Friday, April 8, 2011

నాగేంద్రరావు రట్టహల్లి, Nagendra rao.R

 • ఫొటొ : ఈనాడు సినిమా దినపత్రిక సౌజన్యము తో .
పరిచయం (Introduction) :
 • నాగేంద్రరావు కన్నడ నటుడు. ఐతే ఏం?- తమిళం, తెలుగు కూడా బాగా వచ్చు. 1940లో సుందరరావు నడకర్ణి దర్శకత్వంలో 'భూకైలాస్‌' చిత్రం వచ్చింది. నటీనటులందరూ కన్నడంవారే. రెండు భాషల్లోనూ వారే మాట్లాడారు. అందులో ఆర్‌. నాగేంద్రరావు నారదుడిగా నటించారు. సుబ్బయ్య నాయుడు రావణుడు, లక్ష్మీబాయి మండోదరి. ఈ సినిమా రెండు భాషల్లోనూ బాగా నడిచింది. ఆర్‌.నాగేంద్రరావు తెలుగువారికి ఈ సినిమాలోనే ముందుగా కనిపించారు. 'అపూర్వ సహోదరగళ్‌' చిత్రానికి సంభాషణలు నాగేంద్రరావే రాశారు. తెలుగులో బలిజేపల్లి లక్ష్మీకాంతం రాశారు. 'అపూర్వ సహోదరులు'లో తమిళ నటులందరికీ - హీరో రాధాతో సహా - గాత్రాలు మార్చారు గాని, నాగేంద్రరావు గారిది సొంతమే. ఎంతో సహజంగా, అద్భుతంగా నటించాడాయన ఆ పాత్రలో. ఆర్‌.నాగేంద్రరావు- నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, దర్శకుడు, రచయిత, నిర్మాతా- అన్నీ. అన్ని శాఖల్లోనూ ఆయన ప్రజ్ఞావంతుడే.
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : రట్టిహల్లి ,నాగేంద్రరావు .,(name =Rattihalli , Sirname =nagendrarao),
 • పుట్టిన తేదీ : 23-జూన్‌-1896,
 • మరణము : x-x-1977,
 • పుట్తిన ఊరు : (హొలల్‌కెరె)Holalkere, karnataka State.,
 • మాత్రు భాష : కన్నడ ,
 • పిల్లలు :ముగ్గురు -> 1.ఆర్.ఎన్‌.కృష్ణప్రసాద్-చాయాగ్రాహకుడు . , 2.ఆర్.ఎన్‌.జయగోపాల్ -కధకుడు ,దర్శకుడు ; 3.సుందర్ సనామ్‌,
మొదటి సినిమాలు :
 • కన్నడ --సతి సులోచన (1934),
 • తెలుగు --జాతకం (1953),
కెరీర్ : (Entrance to film industry):
 • ఎందరినో రంగస్థలానికి పరిచయం చేసిన గుబ్బి వీరన్న చేతుల మీదుగానే నాగేంద్రరావు రంగస్థల ప్రవేశం జరిగింది. చిన్న వయసు నుంచే ఆయన నాటకాల్లో ప్రధాన పాత్రలు ధరించేవారు. చదువుతోపాటు, రంగస్థలానికి సంబంధించిన చదువూ చదివాడు. ఒక్క నటనతోనే ఆగిపోకుండా, రంగస్థలం మీద 'లైటింగ్‌' చెయ్యడంలో కృషి చేశారు. స్టేజ్‌ లైటింగ్‌కి సంబంధించిన పుస్తకాల్ని విదేశాల నుంచి తెప్పించి, అధ్యయనం చేసి ఎన్నో ప్రయోగాలు చేశారు. డిమ్మర్స్‌, చిన్నవీ పెద్దవీ లైట్లు ఉపయోగిస్తూ నాటకాల్ని దీపకాంతులతో రక్తి కట్టించేవారు. 'స్టేజ్‌ లైటింగ్‌: ఆర్‌.నాగేంద్రరావు' అని వెయ్యడం పెద్ద ఆకర్షణ! ఒక్క లైటింగే కాకుండా, సెట్సు, ఇతర టెక్నిక్‌లూ కూడా ఆయన సాధించారు. 'భూకైలాస్‌' మొదట నాటకం. రంగస్థలం మీద ఖ్యాతి తెచ్చుకుంది. అదే సినిమాగా రెండు భాషల్లో తీశారు. అలా, నాగేంద్రరావు చిత్రాల్లో ప్రవేశించారు. కొన్ని నాటకాలు రాయడంతో, సినిమాలకు కూడా రచనలు చేశారు. చాలా నాటకాలు డైరెక్టు చేశారు.
నటించిన సినిమాలు (filmography ):
 • Actor (23 titles)
 • 1974 ప్రొఫెసర్ హుచురాయ ,
 • 1973 మన్నిన మగలు ,
 • 1971 కులగురవ ,
 • 1971 సాక్షాత్కర ,
 • 1970 నదిన భాగ్య ,
 • 1969 మక్కలే మనేగే మాణిక్య ,
 • 1968 అత్తెగొండుకల సోసేగొండుకల ,
 • 1968 హన్నేలే చిగురిడగా -పత్రిఅర్చ్ ,
 • 1966 తూగు దీప ,
 • 1963 వీర కేసరి -ధర్మ నాయక ,
 • 1962 గల్లి గోపుర ,
 • 1960 రణధీర కన్తీరవ -దళవాయి విక్రమ రాయ ,
 • 1957 మహిరావన ,
 • 1956/I భక్త మార్కండేయ ,
 • 1956 నాగుల చవితి ,
 • 1953 జాతకం ,
 • 1953 జాతకఫలం ,
 • 1952 ముగ్గురు కొడుకులు ,
 • 1950 అపూర్వ సహోదరాలు ,
 • 1949 అపూర్వ సహోదరర్గల్ -జోరవార్ సింగ్ ,
 • 1949 నిషాన్ ,
 • 1940 భూకైలాస .
 • 1934/II సతి సులోచన ,
Director (16 titles)
 • 1970 నదిన భాగ్య ,
 • 1969 నమ్మ మక్కలు ,
 • 1967 ప్రేమక్కు పెర్మిట్టే ,
 • 1964 పతియే దైవ ,
 • 1963 ఆనంద బాష్ప ,
 • 1961 విజయనగారద వీరపుత్ర ,
 • 1957 అన్బే దైవం ,
 • 1957 ప్రేమద పుత్రి ,
 • 1957 ప్రేమే దైవం ,
 • 1953 జాతకం ,
 • 1953 జాతక ఫల ,
 • 1953 జాతకఫలం ,
 • 1952 మూన్రు పిళ్ళైగళ్ ,
 • 1952 ముగ్గురు కొడుకులు ,
 • 1947 మహాత్మా కబీర్ ,
 • 1943 సత్య హరిశ్చంద్ర ,
Producer (2 titles)
 • 1957 ప్రేమే దైవం (ప్రొడ్యూసర్ ),
 • 1953 జాతకం (ప్రొడ్యూసర్ ),
Writer (2 titles)
 • 1940 భూకైలాస (play),
 • 1934/II సతి సులోచన (play),
-Composer (1 title)
 • 1934/II సతి సులోచన ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog