Thursday, April 7, 2011

సుజాత , Sujatha

పరిచయం (Introduction) :
 • ఈమె మలయాలళీ నటి . "పోలీస్ స్టేషన్‌" అనే మలయాళ నాటకం తో వేదికపైకి వచ్చారు . తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సుమారు మూడొందల చిత్రాల్లో నటించారు. శివాజీగణేశన్‌, రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు లాంటి అగ్రతారల చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్నన పొందారు. త్యాగశీలి పాత్రలకు సుజాత పెట్టింది పేరు. తెలుగులో 'వెంగమాంబ' ఆమె చివరి చిత్రం. 'పెళ్లి' చిత్రంలో నటనకు గానూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సహాయక నటిగా నంది అవార్డుతో సత్కరించింది. ఒద్దిక, అణకువ, సుకుమారం, లాలిత్యం, బిడియం, అపురూపం వంటి సున్నితమైన, స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన భావాలకు ప్రతిరూపంగా సుజాతగారిని చెప్పొచ్చు. అసలు ఆమెలో ప్రత్యేకత ఏమిటంటే...సున్నితభావాలతోబాటు ఆత్మాభిమానం, గాంభీర్యం, హుందాతనం పరిణతి, స్పష్టత, మానసికధృడత్వం, ఖచ్చితత్వం(ఎసర్టివ్ నెస్) వంటి భావాలను కూడా ఆమె బ్రహ్మాండంగా పలికించేవారు. మిరుమిట్లుగొలిపే అందం కాకపోయినా స్ఫురద్రూపం. మంచి ఎత్తు, చక్కటి కనుముక్కుతీరు. మాతృభాష మళయాళం కాగా, తెలుగులోనే డైలాగులు చెప్పడంకోసం మన భాషను కూడా నేర్చుకున్నారు. మొదట్లో చౌకబారు(మళయాళీ) సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత, తర్వాత తనకు తాను ఒక ఇమేజ్ ఏర్పరుచుకుని దానికే కట్టుబడిఉండటం గొప్పవిషయం
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : సుజాత ,
 • పుట్టిన తేది : 10-డిసెంబర్ -1952,
 • పుట్టిన ఊరు : శ్రీలంక లో పుట్తి పెరిగింది ,
 • సొంత ఊరు : కేరళ లోని మరదు గ్రామము ,
 • పిల్లలు : ఒక కుమారుడు , ఒక కుమార్తె ,
 • నివాసము : చెన్నై ,
 • మరణము : 06-ఏప్రిల్ 2011--గుండె జబ్బు తో మరణించారు .,
కెరీర్ :
 • సుజాత పుట్టి పెరిగింది శ్రీలంకలో. సొంతూరు మాత్రం కేరళలోని మరదు గ్రామం. తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడ్డారు. ఆయన పదవీ విరమణ చేయడంతో మళ్లీ కేరళ వచ్చేశారు. ఆ తరువాత సుజాత చదువు అట్టేకాలం సాగలేదు. 'సినిమా మాసియా' అనే మలయాళ పత్రికలో సుజాత ఫొటో ప్రచురితమైంది. అది చూసి 'నాటకాల్లోకి వస్తావా?' అంటూ చాలామంది అడిగారు. సుజాత అన్నయ్యకూ నాటక రంగం అంటే అభిమానం ఎక్కువే. అన్నయ్య కూడా నచ్చజెప్పడంతో నాటకాల్లో నటించేందుకు ఒప్పుకొంది. పద్నాలుగేళ్ల వయసులోనే 'తబస్విని' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అది మొదలు 'తబస్విని'తో సుజాత ప్రతిభ అందరికీ తెలిసింది. వరుసగా సినిమా అవకాశాలు చుట్టుముట్టాయి. ఏడేళ్ల వ్యవధిలో 40 చిత్రాలు చేసి... తిరుగులేని నాయికగా ఎదిగింది. బాలచందర్‌ దర్శకత్వం వహించిన 'అవళ్‌ ఒరు తొడర్‌ కథై' (తెలుగులో అంతులేనికథ పేరుతో తీశారు)తో నటిగా వెలిగిపోయింది. సుజాతది ప్రేమ వివాహం. తమ ఇంటి యజమాని వాళ్లబ్బాయి జయకర్‌ హెన్రీని ప్రేమించింది. పెద్దలు ఒప్పుకోకపోయినా ఎదిరించి పెళ్లిచేసుకొంది. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయింది. అయితే అక్కడి సంప్రదాయాలు సుజాతకు నచ్చలేదు. కాన్పు కోసం ఇండియాకి వచ్చి... మళ్లీ వెళ్లలేదు.
నటించిన సినిమాలు (filmography ): నట్టించిన తెలుగు సినిమాలు ->
 • గోరింటాకు ,
 • ఏడంతస్తుల మేడ ,
 • పసుపు పారాణి ,
 • సుజాత ,
 • సర్కస్ రాముడు ,
 • సంధ్య ,
 • బహుదూరపు బాటసారి ,
 • వంశ గౌరవం ,
 • సూత్రధారులు ,
 • సీతాదేవి --వికలాంగురాలిగా,
 • చంటి -- లో అమ్మగా ,
 • పెళ్ళి -- సినిమాలో కోడలిగా,
 • శ్రీరామదాసు చిత్రం లో దమ్మక్క గా ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog