Keerthi TV actress-కీర్తి .చిన్ని తెర నటి




పరిచయం (Introduction) : 
    డాక్టర్‌ కావాలనుకుని యాక్టరయిన ఓ అమ్మాయి... ఆకట్టుకునే నటనతో తెలుగునాట ఇంటింటా పరిచయమైంది. ఈటీవీ 'తూర్పు పడమర'తో సీరియళ్ల ప్రస్థానం మొదలుపెట్టిన కీర్తి... తన చిన్ని తెర ప్రయాణం గురించి ఇలా చెబుతోంది.

హాయ్‌, నా అసలు పేరు కీర్తి. మా అక్క మంజుల (చంద్రముఖిలో నటిస్తోంది)ని ఆదరించినట్లే నన్నూ మీరు అక్కున చేర్చుకున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు తెలుగు చక్కగా మాట్లాడుతున్నా. హైదరాబాదీ అమ్మాయిగా గుర్తింపు పొందుతున్నా కానీ నేను పుట్టి పెరిగిందంతా బెంగళూరులోనే. మేం నలుగురం అక్కచెల్లెళ్లం. అందరిలోనూ నేనే చిన్నదాన్ని. దాంతో బాగా ముద్దు చేసేవారు. నాన్న స్టేజి ఆర్టిస్టు కావడంతో ఎప్పుడూ ఇంట్లో ప్రాక్టీస్‌ చేస్తుండే వారు. నాన్నని గమనిస్తూ, నేనూ అనుకరించేదాన్ని. నటన పట్ల నాకున్న ఆసక్తిని గమనించి, నాన్న కొన్ని నాటకాల్లో నాకు అవకాశమిచ్చారు. అలా ఓసారి నాటకం వేస్తున్నప్పుడు, నన్ను చూసిన కన్నడ దర్శకుడు ఓ సినిమాలో బాలనటిగా నటించే అవకాశం ఇచ్చారు. అది పెద్ద హిట్‌ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. కాస్త పెద్దయ్యాక హీరోయిన్‌గానూ అవకాశాలు రావడంతో, నాలుగు కన్నడ సినిమాల్లో నటించా. చిన్నప్పట్నుంచీ డాక్టర్‌ అవ్వాలనీ, మంచి డాన్సర్‌గా పేరు తెచ్చుకోవాలనీ అనుకునేదాన్ని. కానీ నటనతో బిజీ అయిపోయాక పూర్తిస్థాయిలో ఆ రెండింటిపై శ్రద్ధ పెట్టలేకపోయాను. అయినా చదువుని నిర్లక్ష్యం చేయకుండా బీఏ పూర్తి చేశాను.

కళాశాలలో తీపి గుర్తులూ...
ఇంటర్‌లో రోజూ కాలేజీకి వెళ్లి చదివా. అప్పటికే సెలబ్రిటీగా ఓ హోదా ఉండటంతో 'చాలా అందంగా ఉంటారు. మిమ్మల్ని ఇష్టపడుతున్నా' అంటూ చాలామంది ప్రేమ ప్రతిపాదనలు తెచ్చే వారు. బోలెడు ప్రేమలేఖలూ, మెసేజిలూ వచ్చేవి. అందుకే నాన్న ప్రతిక్షణం నా వెంట ఉండేవారు. నా చదువుకీ, నటనకీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వారు. నా ఇంటర్‌ పూర్తయ్యేసరికే అక్క తెలుగులో 'చంద్రముఖి' సీరియల్‌లో నటిస్తోంది. దాంతో అప్పుడప్పుడూ తనతో పాటూ సెట్స్‌కి వెళుతుండేదాన్ని. అప్పుడే దాసరి నారాయణరావు గారి బ్యానర్‌లో 'తూర్పు పడమర' సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అది మొదలు కలియుగ రామాయణం, పుత్తడి బొమ్మ, అభిషేకం, సుడిగుండాలు, సముద్రం, శ్రావణీ సుబ్రహ్మణ్యం, శాంభవి, తరంగాలు, అనుబంధాలు... ఇలా సుమారు పది సీరియళ్లలో నటించా.

సీరియల్‌లో హీరోనే ప్రేమించా...
'తరంగాలు'లో అక్కా, నేనూ కలిసి నటించాం. అందులో ఇద్దరివీ అక్కాచెలెళ్ల పాత్రలే. దానిలో ఇద్దరం ఒకే అబ్బాయిని ప్రేమిస్తాం. కానీ అతడు అక్కను ప్రేమిస్తే చివరకు నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ సమయంలో చాలామంది ఫోన్లు చేసి 'ఎందుకు అక్క జీవితంలోకి వెళుతున్నావు... వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిసి కూడా, వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తావా...' అంటూ ప్రశ్నించే వారు. వాళ్లకి అది సీరియల్‌ అనీ, మేం కేవలం ఆ పాత్రల్లో నటిస్తున్నామనీ నచ్చజెప్పేప్పటికి పట్టపగలే చుక్కలు కనిపించేవి. చిత్రం ఏంటంటే, ఆ సీరియల్‌లో హీరోగా నటించిన ధనుష్‌, నేనూ నిజ జీవితంలో ప్రేమించుకున్నాం. మా ప్రేమను ఇద్దరి ఇళ్లల్లోనూ ఒప్పుకోవడంతో పెళ్లి నిర్ణయమూ జరిగిపోయింది. వచ్చే శ్రావణ మాసంలో మా పెళ్లి ఉండొచ్చు.
జీవిత విశేషాలు (profile) :

నటించిన సినిమాలు (filmography ):



====================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala