సూర్యకాంతం , Suryakantham

పరిచయం (Introduction) :
  • సహజ నట కళా శిరోమణి, హాస్య నట శిరోమణి, బహుముఖ నటనా ప్రవీణా, రంగస్థల శిరోమణి-ఆంధ్రుల అభిమాన గయ్యాళి అత్త..సూర్యకాంతం.ఆమె హాస్యం చెయ్యకపోయినా ఆమె సంభాషణ చెప్పే తీరు, నవ్వు తెప్పిస్తుంది, చేసే చేష్టలు కోపం తెప్పిస్తాయి. అలా అని ఆమె దుష్టపాత్రధారిణి అని కూడా అనలేం. సహాయ నటి అనే అనాలి. ఏమైతేనేం - గయ్యాళి అత్తకి మారుపేరు సూర్యకాంతం అనిపించుకుంది. ఓర చూపులు చూస్తూ, ఎడంచెయ్యి విసుర్తూ కుడిచెయ్యి నడుం మీద నిలబెట్టి ఆమె చెప్పిన సంభాషణా చాతుర్యం, అంతలోనే వెక్కిరిస్తూ, అంతలోనే కల్లకబుర్లతో బొల్లిడుపులు ఏడుస్తూ ఆమె ధరించిన అత్త పాత్రలు సజీవ శిల్పాలు.సుమారు 700 పైగా సినిమాలలో నటించారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సూర్యకాంతం ,
  • పుట్టినతేది : 28-అక్టోబర్ -1920 ,
  • పుట్టిన ఊరు : వెంకట కృష్ణరాయపురము -తూర్పు గోదావరి జిల్లా .,
  • తండ్రి : పొన్నాడ అనంతరామయ్య ,
  • తల్లి : పొన్నాడ రత్నమ్మ ,
  • భర్త : పెద్దిబొట్ల చలపతిరావు (హైకోర్టు జడ్జి ) --1950 లో వివాహము .,
  • మరణము : 18- డిసెంబర్ -1996 - సహజ మరణము .
సినీ జీవితము :
  • తన తల్లితండ్రులకు 14వ సంతానంగా జన్మించింది. ఆరేళ్ళ చిన్న వయసులోనే పాడటం, నాట్యమాడటం నేర్చుకొంది. పెరిగే వయసులో హిందీ సినిమా పోస్టర్లు బాగా ఆకర్షించాయి. సినిమాల్లో నటించాలనే కోరిక ఆపుకోలేక చెన్నై చేరుకొంది. మొదట జెమిని స్టూడియో నిర్మించిన చంద్రలేఖ సినిమాలో డాన్సర్ గా అవకాశం వచ్చింది. అప్పట్లో నెలకు 65 రూ. జీతం ఇవ్వబోతే నిర్మాతతో తన అసంతృప్తిని తెలియబరచిన మీదట 75 రూపాయలు చేశారు. తరువాత ధర్మాంగద (1949)లో ఆమెది మూగవేషం. ధర్మాంగద టైములో చిన్నా చితకా వేషాలువేసినా తరువాత లీలా కుమారి సాయంతో మొదటిసారిగా నారద నారది సినిమాలో సహాయ నటిగా అవకాశం వచ్చింది. చిన్న చిన్న పాత్రలు నచ్చక జెమినీ స్టూడియో నుంచి బయటకు వచ్చేసింది. మనసులో బొంబాయికి వెళదామని ఉన్నా అందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆ ఆలోచనను విరమించుకొంది.
  • ఆ పరిస్థితిలో సహాయ నటిగా గృహప్రవేశం సినిమాలో మంచి అవకాశం వచ్చింది. తరువాత తన కల అయిన హీరోయిన్ వేషం సౌదామిని చిత్రం ద్వారా వచ్చింది. కానీ ఆ సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం అవడంతో ఆ అవకాశం తప్పిపోయింది. బాగైన తరువాత సంసారం చిత్రంలో మొట్టమొదటి సారిగా గయ్యాళి అత్త పాత్ర వచ్చింది. తరువాత తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర సినీ అభిమానుల గుండెల్లో నిలిపోయేలా జీవితాంతం అవే పాత్రలలో నటించింది.
అసలు సంసారం చిత్రం తరువాత బొంబాయికి చెందిన ఒక నిర్మాత ద్వారా హీరోయిన్ గా అవకాశం వచ్చింది. కానీ తనకు అవకాశం రాక ముందే ఇంకొక హీరోయిన్ ను పెట్టుకొని తీశేసారని తెలియడంతో, "ఒకరి బాధను నా సంతోషంగా తీసుకోలేను" అని ఆ సినిమాను నిరాకరించింది. కోడరికం సినిమా ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చింది. బి.నాగిరెడ్డి, చక్రపాణి లు ఆమె లేకుండా సినిమాలు తీసేవారు కారు.
  • ఆ రోజుల్లోని అనేక సాంఘిక చిత్రాల్లో రేలంగి - సూర్యకాంతం, రమణారెడ్డి - సూర్యకాంతం, ఎస్.వి.రంగారావు - సూర్యకాంతం- జంటలు, వాళ్ల దృశ్యాలు గుర్తుకు తెచ్చుకుని ఇవాళ కూడా హాయిగా నవ్వుకోవడం కద్దు. కొత్త సినిమా వస్తూంటే అందులో సూర్యకాంతం వుందా? అని ప్రేక్షకులూ, తారాగణంలో సూర్యకాంతం వున్నట్టేగదా? అని సినిమా డిస్ట్రిబ్యూటర్లూ - ఎదురు చూసేవారు. చక్రపాణి (1954), దొంగరాముడు (1955), చిరంజీవులు (1956), తోడికోడళ్లు (1957), అత్తా ఒకింటి కోడలే (1958), ఇల్లరికం (1959), భార్యాభర్తలు (1961), గుండమ్మకథ (1962), కులగోత్రాలు (1962), దాగుడుమూతలు (1964), అత్తగారు-కొత్తకోడలు, మూహూర్తబలం (1969) లాంటి మరపురాని ఎన్నో సినిమాలలో నటించింది.
నటించిన కొన్ని సినిమాలు (filmography ):
  • ధర్మాంగద (1949)
  • సంసారం (1950)
  • పెళ్ళిచేసి చూడు (1952)
  • బ్రతుకుతెరువు (1953)
  • కన్యాశుల్కం (1955) (మీనాక్షి)
  • దొంగరాముడు (1955)
  • చరణదాసి (1956)
  • భాగ్యరేఖ (1957)
  • మాయాబజార్ (1957)
  • తోడికోడళ్ళు (1957)
  • దొంగల్లో దొర (1957)
  • అప్పుచేసి పప్పుకూడు (1959)
  • మాంగల్యబలం (1959)
  • కృష్ణలీలలు (1959)
  • జయభేరి (1959)
  • శాంతినివాసం (1960)
  • ఇద్దరు మిత్రులు (1961)
  • భార్యా భర్తలు (1961)
  • వాగ్దానం (1961)
  • వెలుగునీడలు (1961)
  • శభాష్ రాజా (1961
  • కలసి ఉంటే కలదు సుఖం (1961)
  • మంచిమనసులు (1962)
  • రక్తసంబంధం (1962)
  • సిరిసంపదలు (1962)
  • గుండమ్మకథ (1962)
  • తిరుపతమ్మకథ (1963)
  • నర్తనశాల (1963) (అథిది పాత్ర)
  • పరువు ప్రతిష్ఠ (1963
  • చదువుకున్న అమ్మాయిలు (1963
  • మురళీకృష్ణ (1964)
  • మూగమనసులు (1964)
  • డాక్టర్ చక్రవర్తి (1964)
  • ఉయ్యాల జంపాల (1965)
  • నవరాత్రి (1966)
  • సంగీతలక్ష్మి (1966)
  • ఆస్తిపరులు (1966)
  • కన్నెమనసులు (1966)
  • బ్రహ్మచారి (1967)
  • సుఖ దు:ఖాలు (1967)
  • ఉమ్మడికుటుంబం (1967)
  • అత్తగారు-కొత్తకోడలు (1968)
  • బుద్ధిమంతుడు (1969)
  • ఆత్మీయులు (1969)
  • బాలరాజు కథ (1970)
  • దసరాబుల్లోడు (1971)
  • అమాయకురాలు (1971)
  • కాలం మారింది (1972)
  • కొడుకు కోడలు (1972)
  • అందాల రాముడు (1973)
  • ముత్యాల ముగ్గు (1975)
  • సెక్రటరి (1976)
  • గోరంతదీపం (1978)
  • రాధాకృష్ణ (1978)
  • కార్తీక దీపం (1979) (శారదా తల్లి)
  • వియ్యాలవారి కయ్యాలు (1979)
  • చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
  • పెళ్ళిచూపులు (1983
  • బంధువులు వస్తున్నారు జాగ్రత్త (1989)
  • వన్ బయ్ టూ (1993)
  • ===============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala