Kavya(Little Soldier-Banni)- కావ్య (లిటిల్‌ సోల్జర్స్‌ - బన్నీ)

  •  



పరిచయం (Introduction) :
  • 'ఐ యామ్‌ ఎ వెరీ గుడ్‌ గాళ్‌' అని పాడుతూ లిటిల్‌సోల్జర్స్‌లో అన్ని అల్లరి పనులే చేసిన బన్నీని నేనే. ఇప్పుడు అలా అల్లరి చేయకుండా బుద్ధిగా మణిపాల్‌లో ఎంబీబీఎస్‌ చివరి ఏడాది చదువుకుంటున్నా. దీని తరువాత ఎమ్మెస్‌ కూడా చేస్తా. మాది హైదరాబాదే. అమ్మానాన్నలిద్దరూ వైద్యులే. వాళ్లని చూసి నేను కూడా పెద్ద డాక్టర్‌ కావాలని నిర్ణయించుకున్నా. అందుకే మళ్లీ సినిమాల జోలికి పోలేదు. 'లిటిల్‌సోల్జర్స్‌' లో చేయడానికి ముందు అమ్మానాన్నలతో కలిసి యూకేలో ఉండేదాన్ని. నటించడం కోసం ఆరు నెలలు ఇండియా వచ్చి, షూటింగ్‌ అయిపోగానే మళ్లీ యూకేకి వెళ్లిపోయా. అందుకే మీకెవ్వరికీ మళ్లీ కనిపించలేదు. అక్కడే మూడోతరగతి వరకు చదువుకున్నా. తరవాత మా కుటుంబమంతా హైదరాబాద్‌కి వచ్చేసింది. 'లిటిల్‌సోల్జర్స్‌' చేస్తున్నప్పుడు నాకు మూడేళ్లే. అప్పుడు అది నటన అని కూడా తెలియని వయసు. ఆ సినిమాని తీసింది మా పెదనాన్న గుణ్ణం గంగరాజే కాబట్టి నాకు ఏమీ కొత్తగా అనిపించలేదు. వాళ్లు నవ్వమంటే నవ్వేదాన్ని, ఏడ్వమంటే ఏడ్చేదాన్ని. నేను ఎప్పుడు నటిస్తే అప్పుడే సినిమా తీసేవాళ్లు, నేను చేయకపోతే ఆ రోజు షూటింగ్‌ రద్దయ్యేది. ఆ సినిమాకి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు కూడా వచ్చింది. అయితే ఆ వయసులో దాని విలువ తెలియలేదు.

అప్పటి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నా. లిటిల్‌సోల్జర్స్‌ తరవాత యూకే వెళ్లిపోయాను. ఆ తరవాతెప్పుడూ సినిమాలలో నటించాలని అనిపించలేదు. అలా అని సినిమాలు చూడనని కాదు, బాగున్నవన్నీ చూస్తా. మణిపాల్‌లో పెద్దగా తెలుగు సినిమాలు విడదలవ్వవు కనుక హైదరాబాద్‌ వచ్చినప్పుడే చూడాలి. అప్పుడప్పుడు నా సినిమాని పెట్టుకుని చూస్తుంటా. నేనేనా అంత ఫన్నీగా నటించింది అనిపిస్తుంది. హీరోల్లో సిద్ధార్థ , మహేష్‌బాబు చాలా నచ్చుతారు, అదే నాయికలైతే జెనీలియా బాగుంటుంది. నటన ఆసక్తి లేకపోయినా శాస్త్రీయకళలంటే మాత్రం ఇష్టం. అందుకే ఓ మూడేళ్లు భరతనాట్యం నేర్చుకున్నా, అలాగే పియానోలో కూడా శిక్షణ తీసుకున్నా

.జీవిత విశేషాలు (profile) :

నటించిన సినిమాలు (filmography ):

  • ========================================
 visiti my website >
Dr.Seshagirirao-MBBS.

Comments

  1. ఒక సారెప్పుడో టీ.వీలో వచ్చిందండీ ఈ అమ్మాయి గురించి. మళ్ళీ ఇదే చదవడం. నాకూ, నా చెల్లెలికి ఎంతో ఇష్టమైన సినిమా ఇది.. !! నెసర్లు.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala