భాస్కర్ బొమ్మరిల్లు , Bhaskar Bommarillu



పరిచయం (Introduction) :
  • భాస్కర్ తమిళ భాషా వాది అయినా తెలుగులో సినిమాలు చేసారు.  బొమ్మరిల్లు తెలుగు సినిమ దర్శకుడు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : భాస్కర్ బొమ్మరిల్లు
  • పుట్టిన తేదీ : 29-అక్టోబర్ 1976, 
  • నాన్న : నటరాజన్--ఉపాధ్యాయుదు ,
  • సొంత ఊరు : వెల్లూరు (తమిళనాడు),
  • తోబుట్టువులు : అక్క , అన్నయ్య ,
  • చదువు : డిగ్రీ  తరువాత సినీమా టెక్నాలజీ లో డిప్లమొ కోర్సు ,

పెళ్ళి :

కొన్నాళ్లు దర్శకుడు సుకుమార్‌ దగ్గర పనిచేశాను. ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నప్పుడే ఓ కథ తయారు చేసుకున్నాను. దాన్నే ఓసారి దిల్‌రాజుగారికి వినిపిస్తే బాగుంది అన్నారు. అదే 'బొమ్మరిల్లు'. ఆ సినిమాని నాన్నకు చిత్తూరులో చూపించాను. ఆయనకి భాష అర్థం కాదు. కానీ, సినిమా అంతా అయ్యాక... 'చాలా బాగా తీశావురా' అన్నారు. ఆపై ఆయన నాకు పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. అప్పటికే నేనొక అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టాను. సరైన సమయం చూసి ఈ సంగతి నాన్నతో చెప్పొచ్చులే అనుకుంటున్నాను. ఓసారి ఆయన నా జాతకం పట్టుకుని కూర్చున్నారు. ఏంటా అని అడిగితే... 'నీకు ఈ వారం పదిరోజుల్లో పెళ్లి కాకపోతే... జాతక ప్రకారం చాలా ఆలస్యమైపోతుంది' అన్నారు. అయితే అయింది, తొందరేముందిలే అన్నాను. ఆ మర్నాడే... నా పెళ్లి ఫిక్స్‌ చేసేశారు! 'ఓ వారంలో నీకు పెళ్లి' అనేశారు. ఆ క్షణం ఎలా స్పందించాలో తెలీలేదు. నా ప్రేమ సంగతి చెప్పడం ఆలస్యం చేశానే అనిపించింది. వెంటనే నాన్నకి ఫోన్‌ చేసి 'నాన్నా... ఈ విషయం మీకు ముందే చెబుదాం అనుకున్నాను. కానీ, కుదర్లేదు. నేనొక అమ్మాయిని ప్రేమించాను. అరసవల్లిలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మీరంతా బయలుదేరి వచ్చేయండి' అని చెప్పాను. వాళ్లకీ ఇది షాకే కదా.

'వాడు సరైన నిర్ణయమే తీసుకుని ఉంటాడు...'
  • ఇంట్లో వాళ్లతో ఇదే మాటన్నారట నాన్న! వాళ్లూ పెళ్లికి వచ్చారు. అలా నా వివాహం అరసవల్లిలో జరిగింది. నా భార్య పేరు గౌరీశ్రీవిద్య. ఆమెది విజయనగరం. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయమైంది. మాకో అమ్మాయి. పేరు... హాసిని. ప్రస్తుతం జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఇక, కెరీర్‌ మీకు తెలిసిందే. 
సినిమాలు (filmography ):
  • బొమ్మరిల్లు (2006),
  •  పరుగు (2008),
  • ఆరెంజ్ (2010) ,
  • ఒంగోలు గిత్త  (2012).
==============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala