సింగీతం శ్రీనివాసరావు ,Singeetam Srinivasa rao

- ----------------------------------------------------
పరిచయం :
సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) ప్రతిభాశాలురైన సినిమా దర్శకులలో ఒకరు. తెలుగు, తమిళం, కన్నడ భాషలలో సందేశాత్మకమైవీ, ప్రయోగాత్మకమైనవీ, కధాభరితమైనవీ - ఇలా వైవిధ్యం గల పెక్కు సినిమాలకు దర్శకత్వం వహించి ఆయన ప్రేక్షకులనూ, విమర్శకులనూ మెప్పించాడు. మయూరి,పుష్పక విమానం,ఆదిత్య 369, మైఖేల్ మదన్ కామరాజు కధ వంటి వైవిధ్యము గల సినిమాలకు దర్శకత్వము వహించాడు. ఇంకా ఆయన మంచి సంగీత దర్శకుడు,కథకుడు కూడా.
జీవిత విశేషాలు
- పుట్టిన తేది : సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబరు 21.
- జన్మస్థలం .: నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించాడు.
- తండ్రి : ఒక హెడ్మాస్టరు.
- తల్లి : వయొలిన్ వాయిద్య నిపుణురాలు.
- చదువు : చెన్నై ప్రెసిడెన్సీ కాలేజీలో చదివేప్పుడు శ్రీనివాసరావుకు హరీంద్రనాద ఛటోపాధ్యాయ పర్వేక్షణలోనాటకరంగంలో ప్రవేశం ఏర్పడింది. డిగ్రీ వచ్చిన తరువాత సూళ్ళూరుపేటలో ఉపాధ్యాయవృత్తి సాగించాడు.
- స్వయంగా రచించిన నాటకాలు (బ్రహ్మ, అంత్యఘట్టం) తన విద్యార్ధులతో ప్రదర్శింపజేశాడు. రవీంద్రనాధ టాగూరునాటకం "చిత్ర"ను "చిత్రార్జున" అనే సంగీతనాటకంగా రూపొందించి ప్రదర్శించి ప్రశంసలు అందుకొన్నాడు. ఈ నాటకాన్నిఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ చూశాడు. 'టామ్ బుచాన్' అనే స్కాటిష్ నాటకకారుడు ఈ నాటకాన్ని ఆంగ్లంలోకిఅనువదించి ఒక అమెరికన్ టెలివిజన్ ఛానల్లో ప్రసారం చేశాడు. కొంతకాలం శ్రీనివాసరావు "తెలుగు స్వతంత్ర" పత్రికలోరచనలు (ప్రధానంగా ఇంటర్వ్యూలు) చేశాడు.
- సింగీతం శ్రీనివాసరావు ప్రసిద్ధ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావుకు శిష్యుడు. 'భాగ్యద లక్ష్మి బారమ్మ', 'సంయుక్త' అనే రెండు విజయవంతమైన కన్నడ చిత్రాలకు శ్రీనివాసరావు సంగీత దర్శకుడు. ప్రవాస భారతీయుల పిల్ల సౌకర్యార్ధంశ్లోకాలను ఆంగ్లంలో సంగీతపరంగా కూర్చాడు.
- ముంబై ఎక్స్ప్రెస్ (2005)
- Son of Alladin (2003)- 3D యానిమేషన్ చిత్రం.
- Little John (2002)
- ఆకాశ వీధిలో (2001)
- శ్రీకృష్ణార్జున యుద్ధం (1996)
- చిన్న వతియార్ (1995)
- భైరవద్వీపం(1994)
- ఆడవాళ్ళకు మాత్రమే (1994)
- మేడమ్(1993)
- ఫూల్ (1993)
- బృందావనం(1992)
- క్షీరసాగర (1992)
- ఆదిత్య 369 (1991)
- మైకేల్ మదన కామరాజు కధ(1991)
- అపూర్వ సహోదరులు (1989) ( తమిళం: అపూర్వ సహోదరగళ్, హిందీ: అప్పూరాజా)
- చిరంజీవి సుధాకర (1988)
- దేవతా మనుష్య (1988)
- పుష్పక విమానం (1988) - డైలాగులు లేని సినిమా, కనుక అన్ని భాషలలోనూ విడుదలయ్యింది
- అమెరికా అబ్బాయి (1987)
- ఆనంద(1986)
- మయూరి (1984)
- శ్రావణ బంతు(1984)
- చెలిసువ మొదగళు(1982)
- Nancy (1981)
- అమావాస్య చంద్రుడు (తమిళం: రాజా పారవై) (1981)
- త్రిలోక సుందరి
- మంగళ తోరణాలు(1979)
- గమ్మత్తు గూఢచారులు (1978)
- రామచిలుక (1978)
- సొమ్మొకడిది సోకొకడిది (1978)
- అందమె ఆనందం (1977)
- నిరపరయుమ్ నిలవిక్కుమ్ (1977)
- పంతులమ్మ (1977)
- తరం మారింది (1977)
- అమెరికా అమ్మాయి (1976)
- ఒక దీపం వెలిగింది(1976)
- జమీందారు గారి అమ్మాయి (1975)
- దిక్కట్ర పార్వతి (1973)
- నీతి నిజాయితి (1972)
=========================
- Visit my website : dr.seshagirirao.com