L.R.Eswari (singer)-ఎల్.ఆర్.ఈశ్వరి (గాయని)








పరిచయం (Introduction) : 

  • ఎల్.ఆర్.ఈశ్వరి-దక్షిణభారత దేశం నేపద్య గాయకురారు. దాదాపు పధ్నాలుగు భాషల్లో పాటలు పాడి తన స్వరాన్ని శ్రోతల మదిలో సుస్థిరపరిచినారు. ఈమె మద్రాసు లో ఒక రోమన్ కాథలిక్ కుటుంబంలో జన్మించింది. తమిళ చిత్ర నిర్మాత ఎ.పి.నటరాజన్ ఈమె పేరును సినిమాల కోసం టూకీగా ఎల్. ఆర్. ఈశ్వరి గా మార్చాడు. ఈమె తమిళం, తెలుగు, కన్నడం, మళయాళం, హిందీ, తుళు మరియు ఆంగ్లము మొదలగు 14- భాషలలో కొన్ని వేల పాటల్ని పాడింది.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : ఎల్.ఆర్.ఈశ్వరి ,
  •  ఊరు : పరమకుడి (తమిళనాడు ),
  • పుట్టిన ఊరు : చెన్నై , 
  • పుట్టిన తేదీ : 08-డిసెంబర్ ,
  • చదువు : ఎస్.ఎస్.ఎల్.సి, 
  • నాన్న : ఆంటోని - ఎల్.ఆర్ ఈశ్వరి చిన్న తనము(5 ఏళ్ళు)లోనే చనిపోయారు.  
  • అమ్మ : రెజినామేరి నిర్మల-మంచి గాయని  , 
  • నమ్మిన దేవత : వేలాంగిణి మాత . ఈమాతను రాజేశ్వరి అంటారు, అమ్మతరపువాళ్ళు " లూర్ద్ మేరీ " అనేవారు .అందువలన ఈమె పూర్తి పేరు " లూర్ద్ మేరీ రాజేశ్వరి " దానిని ఎల్.ఆర్.ఈశ్వరి గా పిలవడం అలవాటు అయింది. 
  • తెలుగులో తొలి సినిమా : ఏదో గుర్తు లేదు కానీ ‘దొంగలున్నారు జాగ్రత్త’ (’58), ‘జగన్నాటకం’ (’60) లాంటి వాటిల్లో పాడా. ఆ రోజుల్లోనే ‘నా పేరు సెలయేరు నన్నెవ్వరాపలేరు!’ పాట పాడా. నా కెరీర్ ఆ పాట లాగే సాగింది.. . .అని అంటారు .
  • పెళ్ళి : కాలేదు. 
కెరీర్ : 
  • నాన్న : ఆంటోని - ఎల్.ఆర్ ఈశ్వరి చిన్న తనములోనే చనిపోయారు.  ఇల్లు గడవడం కష్టము గా ఉండేదట . పాటలు పాడడం వృత్తిగా స్వీకరించి ,చదువు వదిలేసి రేడియో పాటలు పాడే అమ్మ వెనుక రికార్డింగులకు వెళ్ళేవారట . అలా పాట అలవాటు అయిపోయిందని , ప్రత్యేకముగా ఎక్కడా సంగీతాన్ని నేర్చుకోలేదు అని అంటారు. వచ్చిన ప్రతి పాటను పాడుతూ  చిన్నతనములో కుటుంబాన్ని ఆర్ధికము గా ఆసరా అయ్యారని అంటారు. 
  • ఈమెను మొదటగా కె.వి.మహదేవన్ గుర్తించి, "నల్ల ఇడత్తు సంబంధం" (1958) అనే తమిళ సినిమాలో మొదటిసారిగా సోలోగా పాడే అవకాశాన్ని ఇచ్చాడు. అయితే ఆ చిత్రం విఫలం కావడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. కాని "పాశమలార్" (1961) సినిమాతో ఆమెకు మంచి గాయనిగా పేరొచ్చింది. తర్వాత కాలంలో ఆమె ఎక్కువగా చెళ్ళపిళ్ళ సత్యం దర్శకత్వంలో తయారైన ఎన్నో క్లబ్ సాంగ్స్ మరియు ఐటమ్ నంబర్లకు పాడారు. ఈమె ఎక్కువగా జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత మొదలైన నాట్యకత్తెలకు పాడేవారు. వీరే కాకుండా విజయలలిత, లక్ష్మి, సరిత వంటి యువ నటీమణులకు కూడా తన గళాన్ని దానం చేసారు.
  • ఈమె వ్యక్తిగత జీవితం మాత్రం విషాదమే. పేదరికంలో జీవించిన ఈమె కుటుంబం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసింది. అవివాహితగానే ఉండిపోయి, సమాజం నుండి అంతగా గుర్తింపుకు నోచుకోలేదు.
  • ఈమెకు తమిళనాడు ప్రభుత్వం 1984లో కళైమామణి అవార్డు ప్రదానం చేసింది

 సినిమాలు (filmography ): 
కొన్ని సినిమాలు-పాటలు


  •     దొంగలున్నారు జాగ్రత్త (1958) (తొలి తెలుగు సినిమా)
  •     జగన్నాటకం (1960)
  •     అగ్గిపిడుగు (1964)
  •     నవగ్రహ పూజామహిమ (1964) : నవ్వర నవ్వర నా రాజా నవ్వుల నివ్వర ఓ రాజా
  •     పాండవ వనవాసం (1965) : మొగలి రేకుల సిగదానా (హేమమాలిని అభినయించిన పాట)
  •     ప్రేమించి చూడు (1965)
  •     శ్రీ సింహాచల క్షేత్ర మహిమ (1965)
  •     అగ్గిబరాట (1966)
  •     ఉమ్మడి కుటుంబం (1967)
  •     కంచుకోట (1967)
  •     గోపాలుడు భూపాలుడు (1967)
  •     శ్రీకృష్ణావతారం (1967) : చిలుకల కొలికిని చూడు నీ కళలకు సరిపడు జోడు
  •     అమాయకుడు (1968) : పట్నంలో శాలిబండ పేరైన గోలకొండ
  •     ఉమా చండీ గౌరీ శంకరుల కథ (1968)
  •     పాలమనసులు (1968)
  •     బంగారు గాజులు (1968) : జాజిరి జాజిరి జక్కల మావా
  •     బందిపోటు దొంగలు (1968) : గండరగండా షోగ్గాడివంటా
  •     బాగ్దాద్ గజదొంగ (1968)
  •     గండికోట రహస్యం (1969)
  •     నిండు హృదయాలు (1969)
  •     బందిపోటు భీమన్న (1969)
  •     కథానాయిక మొల్ల (1970) : నానే చెలువే అందరికి ( ఐదు భాషలలో పాడిన పాట)
  •     జన్మభూమి (1970)
  •     లక్ష్మీ కటాక్షం (1970) : అందాల బొమ్మను నేను చెలికాడ
  •     జగత్ జెంత్రీలు (1971)
  •     జేమ్స్ బాండ్ 777 (1971)
  •     బస్తీ బుల్ బుల్ (1971) : ఏ ఎండకా గొడుగు పట్టు రాజా నువ్వు పట్టకుంటే నీ నోట మట్టి రాజా
  •     దెబ్బకు ఠా దొంగల ముఠా (1971)
  •     నమ్మకద్రోహులు (1971) : ఏమా కోపమా నేను వేచింది నీకోసమే పాన్పు వేసింది
  •     బంగారుతల్లి (1971)
  •     ప్రేమనగర్ (1971) : లేలేలే లేలేలే నా రాజా... లేవనంటావా నన్ను లేపమంటావా
  •     రౌడీలకు రౌడీలు (1971) : తీస్కో కోకో కోలా వేస్కో రమ్ము సోడా
  •     పిల్లా-పిడుగు (1972)
  •     బాలభారతము (1972) : బలె బలె బలె బలె పెదబావ భళిర భళిర ఓ చినబావా
  •     భార్యాబిడ్డలు (1972) : ఆకులు పోకలు ఇవ్వద్దూ నా నోరు ఎర్రగ చెయ్యొద్దూ
  •     మంచి రోజులొచ్చాయి (1972)
  •     రైతుకుటుంబం (1972)
  •     ఎర్రకోట వీరుడు (1973)
  •     జీవన తరంగాలు (1973) : నందామయా గరుడ నందామయా
  •     తాతా మనవడు (1973) : రాయంటీ నా మొగుడు రంగామెల్లీ తిరిగి రాలేదు
  •     దేవుడు చేసిన మనుషులు (1973) : మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల మాపటేల కలుసుకో
  •     దేశోద్ధారకులు (1973)
  •     ధనమా దైవమా (1973)
  •     పుట్టినిల్లు మెట్టినిల్లు (1973) : బోల్తా పడ్డావు బుజ్జి నాయనా
  •     అల్లూరి సీతారామరాజు (1974)
  •     నిజరూపాలు (1974)
  •     నిప్పులాంటి మనిషి (1974) : వెల్ కం స్వాగతం చేస్తా నిన్నే పరవశం
  •     చిన్ననాటి కలలు (1975)
  •     అంతులేని కథ (1976) : అరె ఏమిటి ఈ లోకం... పలుగాకుల లోకం
  •     పాడిపంటలు (1976)
  •     మన్మధ లీల (1976) : హలో మై డియర్ రాంగ్ నంబర్
  •     దొంగల దోపిడీ (1978)
  •     దొంగల వేట (1978)
  •     మరో చరిత్ర (1978) : భలె భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్
  •     సింహబలుడు (1978) : సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్
  •     అందమైన అనుభవం (1979) : ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు
  •     చూసొద్దాం రండి (2000) (చివరిగా పాడిన సినిమా)



  •  *==============================* 

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala