Uppuluri Rama Sharma-ఉప్పులూరి రామశర్మ




పరిచయం (Introduction) : 

పరోపకారం, నాయిల్లు మొదలైన సినిమాల్లో రెండో నాయకుడిగా నటించిన ఉప్పులూరి రామశర్మది కాకినాడ. 'గౌతమబుద్ధ' నాటకంలో బుద్ధిడి పాత్ర ధరించి ఖ్యాతి తెచ్చుకున్నారు. ఆ ఖ్యాతి-చిత్రాలకు తీసుకొచ్చింది. ఆ రోజుల్లో సినిమాల్లో నాయికానాయకుల జంట కాకుండా, రెండో జంట ఒకటి వుండేది. సావిత్రి ఉపనాయికగా నటిస్తున్నప్పుడు రామశర్మ ఉపనాయకుడు. అలా, వాళ్ళిద్దరూ జంటగా కొన్ని చిత్రాల్లో నటించారు. బహుశా రామశర్మ తొలి చిత్రం 'అదృష్టదీపుడు' (1950) అనుకుంటాను. ఈ జానపదంలో అతనే హీరో. సూర్యకుమారి నాయిక. ('అదృష్టదీపుడు' గుమ్మడి గారికి మొదటి సినిమా). ఆ సినిమా తీసిన తమిళనాడు టాకీస్‌ సౌందరరాజన్‌, 'నవ్వితే నవరత్నాలు' (1951) తీశారు. ఇందులోనూ రామశర్మే నాయకుడు. నాయిక కృష్ణకుమారి. ఈ జానపదాలు రెండూ బాగానే నడిచాయి. రాజరాజేశ్వరి వారు (కడారు నాగభూషణం, కన్నాంబ గార్ల సంస్థ) తీసిన సాంఘికం 'లక్ష్మి' (1953)లో రామశర్మ, కృష్ణకుమారి హీరో హీరోయిన్లు. జోళ్ల సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన 'పల్లెపడుచు' (1954)లోనూ రామశర్మ నాయకపాత్రధారే. అలా, అటూ ఇటూ నాయకుడిగా, ఉపనాయకుడిగా నటించి పేరు తెచ్చుకున్నా రాను రాను చిత్రాలు తగ్గాయి. మరికొందరు కొత్తనటులు రావడం వల్లనో, ప్రోత్సాహం తగ్గడం వల్లనో అనుకోవచ్చు. (రామశర్మగారిది . . . మనిషి నిదానం. మెత్తని మాట. ఆయన మీద ఎలాంటి ఫిర్యాదులూ లేవు. ఆ రోజుల్లో సినిమా ప్రేక్షకులకి రామశర్మ బాగా తెలుసు. తర్వాత ఆయన కాకినాడ వెళ్లిపోయారు)


 జీవిత విశేషాలు (profile) : 


  • పేరు : ఉప్పులూరి రామశర్మ
  • ఊరు :  కాకినాడ


నటించిన సినిమాలు (filmography ): 


  • 'అదృష్టదీపుడు' (1950),
  • 'నవ్వితే నవరత్నాలు' (1951),
  • సాంఘికం 'లక్ష్మి' (1953),
  •  'పల్లెపడుచు' (1954),
  • పరోపకారం, 
  • నాయిల్లు,
  • Bangarupapa,(courtesy with Balakrishnarao Vanguri)

  • Courtesy with : Ravi kondalararao@pathabangaram of Eenadu cinema niews paper 06/2014.

 *==============================*

Comments

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala