)
- 1956/II Tenali Ramakrishna (producer)
- 1956 Tenali Raman (producer)
- About B.S.Ranga / Ravi kondararao - pAtabangAram....
బహుముఖ ప్రజ్ఞాశాలి బి.ఎస్.రంగా..
సినిమా పరిశ్రమలోని ఒక శాఖలో అనుభవం సంపాదించిన వారు ఇంకో శాఖని చేపట్టడం ఆనవాయితీగా వస్తూనేవుంది. ఎడిటింగ్‌లో అనుభవం సంపాదించి, ఎడిటర్లుగా పేరు తెచ్చుకున్నవారు దర్శకులైనారు. (ఉ|| సంజీవి, టి.కృష్ణ, ఆదుర్తి సుబ్బారావు) నటులుగా ప్రవేశించి దర్శకులైన వారున్నారు. (భానుమతి, యన్.టి. రామారావు, విజయనిర్మల, ఎస్.వి.రంగారావు, పద్మనాభం మొ||) నిర్మాతలుగా చిత్రాలు తీసి, దర్శకులు కూడా అయినవారు కొందరైతే, దర్శకులుగా పేరు తెచ్చుకుని నిర్మాతలు ఐనవాళ్లూ వున్నారు. ఈ కోవలో ఛాయాగ్రాహకులు కూడా దర్శకులైనవారిలో, కె.రామ్‌నాథ్, రవికాంత్ నగాయిచ్, కమల్‌ఘోష్, యస్.యస్.లాల్, లక్ష్మణ్‌గోరే, బి.ఎస్.రంగా వంటివారు కనిపిస్తారు.
'లైలామజ్నూ' (1949), 'దేవదాసు' (1953) వంటి చిత్రాలకు ఛాయగ్రాహకుడైన రంగా- దర్శకుడై, నిర్మాత కూడా అయి, స్టూడియో కూడా నిర్మించారు. ముఖ్యంగా 'క్లాసిక్స్' అనబడే కళాత్మక చిత్రాలు తీశారు రంగాగారు. తెనాలి రామకృష్ణ (1956), అమరశిల్పి జక్కన (1964), వసంతసేన (1967) వంటి చిత్రాల్ని చెప్పుకుంటే, కన్నడంలో 'మహిషాసుర మర్దిని' తీశారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ నాయకుడు. రంగాగారు తెలుగులో ఈ సినిమాని గుమ్మడిగారితో నిర్మించాలనుకుని, గుమ్మడిగారికి చూపిస్తే, ''మళ్లీ నాతో తియ్యడం ఎందుకు? మొత్తం శ్రమ పడాలికదా. డబ్ చెయ్యండి'' అని సలహా ఇచ్చారాయన. ఆ సలహా ప్రకారం 'డబ్' చేశారు. రాజ్‌కుమార్‌కి గుమ్మడి తెలుగులో 'గాత్రం' ఇచ్చారు.
ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్ని తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో తీసిన రంగా పూర్తి పేరు- బిందిన గనవివే శ్రీనివాస అయ్యంగార్ రంగా. కర్ణాటకలో 1917 నవంబరు 11న జన్మించారు. మాతృభాష కన్నడం. చదువుకుంటూనే ఫొటోగ్రఫీ మీద శ్రద్ధ చూపించి ఆ కళలో కృషి చేశారు. 17వ ఏటనే ఆయన తీసిన ఛాయాచిత్రాలు 'రాయల్ సెలూన్ ఆఫ్ లండన్'లో ప్రదర్శితమయ్యాయి. 'ఫెలో ఆఫ్ ది రాయల్ ఫొటోగ్రాఫిక్ సొసైటీ'గా ఎన్నికయ్యారాయన! దేశాలు పర్యటించి, ఛాయాచిత్రాల నాణ్యతను పరిశీలించి, బొంబాయి చేరి సినిమాటోగ్రఫీలో చేరారు. ఆ సమయంలోనే స్క్రిప్ట్ రైటింగ్ మీద అధ్యయనం చేశారు. కొన్ని కన్నడ, తెలుగు చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసి, దర్శక నిర్మాతగా, స్టూడియో అధిపతిగా మారారు. విక్రమ్ ప్రొడక్షన్స్ పేరిట 'మాగోపి' (1954) 'భక్తమార్కండేయ' (1955), 'తెనాలి రామకృష్ణ' (1956), 'కుటుంబ గౌరవం' (1957), 'పెళ్లి తాంబూలం' (1961), 'అమరశిల్పి జక్కన' (1964), 'వసంతసేన' (1967) వంటి చిత్రాలు నిర్మించి, డైరక్టు చేశారు. ఈ చిత్రాల్లోని కొన్నింటిని కన్నడంలోనూ, తమిళంలోనూ కూడా తీశారు. అసలు, 1940లోనే ఆయన పరదేశి, ప్యాస్, ప్రకాష్ అనే హిందీ చిత్రాలు డైరెక్టు చేశారు.
మొదట్లో జెమిని స్టూడియోలో కొంత కాలం పనిచేసి, తరవాత విక్రమ్ స్టూడియో ఆరంభించారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, శివాజిగణేశన్, రాజ్‌కుమార్, ఎమ్.జి.రామ్‌చంద్రన్, కల్యాణ్‌కుమార్ మొదలైన నటులందరితోనూ రంగా చిత్రాలు తీశారు. రంగా భారతదేశంలోనే మొట్టమొదటి 'ఆటోమేటిక్ కలర్ లాబొరేటరీ'ని నెలకొల్పారు. ఈ లాబొరేటరీ బెంగళూరు సమీపంలోని నయనదహళ్లి అనే వూర్లో వుండేది. వాహిని స్టూడియోలోని లాబొరేటరీ అధిపతిగా పనిచేసిన సేన్‌గుప్తా మొదట్లో అక్కడే పని చేసేవారు. బి.ఎన్.రెడ్డిగారి సలహాతో రంగాగారు ఆ లాబొరేటరీని మద్రాసుకు మార్చారు. అప్పుడే సేన్‌గుప్తా వాహినిలో చేరారు. కన్నడంలోని తొలి వర్ణ చిత్రం 'మహిషాసుర మర్దిని'. అది నిర్మించిన ఘనత కూడా ఆయనదే. అప్పట్లో ఆ చిత్ర నిర్మాణానికి రూ.11 లక్షలు మాత్రమే వ్యయమైందట.
ఛాయాగ్రాహకుడిగా ఆయన తీసిన తొలి చిత్రం- 'భక్త నారదర్'. 'భక్త మార్కండేయి'ని మూడు భాషల్లో ఏకకాలంలో నిర్మించిన ఘనత కూడా ఆయనకి వుంది. పుష్పవల్లిగారి పుత్రుడు బాబ్జీ ('మాయాబజార్'లోని 'విన్నావ యశోదమ్మా' పాటలోని బాలకృష్ణుడు) మార్కండేయుడిగా, తల్లి పుష్పవల్లి మార్కండేయుడి తల్లి మరుద్వతిగా మూడు భాషల్లోనూ నటించారు.
భక్త తులసీదాస్, బాలనాగమ్మ, రాజామలయసింహ, ఆశాజీవులు, తెండ్రల్ వీసుం, ప్యార్ కియాతో డర్నాక్యా, పట్టి కాట్టు పున్నయ్య, గంగాకి కసమ్ వంటి చిత్రాలు రంగాగారు డైరక్టు చేశారు. మొత్తంగా చూస్తే రంగా 55 చిత్రాలు నిర్మించారు. దర్శకత్వం వహించారు. 'భక్త నారదర్' తర్వాత, 40 చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేసిన తర్వాతే, ఆయన దర్శక నిర్మాతగా మారారు. కర్ణాటక రాష్ట్రంలో సినిమా థియేటర్ కూడా నిర్మించారాయన.
'తెనాలి రామకృష్ణ'కు (తమిళంలో తెనాలి రామన్) కన్నడంలో 'హాస్యరత్న రామకృష్ణ' స్క్రిప్టు రాసిన సముద్రాల రాఘవాచార్యగారు చెప్పేవారు. ''రంగాగారికి కథాగమనం మీద మంచి అవగాహన వుంది. తానే దర్శకుడు, నిర్మాతా గనక, పొదుపుగా తియ్యడం గురించి కూడా ఆలోచించేవారు. కథే సినిమాకి ప్రాణం అని, కథ నిర్ణయమైన తర్వాత నిర్మాణ వ్యయాన్ని వృథా కాకుండా, సినిమా తియ్యడం క్షేమదాయకం అనీ- చెప్పేవారు''
'మూగమనసులు' (1964) చిత్రంలో 'అహో ఆంధ్రభోజా' పాట వుంది. ఆ పాటలో కృష్ణదేవరాయలు కనిపిస్తారు. ''ఆ షాట్స్ రంగాగారి 'తెనాలి రామకృష్ణ'లోవి. రంగాగారు ఎంతటి సహృదయుడంటే- పాటలో కొన్ని షాట్స్ 'సూపర్ ఇంపోజ్' చేసుకోడానికి అనుమతి ఇమ్మని అడగ్గానే- 'తప్పకుండా' అని తానే ఆ షాట్స్ ప్రింట్ చేయించారు. ఎందుకైనా మంచిది. రామారావు గారితో కూడా ఓ మాట చెప్పండి'' అన్నారు. 'తప్పకుండా' అని, నేను రామారావుగారితో చెబుతే, ఆయన కూడా 'దానికేం బ్రదర్. అంతకంటెనా?' అన్నారు. వాళ్ళ మంచి మనసులు అలాంటివి''- అని ఆదుర్తి సుబ్బారావుగారు చెప్పారు అప్పుడు.
చిత్రంలోని సంగీతం ఎంతో మధురంగా, శ్రావ్యంగా వుండాలని రంగా గారు ఆశించేవారు. 'మాగోపి', 'తెనాలి రామకృష్ణ' చిత్రాల్లో మంచి సంగీతం వినిపిస్తుంది. బి.విశ్వనాథన్, రామమూర్తి ఈ చిత్రాలకు సంగీత దర్శకుడైతే, 'అమరశిల్పి జక్కన', 'వసంతసేన' చిత్రాలకు యస్. రాజేశ్వరరావు సంగీత దర్శకుడు. ''ఆయన మూడ్ ప్రకారం మనం నడుచుకోగలిగితే, రాజేశ్వరరావుగారు అద్భుతమైన వరసలు చేస్తారు. 'జక్కన' సమయంలో ఇబ్బంది పడినా, 'వసంతసేన' సమయంలో ఆయన ఇష్టప్రకారమే 'సమయం' పాటించాను'' అని చెప్పేవారు రంగాగారు.
రంగాగారి కొన్ని చిత్రాలకు బహుమతులు లభించాయి. వయసు పైనబడిన తర్వాత, ఆయన చిత్ర నిర్మాణం ఆపి, కర్ణాటక వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యం విషమించి తన 93వ ఏట (12-12-2010) మృతి చెందిన రంగాగారికి ముగ్గురు పుత్రులు, ఒక పుత్రిక సంతానం.
నాటి ఉత్తమ ఛాయగ్రహణానికి ప్రామాణికంగా 'లైలామజ్నూ', 'దేవదాసు'- చిత్రాల గురించి నేటి ఛాయాగ్రహకులు చెప్పుకుంటూ వుంటారు. దృశ్యానికి తగ్గ 'మూడ్'ని తన లైటింగ్‌తో సృష్టించారని- కీర్తిస్తారు.
- ==========================================
visit my Webblog ->
Dr.Seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog