Saturday, October 15, 2011

జాలాది రాజారావు , Jaladi Raja rao

 • image : courtesy - Wikipedia.org
పరిచయం (Introduction) :
 • జాలాది గా ప్రసిద్ధులైన జాలాది రాజారావు (Jaladi Raja Rao) ప్రముఖ తెలుగు రచయిత. వీరు 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించారు.జానపదాల జాలాది గేయకవి వీరఘట్టంలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా విధులు .. జానపదాల జావళి, పల్లె పదాల పాటగాడు సినీగేయ రచయిత జాలాది రాజారావుకు సిక్కోలుతో ఉన్న బంధం విడదీయలేనిది. సినీకవిగా ప్రపంచానికి పరిచయం అయ్యే ముందు ఆయన చిత్రలేఖన ఉపాధ్యాయుడిలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశారు. ఆ తర్వాత వివిధ సందర్భాల్లో ఆయన జిల్లాను సందర్శించారు.
జీవిత విశేషాలు (profile) :
 • జన్మనామం : జాలాది రాజారావు,
 • జననం : ఆగస్టు 09, 1932,
 • మరణం :14-అక్టోబర్ -2011 (విశాఖపట్నం లోని తన స్వగృహంలో అస్వస్థతతో మరణించారు-వయసు:79),
 • సంగీత రీతి : రచయిత,
 • వృత్తి : గీత రచయిత,
 • వాయిద్యం : రచయిత, కవి,
సినిమాలు (filmography ): సినిమా పాటలు(cine songs) కొన్ని --
 • * పల్లెసీమ (1977) - సూరట్టుకు జారతాదీ సిటుక్కు సిటుక్కు వానచుక్కా,
 • * దేవుడే గెలిచాడు - ఈ కాలం పది కాలాలు బతకాలనీ,
 • * ప్రాణం ఖరీదు (1978) - యాతమేసి తోడినా ఏరు ఎండదు .. పొగిలి పొగిలి ఏడ్చినా ముంత నిండదు.
 • * సీతామాలక్ష్మి (1978) -సీతాలు సింగారం ... మాలచ్చి బంగారం -(ఉత్తమ పాట పురస్కారం),
 • * కోతల రాయుడు (1979),
 • * పునాదిరాళ్ళు (1979),
 • * మా ఊరి దేవత (1979),
 • * తూర్పు వెళ్ళే రైలు (1979) - సందపొద్దు అందాలున్నా చిన్నదీ,
 • * అత్తగారి పెత్తనం (1981),
 • * బిల్లా రంగా (1982),
 • * మేజర్ చంద్రకాంత్ (1993)- పుణ్యభూమి నా దేశం నమో నమామి,
శ్రీకాకుళం జిల్లాలో అనుబంధము : కృష్ణా జిల్లా గుడివాడ స్వస్థలం అయినా జాలాది రాజారావు 1968లో వీరఘట్టం స్థానిక జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇక్కడే ప్రధాన వీధిలో ఓ చిన్న గదిని అద్దెకు తీసుకొని ఒంటరిగా నివాసం ఉండేవారు. స్థానిక ప్రైవేట్‌ వైద్యులు నల్లాన సాంబశివరావు అధ్యక్షతన ఏర్పాటయిన ఆంధ్రా అభ్యుదయ నాట్యమండలిలో సభ్యుడిగా ఉండేవారని అప్పట్లో ఆయన సహోద్యోగులు గుర్తుచేసుకున్నారు. మాయలమరాఠీ నాటకంలో మాయల ఫకీర్‌ పాత్రను పోషించి రక్తి కట్టించేవారని చెప్పారు. వీరఘట్టం ఒట్టిగెడ్డ ఇసుక దిబ్బపై కూర్చొని గెడ్డలో తిరుగుడు గుమ్మిని చూసి ఈయన 'గుడ గుడ గుమ్మి నీరు తిరుగుతుందని' పాడినపాట అప్పట్లో అబ్బురపర్చేవని, వీరఘట్టం దుర్గాదేవిని ఉద్దేశించి ఆయన రాసి పాడిన 'దుర్గమ్మ నీవే దిక్కమ్మ.. కరవాలం కదిలించి త్రిశూలంతో ఎదిరించి నరరూపరాక్షసులను సంహరించి రావమ్మా' పాట ఇంకా తమ మదిలో మిగిలిందని ఆయన సహచరులు వివరించారు. పల్లె ప్రజలు, పంటపొలాలు గట్లపై అనేక పాటలు రచించి స్వీయ స్వరకల్పన చేశారు. పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనంపై ప్రత్యేక తర్ఫీదునిస్తూ తీరిక వేళల్లో తన గదిలోనే కొంతమంది శిష్యులకు రచనలు, కవితలు నేర్పించేవారని చెప్పారు. చిత్రరంగానికి ఎదిగిన ఈయన
 • 'తూర్పుకు వెళ్లే రైలు' చిత్రంలో 'చుట్టూ చెంగాలి చీర కట్టేవే చిలకమ్మ',
 • ప్రాణం ఖరీదు చిత్రంలో 'పలుపుతాడు ముడివేస్తే పాడి ఆవురా.. పసుపుతాడు ముడివేస్తే ఆడదాయిరా',
 • మేజర్‌ చంద్రకాంత్‌ చిత్రంలో 'పుణ్యభూమి నాదేశం నమోనమామి'
తదితర పాటలు ఏనాటికి మరువలేనివని స్థానికులు తెలిపారు. స్థానికుడు కాకపోయినప్పటికి కళాకారుడిగా ఇక్కడి నుంచి ప్రస్తావన ప్రారంభించిన ఈయన మరణ వార్త తెలియడంతో పరిచయస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈయనకు ప్రియశిష్యుడైన గడగమ్మ చిన్నంనాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడ్డాడు. జాలాది మరణవార్త తెలిసిన ఆయన శుక్రవారం జానపదాల జాలారి ఇక లేరంటూ వీరఘట్టం చైతన్య ఫొటోస్టుడియోకు ఒక లేఖ పంపారు. 2003లో శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూచిపూడి నాట్యం ప్రదర్శించిన శ్రీకాంత్‌ శిష్యబృందం డయానా వంటి చిన్నారులను సత్కరించారు. ఈసందర్భంగా శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య పన్నాల నరసింహమూర్తి, ఎల్‌.రామలింగస్వామి, ఆర్‌.డి.వి.ప్రసాద్‌లు జాలాది మృతికి సంతాపం తెలిపారు. మంత్రి ప్రగడ నరసింగరావు సంతాపాన్ని ప్రకటిస్తూ జానపదం ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించిన గేయరచయత జాలాది అన్నారు. 'పొగిలి పొగిలి ఏడ్చినా' వంటి గీతాల్లో తెలుగు నుడికారాలు, మాండలికాలు ప్రయోగించారని తెలిపారు. 1962లో జరిగిన చిత్రలేఖల పోటీలకు అప్పట్లో ఆయన విద్యార్థులను జిల్లాకేంద్రానికి తీసుకువచ్చారని కథానిలయానికి చెందిన డా. బి.వి.ఎ.రామారావు నాయుడు గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. మంచి మిత్రుని కోల్పోయాం-నాతోపాటు జాలాది స్థానిక ఉన్నతపాఠశాలలోఉపాధ్యాయుడిగా పని చేశారు. మంచి మిత్రులుగా కలిసి తిరిగాం. ఆయన రచనలు, కవితలు ఎంతోమందిని ఆకట్టుకునేవి. పాఠశాలలో మంచి ఉపాధ్యాయుడిగా గుర్తింపు పొందారు. అంత సన్నిహితంగా ఉన్న మిత్రుడు చిత్రరంగంలోకి అడుగుపెట్టడంతో మురిసిపోయాను. మృతిచెందాడని టీవీలో చూసి నిర్ఘాంతపోయాను.---గడగమ్మ సూర్యనారాయణ, వీరఘట్టం. ఎత్తిపొడుచుకొనేవాళ్లం--జాలాది డ్రాయింగ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు నేను సెకండరీగ్రేడ్‌ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఇద్దరికీ కవితలు, రచనలపై ఆసక్తి ఉండేది. వాటి దోషాలపై పరస్పరం విమర్శించుకునే వాళ్లం. జాలాది అనుకున్నది సాధించే వ్యక్తి. ఆ దీక్షతోనే గొప్ప వ్యక్తిగా పేరు సంపాదించుకున్నాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను.
 • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog