Amy Louise Jackson(actress)-అమీ లూయీ జాక్సన్(నటి)

  •  
-
  •  
పరిచయం (Introduction) : 
  •  రామ్‌చరణ్,శృతిహాసన్,అమీ జాక్సన్ ప్రధాన పాత్రధారులుగా  వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘ఎవడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది .. అమీ జాక్ సన్‌. దక్షిణ బారత భాషా సినీపరిశ్రమలోను , హిందీ సిన్మాలలోనూ నటించారు . 2009 లో ''మిస్ టీన్‌ వరల్డ్ '' టైటిల్ గెలుచుకున్నారు.
  •   అమీ లూయీ జాక్సన్‌... ఇంగ్లండ్‌ అమ్మాయి అయినా తెలుగు సినిమాల్లో చక్కగా ఒదిగిపోతోంది. 'ఎవడు'లో రామ్‌చరణ్‌ పక్కన తళుక్కుమంది. ఇప్పుడు శంకర్‌ సినిమా 'మనోహరుడు'లో విక్రమ్‌తో జతకట్టింది. బాలీవుడ్‌, తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. 
కెరీర్ : 

  • భారతీయ సినిమాలతో ఒకప్పుడు అమీకి ఏమాత్రం పరిచయం లేదు. బ్రిటన్‌లో మోడల్‌గా ఉన్నప్పుడు ఓ వెబ్‌సైట్‌లో తమిళ నిర్మాతలు ఆమె ఫొటోను చూశారు. 'మదరాస పట్టణం' అనే సినిమా కోసం ఎంపిక చేశారు. అలా మొదటిసారి నేరుగా హీరోయిన్‌గా భారత దేశంలో అడుగుపెట్టింది. ఆ సినిమా కథ కూడా హీరోయిన్‌ చుట్టూనే తిరుగుతుంది. అది హిట్టవడంతో వరసగా అవకాశాలు రావడం మొదలైంది. తెలుగులో '1947- ఎ లవ్‌ స్టోరీ' పేరుతో అది విడుదలైంది.

* అమీ మొదటి నుంచీ బ్యూటీ క్వీనే. 'మిస్‌టీన్‌ వరల్డ్‌', 'మిస్‌టీన్‌ లివర్‌పూల్‌', 'మిస్‌టీన్‌ గ్రేట్‌ బ్రిటన్‌'... ఇలా సుమారు ఇరవై ప్రముఖ అందాల పోటీల్లో విజేతగా నిలిచింది. వాటిద్వారా వచ్చిన మోడలింగ్‌ కాంట్రాక్టులతో అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది. ఇంగ్లిష్‌ సాహిత్యం, ఫిలాసఫీలో డిగ్రీ పూర్తిచేసింది.
* 'ఏ మాయ చేశావే' రిమేక్‌లో హీరోయిన్‌గా అమీ బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఆ ఏటి ఉత్తమ తొలిచిత్ర కథనాయికల టాప్‌ టెన్‌ జాబితాతో పాటూ 'మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌' జాబితాలోనూ చోటు దక్కించుకుంది. ఆ తరవాత విడుదలైన విక్రమ్‌, జగపతిబాబుల 'శివతాండవం' చిత్రం ద్వారా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుకు నామినేట్‌ అయింది.


  • * నటనంటే అమీకి ఎప్పుడూ ఆసక్తి లేదు. అందుకే మొదటి అవకాశం వచ్చినప్పుడు వెంటనే ఓకే చెప్పలేదు. సినిమా దర్శకుడు లండన్‌ వెళ్లి పట్టుబట్టి ఆమెను ఒప్పించాడు. 'నేనెప్పుడూ నటించలేదు. భారత్‌ చూసే అవకాశం మళ్లీ రాకపోవచ్చు. అందుకే వస్తాను. బాగా నటించలేకపోతే నన్నేమీ అనకూడదూ' అని షరతు పెట్టింది. కానీ షూటింగ్‌ మొదలయ్యాక డైలాగులను సొంతంగా సాధన చేయడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆమెకొచ్చిన డాన్స్‌ ఇక్కడి సినిమాలకు సరిపోదని ఓ మాస్టర్‌ దగ్గర రోజూ డాన్స్‌ పాఠాలూ నేర్చుకుంటోంది.



జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : అమీ జాక్ సన్‌ ,
  • పుట్టిన తేది : 31 January 1991,
  • పుట్టిన ఊరు :Isle of Man- యు.కె ,
  • తండ్రి : Alan Jackson (BBC Radio Merseyside's producer),
  • తల్లి : Marguerita Jackson ,
  • తోబుట్టువులు : elder sister, Alicia Jackson. 
  • చదువు : డిగ్రీ -- English Language, English Literature and Philosophy and Ethics,
  • నచ్చే నటులు: కరీనా కపూర్‌, ఐశ్వర్యారాయ్‌, విక్రమ్‌
  • ఇష్టపడే దుస్తులు: చీరలు, జీన్స్‌, టీషర్ట్‌
  • నోరూరించే ఆహారం: హైదరాబాదీ బిర్యానీ, చైనీస్‌ వంటకాలన్నీ
  • ఫిట్‌నెస్‌ కోసం: ప్రతిరోజూ యోగా, ఏరోబిక్స్‌, నృత్య సాధన
  • ఇష్టమైన వ్యాపకం: జంతువులతో ఆడుకోవడం. ఈమధ్యే ఓ డాల్ఫిన్‌ను దత్తత తీసుకుంది.
  • కోరిక: మంచి భారతీయ నటిగా గుర్తింపు పొందడం

మొదటి సినిమాలు :
నటించిన సినిమాలు (filmography ): 

 తమిళ్ :
  • Madrasapattinam-2010 ,
  •     Thaandavam --2012 ,
  •     I (ఐ)--2014 Filming,
హిందీ :
  • Ekk Deewana Tha--2012,
తెలుగు :
  • ఎవడు --2013 ,

  • ==================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)