పరిచయం :
- "చాలా బాగుంది" ద్వారా సినిమాలో ప్రవేశించి, "మనోయజ్ఞం" సీరియల్ ద్వారా అందరికీ తెలిసిన కౌశిక్ బాబు మన రాష్ట్రంలోనే గాక కేరళలో గుర్తింపు పొందడం తండ్రిగా గర్విస్తున్నానని, పురాణకథలోని అయ్యప్ప పాత్రను ఇంతకుముందు సీరియల్స్‌లో పోషించినా సినిమాలో చేయడం ప్రథమమనీ, ఇది దేవుని కృపగా భావిస్తున్నానని సీనియర్ పాత్రికేయుడు విజయ్ బాబు వ్యాఖ్యానించారు. కౌశిక్‌బాబు మాట్లాడుతూ.. బాలనటుని స్థాయి నుంచి ప్రధాన పాత్ర స్థాయికి ఎదగడం ఆనందంగా ఉందనీ, అనుభవజ్ఞులైన వారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
- తెలుగుతేజం కౌశిక్ బాబు ఆల్రెడీ కేరళలో అయ్యప్పగా భక్తుల మన్ననలను పొందుతున్న విషయం విదితమే. ఆయన కనబడితే చాలు... భక్తిపారవశ్యంలో ఆయన ఆశీర్వచనాలు కోరుకుంటారని దర్శకుడు శశిమోహన్ చెబుతున్నారు. తెలుగు పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన శశిమోహన్ తాజాగా "శబరిమల శ్రీ అయ్యప్ప" చిత్రానికి నేతృత్వం వహిస్తున్నారు. అనశ్వర చారిటబుల్ ట్రస్ట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజీష్ మణి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
స్వామి అయ్యప్ప , టెలి సీరియల్ ,
- తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం అన్నపూర్ణస్టూడియోలో ప్రారంభమైంది. అయ్యప్పపాత్రధారి కౌశిక్ బాబుపై చిత్రించిన ముహూర్తపుషాట్కు దర్శకరత్న దాసరి క్లాప్‌కొట్టగా, కృష్ణంరాజు కెమేరా స్విచ్ఛాన్ చేశారు.
నటించిన కొన్ని సినిమాలు :
- మనోయజ్ఞం
- టక్కరి దొంగ’.ది నంది అవార్డు విన్నెర్
- స్వామియే శరణం అయ్యప్ప’ మల్టీ-లింగుఅల్ సీరియల్ ‘
కౌషిక్ అయ్యప్ప సీరియల్ లో చాలా చాలా బాగుంటాడు. వయసు కూడా సరిగ్గా సరిపోయింది. టైటిల్ సాంగ్ ప్రారంభంలో నడిచే వచ్చే అయ్యప్ప అంటే అయిదేళ్ల మా పాపకు చాలా ఇష్టం! కళ్ళు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
ReplyDeleteThanks for your Observation & correction
ReplyDelete