Venkataratnam Akkineni , అక్కినేని వెంకటరత్నం

అక్కినేని వెంకటరత్నం మృతి గురువారంనాడు అపోలో ఆసుపత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు. June 10 th, 2010 అక్కినేని నాగేశ్వరరావు అన్న రామబ్రహ్మం కొడుకు అక్కినేని వెంకటరత్నం., అన్నపూర్ణ స్టూడియో నిర్మాణ బాధ్యతలను చూసుకునే అక్కినేని వెంకటరత్నం గురువారం సాయంత్రం గుండెపోటుతో హఠన్మారణం పొందారు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన చిత్రాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగానూ, కామాక్షి కళామూవీస్ సంస్థకు నిర్మాణ నిర్వహణ బాధ్యతలను, ‘పంచాక్షరి’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వెంకటరత్నం వ్యవహరించారు. వారి మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం జరిగాయి. నాగేశ్వరరావు నాటకాలు వేస్తున్న రోజుల్లో తెరపై హీరోగా చూడాలని రామబ్రహ్మం ఆరాటపడేవారు. తొలినాళ్ల నుంచీ ఎఎన్నార్‌కు తోడుగా అక్కినేని వెంకటరత్నం ఉండేవారు. ఈయన్ని స్వంత కొడుకులా నాగేశ్వరరావు చూసుకునేవారు. అన్నపూర్ణా స్డూడియో వ్యవహారాలు, సంస్థ నిర్మించే చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌గా వెంకటరత్నం పనిచేసారు. సినీ పరిశ్రమలో అబ్బాయి గారు గా అందరికీ సుపరిచితుడు . ఎక్జిక్యూటివ్ నిర్మాతగా కొన్ని సినిమాలు :
  • ఆటగాడు ,
  • బంగారుకలలు,
  • అగ్ని పుత్రుడు,
  • విజరు,
  • బాస్‌,
  • కింగ్‌,
  • కెడి,
  • పంచాక్షరి
మొదలైన చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.
  • =======================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala