Sankaramanchi Janaki-షావుకారు జానకి

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  షావుకారు జానకిగా ప్రసిద్ధిచెందిన శంకరమంచి జానకి , అలనాటి తెలుగు సినీ కథానాయిక.ఈమె 385 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోను, 3 హిందీ సినిమాలలోను, 1 మళయాళం సినిమాలోను నటించింది. అనేక రంగస్థల నాటకాలలో కూడా నటించింది. తన 11వయేటనే రేడియోలో ఒక తెలుగు కార్యక్రమంలో పాల్గొంది. ఈమె మొట్టమొదటి చిత్రం షావుకారు ఈమె ఇంటి పేరైపోయింది. ప్రముఖ తెలుగు కథానాయకి కృష్ణకుమారి ఈమెకు స్వయానా చెల్లెలు. జాతీయ ఫిల్మ్ అవార్డులకు, తెలుగు సినిమా అవార్డులకు కమిటీలో జ్యూరీ సభ్యురాలిగా పని చేసింది. ఈమె సత్యసాయిబాబా భక్తురాలు.


    విజయా ప్రొడక్షన్స్ వారి షావుకారు (1950) ఈమె మొదటి సినిమా. ( 1949లో "రక్షరేఖ" అనే సినిమాలో "చంద్రిక"గా నటించిందని ఉంది ) తరువాత ఆమె "షావుకారు జానకి"గా ప్రసిద్ధురాలయ్యింది. అప్పటి అందరు ప్రముఖ నాయకుల సరసన నటించింది. అనేక పురస్కారాలు పొందింది. తెలుగులో ఈమె సినిమాలలో ప్రసిద్ధమైనవి కొన్ని - షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి.
  • సాధారణంగా పెళ్లి కాని అమ్మాయిలే నాయిక పాత్రలకి వస్తూ ఉంటారు. పెళ్లయ్యాక వచ్చినవాళ్లు ఉంటే, ఉండొచ్చు. కాని, పిల్లల తల్లులు నాయిక పాత్రలకి ఎన్నిక కావడం విశేషంగానే చెప్పుకోవచ్చు. 'షావుకారు' జానకి 'షావుకారు'లో నటించడానికి వచ్చినప్పుడు ఆమె మూడు మాసాల చిన్నారికి తల్లి. (ఆ పాప పేరు... యజ్ఞప్రభ) 
జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : జానకి సావుకారి ,
  • అసలు పేరు : శంకరమంచి జానకి
  • పుట్టిన తేది : 12 డిసెంబర్ 1932,
  • పుట్టిన ఊరు :  పశ్చిమ బెంగాల్,
  • చదువు : ఈమె అస్సాం గౌహతిలో మెట్రిక్యులేషన్ వరకు చదివింది. అరిజోనా విశ్వవిద్యాయంలో గౌరవ డాక్టరేట్ పొందింది.
  • తండ్రి : టి. వెంకోజీరావు పేపర్ పరిశ్రమలో నిపుణుడు,
  • తల్లి పేరు : శచీదేవి.
  •  అభిమాన నటులు : శివాజీ గణేషన్‌, సావిత్రి ,
  • భర్త :  Sankamaranchi Srinivasa Rao (marriage in 1947),
  • పిల్లలు : ఇద్దరు కుమార్తెలు , ఒక కుమారుడు ,
 నటించిన సినిమాలు (filmography ): 
  •  హే రామ్ (2000) (షావుకారు జానకిగా) .
  •     శబ్దవేది (2000)
  •     దేవి (1999)
  •     శుభాకాంక్షలు (1998)
  •     మేడమ్ (1993)
  •     గీతాంజలి (1989)
  •     స్వరకల్పన (1989)
  •     మురళీ కృష్ణుడు (1988)
  •     సంసారం ఒక చదరంగం (1987)
  •     గోపాలరావు గారి అమ్మాయి (1980)
  •     తాయారమ్మ బంగారయ్య (1979)
  •    
  •     రంగూన్ రౌడీ (1979)
  •     సమాజానికి సవాల్ (1979)
  •     రామరాజ్యంలో రక్తపాతం (1976)
  •     అక్కా చెల్లెలు (1970)
  •     భామావిజయం (1967)
  •     మంచి కుటుంబం (1965)
  •     డాక్టర్ చక్రవర్తి (1964)
  •     సవతి కొడుకు (1963)
  •     పెంపుడు కూతురు (1963)
  •     పెంచిన ప్రేమ (1963)
  •    
  •     మంచి మనసులు (1962)
  •     బాటసారి (1961)
  •     శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960) .... (ఎరుకల సానిగా)
  •     రేచుక్క పగటిచుక్క (1959)
  •     ముందడుగు (1958)
  •     ఆలుమగలు (1957)
  •     భాగ్యరేఖ (1957)
  •     భలేబావ (1957)
  •     పాండురంగ మహాత్మ్యం (1957)
  •     చరణదాసి (1956)
  •    
  •     ఏది నిజం (1956)
  •     జయం మనదే (1956)
  •     నాగుల చవితి (1956)
  •     కన్యాశుల్కం (1955) .... (బుచ్చమ్మ)
  •     రోజులు మారాయి (1955)
  •     వద్దంటే డబ్బు (1954)
  •     కన్యాదానం (1954)
  •     పిచ్చి పుల్లయ్య (1953) .... Vasantha
  •     షావుకారు (1950)
  •     రక్షరేఖ (1949) .... Chandrika
  • ================================ 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala