pavitra Lkesh-పవిత్ర లోకేష్
పరిచయం (Introduction) :
- ఈమె కన్నడ నటి . తెరమీద కన్నీళ్లు పెట్టుకుని, ప్రేక్షకుల కంటతడి పెట్టిస్తుంది. తెర వెనక నవ్వుల పువ్వులు పూయిస్తుంది. యువ హీరోలకు తల్లిగా నటిస్తూ... ఇంట్లో రెండేళ్ల బాబు ఆలనాపాలనా చూసుకుంటుంది. చిన్న వయసులోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడిన పవిత్ర లోకేష్ 'ప్రస్థానం' నుంచి 'హార్ట్ ఎటాక్' వరకూ ఎన్నో చిత్రాల్లో నటించారు. అమ్మగా అందరితో వహ్వా అనిపించుకున్నది.
- సీరియళ్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యా. 'మేఘసందేశం', 'గోదావరి'.. ఇలా మరికొన్ని జెమినీలో రీమేక్ సీరియళ్లుగా ప్రసారమయ్యాయి. అలా నా ప్రయాణం తెలుగులో వెండి తెర వరకూ సాగింది. నేను తెలుగులో నటించిన మొదటి సినిమా 2003లో వచ్చిన 'దొంగోడు'. ఆ తరవాత ముత్యాల సుబ్బయ్యగారి 'ఆలయం'. బ్రేక్‌నిచ్చింది మాత్రం 'ప్రస్థానం'. ఆ తరవాత వరసగా 'బావ', 'ఆరెంజ్', 'శక్తి', 'సోలో', 'గౌరవం', 'పేరెంట్స్', 'హార్ట్ ఎటాక్'.. ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగులో ఇరవైకి పైనే సినిమాల్లో చేశాను. అన్నీ అమ్మగా మంచి పాత్రలు పోషించాలి. వాటిల్లో మాత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ పాత్ర ప్రస్థానంలో శర్వానంద్ తల్లిగా చేసిన రోల్
జీవిత విశేషాలు (profile) :
- పేరు : పవిత్రాలోకేష్ ,
- పుట్తిన ఊరు : మైసూర్ ,
- నాన్న : కన్నడ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్(పవిత్ర -ఇంటర్ మొదటి సం. చదుతున్న డే చనిపోయారు) ,
- అమ్మ : టీచర్ ,
- చదువు : కన్నడ, ఇంగ్లిష్ లో ఎం.ఎ. ,
నటించిన తెలుగు సినిమాలు (filmography ):
అన్నీ అమ్మగా మంచి పాత్రలు పోషించారు .
- దొంగోడు (2003 లో),
- ఆలయం ,
- ప్రస్థానం ,
- బావ ,
- ఆరెంజ్ ,
- శక్తి ,
- సోలో,
- గౌరవం ,
- పేరెంట్స్ ,
- హార్ట్ ఎటాక్ ,
- ===========================
visiti my website > Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog