కమల దేవి టి,జి., Kamala Devi T.G.

పరిచయం :
  • టి.జి.కమలాదేవి (TG Kamala Devi) (ఏ.కమలా చంద్రబాబు) అసలు పేరు తోట గోవిందమ్మ. వివాహం అయ్యాక భర్త పేరు చేరి ఈమె పేరు ఏ.కమలా చంద్రబాబుగా మారింది. ఈమె తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. ప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్య భార్య జయమ్మకు చెల్లెలు. ఈవిడ స్వస్థలం కార్వేటినగరం. చిత్తూరు నాగయ్య ప్రోత్సాహంతో సినిమా రంగ ప్రవేశం చేసింది. ఈమె నటించిన మొట్ట మొదటి సినిమా చూడామణి. మాయలోకం అనే సినిమా ఈమెకు మంచిపేరు తెచ్చింది. అక్కినేని నాగేశ్వరరావుతో జోడీగా ముగ్గురు మరాఠీలు సినిమాలో నటించింది. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా ఆలపించిన తొలి యుగళ గీతానికి ఈమె హీరోయిన్‌గా నటించింది. పాతాళభైరవి, మల్లీశ్వరి (హీరోయిన్ ఇష్టసఖి జలజ) లాంటి హిట్‌ సినిమాల్లో నటించింది. ఈమె మల్లీశ్వరిలో కొన్ని పాటలు పాడడంతో పాటు, తరువాతి కాలంలో అనేక మంది నటీమణులకు డబ్బింగ్‌ చెప్పింది. తెలుగుతో పాటు అనేక తమిళ సినిమాల్లో కూడా ఈమె నటించింది.
ప్రొఫైల్ :
  • పేరు : టి.జి.కమల దేవి ,
  • జన్మ నామము : తోట గోవిందమ్మ ,
  • పుట్టిన తేది : 29 , డిసెంబర్ ,1930 ,
  • స్వస్తలం : కార్వేటి నగరం -చిత్తూరు జిల్లా ,
  • వ్రుత్తి : నటి , స్నూకర్ క్రీడాకారిణి ,
  • భర్త : ఆవుల చంద్రబాబు నాయుడు ,
  • తండ్రి : కృష్ణ స్వామి నాయుడు ,
  • తల్లి : లక్ష్మమ్మ ,
  • బావ : చిత్తూరు నాగయ్య (నాగయ్య భార్య చెల్లెలు ),
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కలు , ఒక తమ్ముడు ,
కెరీర్ :
  • కమలాదేవి పుత్తూరు ప్రభుత్వ పాఠశాలలో థర్డ్‌ఫారం వరకు చదివింది. క్రిస్టియన్‌ మిషనరీ తిరిగి ఐదవక్లాస్‌ స్కూల్లో చదివింది. ఏడో ఏట నుండి తల్లి లక్ష్మమ్మ ప్రోత్సాహంతో శాస్త్రీయ సంగీతం నేర్చుకుంది. ప్రముఖ గాత్ర విద్వాంసుడు చెంచురామయ్య ఈమెకు గురువు. సుమారు మూడేళ్ళ పాటు చెంచుామయ్య వద్ద కమాలాదేవి సంగీతాన్ని అభ్యసించింది. ఈవిడ దాదాపు వంద కీర్తనలు, శృతులు పాడింది.
  • పాఠశాల, సంగీతానికి తోడుగా బాల్యం నుండి నాటకాల్లో కూడా నటించింది. ఓసారి కమలాదేవి జ్ఞాన సుందరి నాటకంలో నటిస్తుండగా నాగయ్యతో పాటు పలువురు ప్రముఖులు ఆ నాటకం చూసారు. మరో సంఘటనలో సక్కుబాయి నాటకంలో ఈమె నటనకు ముగ్ధుడైన పిఠాపురం రాజా బంగారపు గొలుసు బహూకరిMcharu . ఆంధ్ర సెక్రటరియేట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గుజరాత్, రాజస్థాన్ రాష్టాల్లో రుక్సానా పాత్రను కమలాదేవి 25 సార్లు ధరించింది.
  • 1939వ సంవత్సరంలో పుత్తూరులో వందేమాతరం చిత్ర కథానాయకుడు చిత్తూరు వి.నాగయ్యకు ఘన సన్మానం ఏర్పాటైంది. ఆ సన్మానంలో కమలాదేవి తనకు ఇష్టమైన పాటను ప్రార్థనా గీతంగా పాడినప్పుడు నాగయ్య ఆ ప్రార్థనా గీతాన్ని విని, ఆమె ప్రతిభను గమనించి చెన్నై వెళ్ళాక బి.ఎన్.రెడ్డితో కమలాదేవి గురించి చెప్పి సినిమాలకు సిఫార్సు చేశాడు. నాగయ్య మాటతో, బి.ఎన్.రెడ్డి ఈమెని మద్రాసుకి పిలిపించి పాత్ర ఇద్దామనుకున్నాడు. అయితే ఆ పాత్ర కమలాదేవి చేజారిపోయింది. కాని మరికొద్ది కాలానికే చూడామణి చిత్రంలో ఈమెకు అవకాశం వచ్చింది. చూడామణి చిత్రంతో 1941లో వెండితెరమీద కనిపించిన కమలాదేవి, తరువాతి కాలంలో అనేక చిత్రాల్లో నటించి తన గానంతో, నటనతో ఆంధ్ర, తమిళ ప్రేక్షకులను మైమరిపించింది. ఈమె సినిమాలలో కథానాయకి పాత్ర ధరించకపోయినా, ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించింది. తెనాలి రామకృష్ణ సినిమాలో నటించి హెచ్.ఎం.రెడ్డి ఆశీస్సులు పొందింది. దక్షయజ్ఞంలో రోహిణిగా, సీతారామ జననంలో అహల్యగా నటించింది. అక్కినేని నాగేశ్వరరావు తొలిచిత్రం సీతారామ జననంలో నే ధన్యనైతిని రామా అనే పాట పాడిన ఈమెకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. తరువాత ఈమె పార్వతీ కళ్యాణం, గరుడ గర్వభంగం, మాయలోకం, ముగ్గురు మరాఠీలు, పల్లెటూరు, చక్రపాణి, తోడుదొంగలు, గుణసుందరి కథ, మల్లీశ్వరి, పాతాళభైరవి, చంద్రవంక, పల్లెటూరు వంటి చిత్రాల్లో పాటలు పాడే పాత్రలు, గుర్తింపుగల పాత్రలు ధరించింది.
ఫిల్మోగ్రఫీ :
  • నటిగా
  • సంవత్సరము ↓ సినిమా ↓ బాష ↓ - పాత్ర ↓
  • 1941 దక్షయజ్ఞం - ---- - తెలుగు -- రోహిణి
  • 1941 చూడామణి - --- - తెలుగు
  • 1942 బాలనాగమ్మ - -- - తెలుగు
  • 1942 సీతారామ జననం- -- తెలుగు -- అహల్య
  • 1943 గరుడ గర్వభంగం- -- తెలుగు
  • 1945 మాయలోకం - --- తెలుగు
  • 1946 ముగ్గురు మరాఠీలు- - తెలుగు
  • 1947 కంజన్ - -------- తమిళం-- మరగతం
  • 1949 గుణసుందరి కథ --- తెలుగు -- పార్వతీ దేవి
  • 1951 మల్లీశ్వరి - తెలుగు ఇష్టసఖి జలజ
  • 1951 పాతాళభైరవి - తెలుగు
  • 1951 చంద్రవంక - తెలుగు
  • 1952 పల్లెటూరు - తెలుగు
  • 1954 తోడుదొంగలు - తెలుగు రాముని భార్య
  • 1954 చక్రపాణి - తెలుగు మనవరాలు
  • 1956 తెనాలి రామకృష్ణ - తెలుగు
  • 1958 పార్వతీ కళ్యాణం- తెలుగు
  • 1967 కంచుకోట - తెలుగు
  • 1968 అసాద్యుడు - తెలుగు
  • 1968 బంగారు పంజరం- తెలుగు
  • 1968 బంగారు సంకెళ్లు - తెలుగు
  • 1969 కథానాయకుడు - తెలుగు
  • 1970 పెత్తందార్లు - తెలుగు
నేపథ్యగాయనిగా
  • పల్లెటూరు
  • గుణసుందరి కథ
  • మల్లీశ్వరి
  • దొంగలున్నారు జాగ్రత్త
  • భక్త రామదాసు
  • గొల్లభామ

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala