Malathi(old) , మాలతి(పాత తరం )

  •  

-


  •  
పరిచయం (Introduction) : 

వాహిని సంస్థ తమ రెండో చిత్రంగా 'సుమంగళి' (1940) తీసింది. బి.ఎన్‌.రెడ్డి దర్శకుడు. కె. రామనాథ్‌ ఛాయాగ్రహకుడు. ఈ సినిమాలోనే మాలతి 'వస్తాడే మా బావ' పాట పాడుతుంది. ఈ పాట చాలా ప్రసిద్ధి పొందింది. మాలతి సొంతంగా పాడింది. గ్రామఫోన్‌ రికార్డులో కూడా ఆమెదే కంఠం. ఈ పాటలని, చిత్రంలో ఆమె మేడ మెట్ల మీద నిలబడి, కొంత పాడి మెట్లు దిగుతూ పాడుతుంది. మేడపైన నిలబడి పాడుతున్నప్పుడు, నేల మీద వున్న కెమెరాకి ఆమె అందదు. ఈ రోజుల్లో వున్నట్లు అప్పుడు క్రేన్‌లు లేవు. అది వేసిన సెట్టు. 20, 25 అడుగుల ఎత్తులో మేడ మెట్ల పైభాగం వుంటుంది. అక్కడ ఆమెకి క్లోజ్‌ షాటు తియ్యాలి. ఆ ఎత్తుకి సరిపడా, నాలుగైదు టేబుళ్ళు ఒక దాని మీద ఒకటి పేర్చి, దాని మీద స్టూలు, మళ్లీ చిన్నాపెద్దా టేబుళ్ళూ నిలబెట్టి, దానిపైన రామ్‌నాథ్‌ ఆపైకి ఎక్కి షాటు తీశారు! ఈ షాటు తీస్తున్న 'వర్కింగ్‌ స్టిల్‌' ఆనాడు తెలుగు సినిమా పత్రికలో అచ్చయితే, చూసిన జ్ఞాపకం బాగా వుంది. ''అసలా టేబుళ్ళు కదలకుండా ఎలా వున్నాయి? అంతపైకి ఎలా ఎక్కగలిగారు?'' అన్న ప్రశ్న నాలాంటివాళ్లకి కలిగింది. ఇంకో విషయం! 'వస్తాడే మా బావ' పాట ప్రసిద్ధిని పురస్కరించుకుని- ఆ పేరుతో 1977లో సినిమా వచ్చింది. రోజారమణి, మురళీమోహన్‌ నాయికా నాయకులు

Source : Pathabangaram/Ravi kondararao@Eenadu cinema news

  • ============================

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments




  1. ఆ ఫొటో మాత్రం మాలతిది కాదు.హీరోయిన్ కుమారిది.మాలతి సెకండ్ హీరోయిన్ .పాట గురించి రాసినది కరెక్టే.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala