Swarnalatha(Telugu singer)-స్వర్ణలత (తెలుగు గాయని)

  • Source : Eenadu cinema page --Pathabangaram by Raavi Kondalrao.
పరిచయం (Introduction) :
  • సినిమా పాటలు పాడే గాయనీ గాయకులు అన్ని రకాల, రసాల పాటలూ పాడతారు.. పాడగలరు. మధుర గాయకులు అనిపించుకున్నవారు కూడా హాస్యగీతాల్లాంటివి పాడారు. కానీ, ఒక్క స్వర్ణలతకి మాత్రం 'హాస్యగీతాల గాయని'గా ముద్రపడింది. చిన్నతనంలో ఎనిమిదేళ్లపాటు క్షుణ్ణంగా సంగీతం నేర్చుకుంది. నాట్యం కూడా అభ్యసించింది. పౌరాణిక నాటకాల్లో పద్యాలు చదువుతూ నటించింది. గాత్రకచేరీలు చేసింది. అయినా తొలిసారి సినిమా కోసం పాడిన పాట హాస్యనటుడితో పాడడం వల్ల కాబోలు అలా ముద్ర పడిందనిపిస్తుంది. ఆ సినిమా 'మాయా రంభ' (1950). ఆ పాట కస్తూరి శివరావుతో కలిసి పాడిన 'రాత్రీ పగలనక...'.
  • ఆనాటి సినిమా కథా సంప్రదాయం ప్రకారం నాయికానాయకులతోపాటు హాస్యజంటకు కూడా పాటలుండేవి. పురాణ, జానపద, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఇలాంటి పాటలు వినిపిస్తాయి. చాలా పాటలు జనాదరణ పొందాయి ఒక్కసారి స్వర్ణలత పాటలు గుర్తుకు తెచ్చుకుంటే- 'కాశీకి పోయాను రామా హరీ', 'ఓ కొంటె బావగారూ' (అప్పుచేసి పప్పుకూడు: 1959), 'అంచెలంచెలు లేని మోక్షము' (శ్రీకృష్ణార్జున యుద్ధం: 1963), 'తడికో తడికో' (అత్తా ఒకింటి కోడలే: 1958),
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : స్వర్ణలత ,
  • అసలు పేరు : మహలక్ష్మి ,
  • ఊరు : చాలగమర్రి గ్రామము --కర్నూలు జిల్లా,
  • నివాసము : మద్రాస్ ,
  • పుట్టిన తేది : 10 మార్చ్ 1928 ,
  • భర్త : డా.అవరాథ్ (1956 లో వివాహమైనది ),
  • మతం మార్పిడి : వీరు బ్రాహ్మిణులు అయినా వాళ్ళ పెద్దకూతురు - చాముండేస్వరికి నత్తి పోతుందంటే క్రిస్టియన్లు గా మారిపోయారు .
  • పిల్లలు : 6 కొడుకులు & 3 కూతుర్లు (ఒక కొడుకు సినీ నటుడు ఆనంద్‌రాజ్‌. నలుగురు కొడుకులు అమెరికాలో డాక్టర్లు. ఇంకొక కొడుకు డాన్సర్‌ నటరాజ్‌ (ఇప్పుడు అనిల్‌రాజ్‌). ఒక కూతురు అమెరికాలో డాక్టరు. ఇంకొక కూతురు స్వర్ణలత - నా పేరే పెట్టుకున్నారు'' అని ఒకసారి చెప్పారు స్వర్ణలత. కూతురు స్వర్ణలత కూడా గాయని. ('భారతీయుడు'లో 'మాయామశ్ఛీంద్రా', 'ప్రేమికుడు'లో 'ముక్కాల ముక్కాబుల'; ''కలిసుందాం రా''లో 'నచ్చావే పాలపిట్ట'; 'చూడాలని వుంది'లో 'రామ్మాచిలకమ్మా' మొదలైన పాటలు పాడింది. విడిగా ఆడియోలో క్రైస్తవ భక్తిగీతాలు పాడింది).ఈమె కూడా ఇటీవలే కన్నుమూశారు),
  • మరణము : 10 మార్చ్ 1997 లో దోపిడీ దొంగలచే హత్య చేయబడ్డారు ,
పాటలు పాడిన కొన్ని సినిమాలు (filmography ):
  • రాత్రీ పగలనక--మాయారంభ (1950) ,
  • కాశీకి పోయాను రామా హరీ , ఓ కొంటె బాబగారూ -- అప్పుచేసి పప్పుకూడు (1959),
  • అంచెలంచెలు లేని మోక్షము -- శ్రీక్రిష్నార్జున యుద్ధం (1963),
  • తడికో తడికో -- అత్తా ఒకింటి కోడలే(1958),
  • ఏమయ్యా రామయ్యా -- బొబ్బిలి యుద్ధం (1964),
  • రుక్మిణమ్మా రుక్మిణమ్మా -- ఉయ్యాల జంపాలా (1965),
  • బలే బలే హిరణ్యకశిపుడరా' (గురువును మించిన శిష్యుడు: 1963),
  • 'డివ్వి డివ్వి డివ్విట్టం' (దాగుడు మూతలు:1964),
  • 'ఆడ నీవూ ఈడ నేనూ' (హరిశ్చంద్ర: 1965),
  • 'ఏమిటి ఈ అవతారం' (చదువుకున్న అమ్మాయిలు: 1963),
  • 'ఆశా ఏకాశ' (జగదేక వీరుని కథ: 1961)
  • 'విన్నావ యశోదమ్మ'(మాయాబజార్‌' (1957)లో పి.లీల, స్వర్ణలత కలిసి పాడినది)

కస్తూరి శివరావు మహలక్ష్మిని స్వర్ణలతగా ఏ క్షణాన మార్చారోగాని అప్పటినుంచి పాట పాటకీ నైపుణ్యం పెంచుకుంటూ 500 చిత్రాల్లో అనేక పాటలు పాడారు. కేరళకు చెందిన డాక్టర్‌ అమర్‌నాధ్‌ ఈమెను ప్రేమించి 1956లో పెళ్ళి చేసుకున్నారు. ఈ దంపతులకు ఆరుగురు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు పుట్టారు. పెద్ద అబ్బాయి ఆనంద్‌రాజ్‌ నటుడు. కాగా చిన్న అమ్మాయి స్వర్ణలత గాయిని. చిన్నకుమారుడు అనిల్‌ రాజ్‌ డ్యాన్స్‌మాస్టర్‌గా వ్యవహరించి తల్లి మరణానంతరం పాస్టర్‌గా గడుపుతున్నారు. మిగతా అబ్బాయిలు అమృతరాజ్‌, ఆర్లరాజ్‌, మోహన్‌, బాలాజీ, కుమార్తె విజయ డాక్టర్లుగా అమెరికాలో ప్రాక్టీసు చేస్తున్నారు. ఏడు వారాల నగలు చేయించుకుని ఎప్పుడూ వాటిని ధరిస్తూండే స్వర్ణలత పెద్దకుమార్తెకు మాటలు రాకపోవడంతో 1979లో క్రైస్తవ మతం స్వీకరించారు. విదేశాల్లో కూడా అనేక సంగీత విభావరిలలో పాల్గొన్నారీమె. అమెరికానుంచి తిరిగి వచ్చి చిన్నకొడుకుతో పుట్టిన వూరికి కారులో ప్రయాణిస్తుండగా దారికాచి గాయపరచి ఆమె వద్దవున్న నాలుగు లక్షలు నగదుని, బంగారు ఆభరణాలను దోచుకోగా 10.3.1997న చెన్నైలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారు. ఆమె పుట్టినరోజు, మరణించినది మార్చి 10వ తేదీ కావడం అరుదైన సంఘటన. 


Source : Eenadu cinema --Pathabangaram by Raavi Kondalrao.

  • ==================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala