Sunday, June 29, 2014

Anitha Chodary-అనిత చౌదరి
పరిచయం (Introduction) :

 • సీరియల్స్ తో నటనా పరిశ్రమలో అడుగుపెట్టి , వెండితెరమీద వైవిధ్య మైన ప్రాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ... అనితా చౌదరి. డాన్సర్ కావాలన్న కోరిక ఉన్నా విధివ్రాత ప్రకారము మే నటి అయ్యానని చెప్పికుంటుంది. ఈమె యాంకర్ మరియు క్యారక్టర్ నటి  . ఈమె కెరీర్ లో " మర్మధుడు (2002), రాజ్ (2011) , సంతోషం(2002) సినిమాలు మంచి పేరుతె్చ్చి పెటాయి. సుమారు 25 సినిమాలు చేసారు. 

 జీవిత విశేషాలు (profile) : 

 • పేరు : అనితా చౌదరి ,
 • తోబుట్టువులు : ముగ్గురు అన్నయ్యలు తరువార తను ,
 • నివాసము : హైదరాబాద్ , 
 • పుట్టిన ఊరు : గుంటూరు , 
 • భర్త : అమెరికాలో పనిచేసారు .
 • పిల్లలు : కొడుకు -

Carrer : 

 • ఏడేళ్లు వరుసగా అవార్డు..!


    పెద్ద డ్యాన్సర్‌గా మారి పేరు తెచ్చుకోవాలనుకున్న ఆమె అనుకోకుండా కెమెరా ముందుకొచ్చింది. యాంకరింగ్‌, సీరియళ్లతో అడుగుపెట్టి.. వెండి తెరమీద వైవిధ్యమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. తనే అనితాచౌదరి.

నేను పుట్టి పెరిగిందీ, చదువుకొన్నదీ అంతా హైదరాబాద్‌లోనే. ముగ్గురన్నయ్యల తర్వాత నేను. అలాని ఇంట్లో గారం ఏమీలేదు. నేను మాత్రం వాళ్లతో సమానంగా టామ్‌బోయ్‌లా పెరిగాను. అప్పుడు చిన్నదాన్ని. ఓసారి పక్కింటి అమ్మాయి డాన్స్‌ క్లాసు దగ్గర దింపమంటే తనతో వెళ్లాను. ఆ నిమిషం నాకు ఏమనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చెప్పకుండా కూచిపూడి నేర్చుకోవడం మొదలుపెట్టా. తను మా ఇంట్లో చెప్పకుండా ఉండేందుకు ఓ చాక్లెట్‌ ఇచ్చేదాన్ని. ఆ డాన్స్‌ స్కూల్లో బ్యాలేలూ, కథక్‌ నేర్చుకొన్నా. నాది ముందు నుంచీ ఎవరి మీదా ఆధారపడకూడదనే తత్త్వం. అందుకే పిల్లలకు ట్యూషన్లు చెబుతూ, సమ్మర్‌ జాబ్‌లు చేస్తుండేదాన్ని. అప్పట్లో డీడీలో వచ్చే సీరియళ్లకు మంచి ఆదరణ. అలాంటి సమయంలో ఓసారి అశోక్‌రావుగారు డ్యాన్స్‌ స్కూల్లో నన్ను చూసి టెలిఫిల్మ్‌లో నటించమని అడిగారు. అదే మొదటిసారి కెమెరా ముందుకు నటించడం. అయితే అది ప్రసారం కాలేదు. నాకేమో డాన్సర్‌ అవ్వాలని కల కాబట్టి దాన్ని పట్టించుకోలేదు.

వెళ్లిపోతానన్నా: ఈటీవీలో యాంకర్ల కోసం ఆడిషన్లు జరుగుతున్నాయంటే ఫ్రెండ్స్‌ నాకు తెలియకుండా నా ఫొటో పంపించారు. తరవాత తలనిండా నూనె రాసుకొని ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడేమో ముంబయి, ఢిల్లీ, కోల్‌కతా నుంచి వచ్చిన అందమైన అమ్మాయిలు. నేనేమో జిడ్డు ముఖంతో. నా నటనను పరీక్షించడం కోసం 'సోది చెప్పడం వచ్చా.. చెప్పు చూద్దాం' అన్నారు. సోది చెప్పడం నేనెప్పుడు వినలేదు. దాంతో నేను వెళ్లిపోతా సార్‌ అన్నా. 'సరే కెమెరా వంక చూసి నీపేరు, చదువు చెప్పేసి వెళ్లిపో' అన్నారు. ఆ పని చకచకా చేసేసి బతుకు జీవుడా అని బయటపడ్డా. కొన్నిరోజులకు ఈటీవీ నుంచి పిలుపు. బ్రహ్మానందం గారితో కలిసి ఓ కార్యక్రమానికి యాంకరింగ్‌ చేసే అవకాశం. అప్పటికి ఇంటర్‌ చదువుతున్నా. ఆ కార్యక్రమం హిట్‌ అయింది. తరవాత నరేష్‌గారితో కలిసి కౌంట్‌డౌన్‌ కార్యక్రమం. అదయ్యాక పబ్లిక్‌ డిమాండ్‌ అనే లైవ్‌ షో. ఈ కార్యక్రమాన్ని ఏడేళ్లపాటు చేశా. అప్పటినుంచి అన్నీ వరుస అవకాశాలు. తరవాత మంజులానాయుడి దర్శకత్వంలో ఈటీవీలో నేను చేసిన 'కస్తూరి' డైలీ సీరియల్‌ పెద్ద సంచలనం. వరసగా ఆ సీరియల్‌కి ఏడు సంవత్సరాల పాటు బెస్ట్‌ యాక్టరస్‌ అవార్డుని అందుకొన్నా.

హీరోయిన్‌గా చేయనన్నా: మొదట్లోనే నాకు సినిమా అవకాశాలు వచ్చాయి. ఈవీవీగారు 'తాళి' తీస్తున్న సమయం. శ్రీకాంత్‌ హీరో.. నువ్వు హీరోయిన్‌ అంటూ స్క్రీన్‌ టెస్ట్‌ కూడా చేశారు. షూటింగ్‌ ఆరునెలల పాటు రాజమండ్రిలో ఉంటుందని చెప్పడంతో చేయనన్నా. 'హీరోయిన్‌ వేషం ఇస్తానంటే వద్దన్నదాన్ని నిన్నే చూస్తున్నా' అంటూ ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు వివాహం. మావారు ఐటీ ఐద్యోగి. యూఎస్‌లో ఉంటారు. పెళ్లయిన కొన్నాళ్లకు నాకు పెద్ద కార్‌ యాక్సిడెంట్‌ కావడంతో కెరీర్‌కి బ్రేక్‌ ఇచ్చా. కాస్త కోలుకున్నాక వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. సినిమాల్లో నటించేందుకు ప్రాధాన్యమిచ్చా. 'మురారీ', 'రాజా' 'సంతోషం', 'ఆనందం' 'ప్రాణం', 'నువ్వే నువ్వే', 'ఓసి నీ ప్రేమ బంగారంగానూ', 'వరుడు', 'ఛత్రపతి', 'ఉయ్యాల జంపాల'.. ఇలా ముఫ్పై సినిమాల దాకా నటించాను. 'నువ్వే-నువ్వే'లో రాజీవ్‌ కనకాలతో కలిసి నటించిన పాత్ర నాకు బాగా ఇష్టం. త్రివిక్రమ్‌ ఆ పాత్ర ఇచ్చేముందు నాతో ఓ మాట అన్నారు. 'కస్తూరి' సీరియల్‌ నేను చూసేవాడిని. ఆ పాత్రలో నువ్వు ఎప్పుడూ ఏడుస్తూ కనిపించేదానివి. అనితకి నవ్వించడం కూడా వచ్చని తెలియచెప్పడానికే ఈ పాత్ర ఇచ్చా' అన్నారు. ఈ మధ్య విడుదలైన 'ఉయ్యాల జంపాల'లో నాది తల్లిపాత్ర. అందులో పదహారేళ్ల అబ్బాయికి తల్లిగా నటించా. మా అబ్బాయి వయసు మూడేళ్లు. దాంతో ఆ పాత్ర చేయడం కాస్త ఇబ్బందిగానే అనిపించింది. కానీ ఏ పాత్రనయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని చెయ్యాలి అనుకుని చేశా. మంచి గుర్తింపు వచ్చింది. అది చూసిన తర్వాత అక్కినేనిగారి పెద్ద కోడలు 'మా ఇంటిల్లిపాదీ ఈ సినిమా చూశాం అనితా చాలా బాగా చేశావ్‌' అనడంతో నా సంతోషం రెట్టింపయ్యింది. మధ్యమధ్య అమెరికా వెళ్లడం వల్ల అడపాదడపా మాత్రమే నటించేదాన్ని. ఇప్పుడు మళ్లీ కెరీర్‌లో బిజీ అవుతున్నా. 'లక్ష్మీ రావే మా ఇంటికి,' 'మాయ', 'పట్టపగలు', 'తులసిదళం', 'లవర్స్‌', 'రారా కృష్ణయ్య' వంటి సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాను.


నటించిన సినిమాలు (filmography ):

 • రాజ్ (2001),
 • వరుడు (2010),
 • నిన్నే ఇష్టపడ్డాను (2003),
 • మన్మధుడు (2002),
 • నీ ప్రేమకై , 
 • ప్రాణం ,
 • సంతోషం (2002), 
 • నువ్వే నువ్వే ((2002), *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog