నారాయణ రెడ్డి సి ,Narayana Reddy .C

పరిచయం :
  • ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ...నారాయణరెడ్డి.
  • సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి, తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988 ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారె రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయన రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి
  • సి.నారాయణరెడ్డి అభ్యుదయ కవిగా, విద్యావేత్తగా ప్రసిద్ధులు. ఎన్.టి.రామారావు ప్రోత్సాహంతో ‘గులేబకావళి కథ (1962)’లోని అన్ని పాటలనూ రాయడం ద్వారా, పరిశ్రమలోకి సింహద్వారం గుండానే ప్రవేశించాలనే సంకల్పాన్ని నెరవేర్చుకున్నారు. విద్యా రాజకీయ రంగాల్లో అనేక పదవుల్లో కొనసాగుతూనే, సినీగేయ రచనను అనుషంగిక వృత్తిగా చేపట్టారు. ‘జ్ఞానపీఠ’ పురస్కారాన్ని అందుకొన్న సి.నా.రె., సినీకవి కూడా కావడం వల్ల సినీరంగ గౌరవం పెరిగింది.అభివ్యక్తిలో నవ్యత, హిందీ బాణీలు, ఉర్దూ గజళ్ల పోకళ్లు, తెలంగాణ మాండలిక ప్రయోగాలు, సూక్తులు- హితోక్తులు... సినారె ప్రత్యేకతలు. సంగీత సాహిత్యాల్లో సవ్యసాచి అనదగ్గ సినారెను సినీ వాగ్గేయకారునిగా అభివర్ణింపవచ్చు. సినారె కలం, తెలుగు సినీగేయాన్ని ‘స్వరరాగ పదయోగ సమభూషితం’గా తీర్చిదిద్దింది. పూజాఫలం, ఏకవీర, చెల్లెలి కాపురం, ఓ సీత కథ, స్వాతిముత్యం, గోరంత దీపం మొదలైన చిత్రాలకు సినారె సమకూర్చిన రసరమ్య గీతాలు సుమారు మూడు వేలు.
ప్రొఫైల్ :
  • పేరు : సింగిరెడ్డి నారాయణ రెడ్డి ,
  • ఇతర పేరు : సినారె ,
  • జనము : 29 జూలై 1931 ,
  • జన్మ స్థలం : హనుమజీ పేట - కరీం నగర్ ,
  • నివాసము : హైదరాబాద్ ,
  • పదవి : డాక్టర్ సి.నారాయణరెడ్డి ,
  • చదువు ; యం.ఎ ( తెలుగు ) డాక్టరేట్ -తెలుగు సాహిస్యం ,
  • ఉద్యోగం : ఉస్మానియా విశ్వవిద్యాలము లో తెలుగు ఆచార్యుని గా పనిచేసారు .
రచనలు కవిత్వం:
  • విశ్వంభర
  • ఆరోహణ
  • మనిషి - చిలక
  • ముఖాముఖి
  • భూగోళమంత మనిషి
  • దృక్పథం
  • కలం సాక్షిగా
  • కలిసి నడిచే కలం
  • కర్పూర వసంతరాయలు
  • మట్టి మనిషి ఆకాశం
  • నాగార్జున సాగరం
  • కొనగోటి మీద జీవితం
  • రెక్కల సంతకాలు
  • వ్యక్తిత్వం
పురస్కారాలు
  • డాక్టరేటు డిగ్రీ ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో
  • 1988వ సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం
  • పద్మ శ్రీ అవార్డు -1977 ,
  • పద్మ విభూషణ్ - 1992
సినీ రంగ ప్రవేశము :
  • రానాయన రెడ్డి గారు ఉస్మానియా ఉనివర్సిటి లో తెలుగు అధ్యాపకులు గా పనిచేస్తున్న కాలములో యన్ టిరామారావు గారు సి.రానాయన రెడ్డి గారి గురించి విని .. మిత్రులు పి.యస్ .ప్రసాద్ గారి తో కబుటు పెట్టగా వెళ్లికలియగా " గులేబకావళి " సినిమా కి పాటలు రాయమని అడిగేరు . అలా సినీ రంగప్రవేశము 10 మార్చ్ 1960లో జరిగింది . అక్కడ నుండి తనదైన సరళి లో పాటలు రాస్తూ ఎన్నో అద్భుతాలు సృష్టించారు .
ఫిల్మోగ్రఫీ :
  • జామీందర్ ,
  • తిక్క శంకరయ్య ,
  • శ్రీ తిరుపతమ్మ కథ ,
  • శివ రంజని -1978,
  • రహస్యం ,
  • పూజ ఫలం -1964 ,
  • పిడుగు రాముడు ,
  • పల్లెటూరి చిన్నోడు ,
  • నిండు సంసారం
  • నిండు హృదయాలు ,
  • మువ్వ గోపాలుడు ,
  • లాయర్ విశ్వనాధ్ ,
  • లక్షాధికారి ,
  • కర్ణ - 1964 ,
  • కాంభోజ రాజు కథ ,
  • కలవారి కోడలు ,
  • జరిగిన కథ - 1969,
  • జై జవాన్ ,
  • గులేబకావళి కథ -1961,
  • గోరంత దీపం ,
  • ఏకవీర -1969,
  • డాక్టర్ బాబు ,
  • ధనమా దైవమా ,
  • దత్త పుత్రుడు ,
  • డబ్బుకు లోకం దాసోహం
  • భాంధవ్యాలు ,
  • భలే తమ్ముడు ,
  • భలే మొనగాడు ,
  • బంగారు సంకెళ్ళు ,
  • బందిపోటు భీమన్న ,
  • బందిపోటు -1963,
  • ఆడబ్రతుకు ,
  • రైతు కుటుంబం ,
  • జీవన్ తరంగాలు ,
  • గోపాలుడు భూపాలుడు ,
  • దొరికితే దొంగలు .

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala