G.N.swamy(old tollywood actor)-జి.ఎన్‌.స్వామి





పరిచయం (Introduction) :



  • గాదె నరసింహస్వామి అని పూర్తి పేరుగల జి.ఎన్‌.స్వామి బాలనటుడు. పాటలూ, పద్యాలూ బాగా పాడేవారు. బరంపురంలో వుంటూ చిత్రాల్లో ప్రవేశించారు. 1936లో ఈస్టిండియా వారికి సి.పుల్లయ్యగారు తీసిన ''అనసూయ, ధ్రువ''లో ధ్రువ పాత్రధారి జి.ఎన్‌.స్వామి. 'అనసూయ'లో అందరూ బాలనటులే. ప్రౌఢ పాత్రలూ ధరించారు. 'అనసూయ' నిడివి సినిమాకి తగ్గడంతో (ఆ రోజుల్లో సినిమా రెండన్నర, మూడు గంటల పాటు నడవాలి) 'ధ్రువ' మొదలుపెట్టి రెండూ కలిపి ఒకే 'షో'గా విడుదల చేశారు. ఆ 'ద్విచిత్ర ఏకచిత్రం' కాసులు బాగా సంపాదించింది. ధ్రువుడు పాడిన పాటలు, పద్యాలూ ఆకట్టుకున్నాయి. అందంగానూ, సౌమ్యంగానూ కనిపించాడు ధ్రువుడు. ఇంకొక బాల పాత్ర ప్రధానంగా కనిపించే 'మార్కండేయ'ని తీసినప్పుడు జి.ఎన్‌.స్వామితో చిత్రపు నారాయణమూర్తి 'భక్త మార్కండేయ' (1939) నిర్మించారు. వేమూరి గగ్గయ్య యముడు. రెండూ బాలభక్తుల కథలు కావడంతో ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. 'మార్కండేయ'లోని భక్తి పాటలు కూడా స్వామి చక్కగా పాడి, ఆకట్టుకున్నారు. ఆ బాలుడు పెద్దవాడయ్యాక, అటూ ఇటూ కాని వయసులో పాత్రలు రాలేదు గాని, సినిమాల్లోనే వుండిపోయి నిర్మాణ, దర్శకత్వ శాఖల్లో పనిచేశారు. నాటకాల్లో నటించేవారు. (శ్రీకాకుళంలో నేను (Ravi kondalarao)స్కూలు చదువులో ఉన్నప్పుడు 'మిస్‌ ప్రేమ బి.ఎ.' అనే నాటకంలో స్వామిది ముఖ్యపాత్ర. అప్పుడు నేను కలిశాను. ఆ పరిచయంతో దరిమిలా మద్రాసులోనూ కలిసేవాళ్లం) చాలా కాలం స్వామిగారు ఘంటసాల బలరామయ్యగారి సంస్థ ప్రతిభాలో, సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1941లో వచ్చిన 'చంద్రహాస'లో జి.ఎన్‌.స్వామి నాయక పాత్ర ధరించారు. సూర్యకుమారి నాయిక. కోన ప్రభాకరరావు గారు 'రూపవతి' పేరుతో (1951) జానపదం తీశారు. అందులో జి.ఎన్‌.స్వామి నాయకుడు. ప్రభాకరరావుగారు చేసిన ప్రయోగం ఏమిటంటే, హాస్యనటుల పక్కన హాస్యపాత్రలు ధరించే సురభి బాలసరస్వతి చేత నాయిక పాత్ర వేయించారు. ఆ సినిమాలోని సంగీతం (సి.ఆర్‌.సుబ్బరామన్‌) రాణించింది. సినిమా కూడా నష్టాలు తేలేదు. తర్వాతి సంవత్సరంలోనే ప్రతిభా వారు 'చిన్నకోడలు' తీశారు. ఈ సాంఘికంలో జి.ఎన్‌.స్వామి హీరో. అంతే! అటు తర్వాత అవకాశాలు రాలేదు. కాని, చాలా చిత్రాల్లో పాత్రధారణ చేస్తూ మద్రాసులోనే గడిపారు. డబ్బింగ్‌ చిత్రాల్లో గాత్రం కూడా అందించారు. బాలనటుడు హీరో ఐ, రెండు చిత్రాల్లో నటించినా, తర్వాత తర్వాత ప్రౌఢ పాత్రల్లాంటివి ధరించినా, అంతగా నిలదొక్కుకోలేకపోయారు. ''నేను 1936 నుంచి సినిమాల్లోనే వున్నాను. చాలా చాలా మార్పులు చూస్తూ వచ్చాను. సినిమాల్లో నాగయ్యగారిని 'సీనియర్‌ నటుడు' అని చెప్పేవారు. కాని, నేను నాగయ్యగారి కంటే సీనియర్‌ని'' అని చెప్పేవారు స్వామి.--Ravi kondalarao(cine artist),



 జీవిత విశేషాలు (profile) : 


  • పేరు : G.N.swamy(old tollywood actor)-గాదె నరసింహస్వామి,


నటించిన సినిమాలు (filmography ):


  • ''అనసూయ--1936, 
  • ధ్రువ--1936'',
  • భక్త మార్కండేయ' (1939),
  • 1941లో వచ్చిన 'చంద్రహాస'లో జి.ఎన్‌.స్వామి నాయక పాత్ర ధరించారు,
  • రూపవతి' పేరుతో (1951) జానపదం,
  • చిన్నకోడలు'  ఈ సాంఘికంలో జి.ఎన్‌.స్వామి హీరో. 


  • *source : pathabangaram / Ravi kondalarao @ eenadu cinema news.15/06/2014

==============================*

Comments

Popular posts from this blog

పరిటాల ఓంకార్,Omkar Paritala

కృష్ణ ఘట్టమనేని , Krishna Ghattamaneni

లీలారాణి , Leelarani