విజయశాంతి , Vijayashanti
పరిచయం :
Career:
జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కధానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కధానాయిక వేషాలే వరించాయామెని. ఈ కాలంలో రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.
1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కధానాయిక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా, తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కధానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని మరో రెండేళ్లలో ఆ తార ఎవరికీ అందనంత ఎత్తెదిగి ధృవతారగా నిలిచింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతిని కూడా గెలుచుకుంది.
ఆమె అవివాహిత. కానీ 1987లో ఆమె శ్రీనివాస్ ప్రసాద్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లాడిందనీ అతడి ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా కలిగినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తుంటాయి.
చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్ తో 7 చిత్రాలలో నటించింది.
టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆణిముత్యాల్లోనూ ఆమె కధానాయిక. అవి వందేమాతరం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు మరియు దేవాలయం.
విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. ఇంకా, కె. రాఘవేంద్ర రావు దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణ రావు దర్శకత్వాన 6 చిత్రాల్లోనూ, కె. విశ్వనాధ్ దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ, బాపు దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ నటించింది.
సూర్యా మూవీస్ పతాకం పై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు నిర్మించింది. ఇవికాక శాసనం, పెద్దరికం చిత్రాలకు సహ నిర్మాత.
సూరజ్ మూవీస్ పతాకం పై అడవి చుక్క చిత్రాన్ని నిర్మించింది.
నేటి ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం చాలా కాలం పాటు విజయశాంతికి రూపశిల్పిగా పని చేశాడు. ఆమె స్థాపించిన సూర్యా మూవీస్ నిర్మాణ సంస్థకు తొలినాళ్లలో భాగస్వామిగా ఉండి తరువాత స్వంతం చేసుకున్నాడు.
విజయశాంతి మొదటి చిత్రం కల్లుక్కుళ్ ఈరం (1979). తెలుగులో మొదటి చిత్రం కిలాడీ కృష్ణుడు (1980). నూరవ చిత్రం భారత నారి (1989). ఇప్పటికి చివరిగా విడుదలైన తెలుగు చిత్రం నాయుడమ్మ (2006). చివరిగా విడుదలైన చిత్రం జమానత్ (హిందీ, 2007).
తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కధానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేదు. ఆమె నటించిన కధానాయిక ప్రాధాన్యతగల చిత్రాలు: నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, సమాజంలో స్త్రీ, అరుణ కిరణం, భారత నారి, భారత రత్న, పోలీస్ లాకప్, లేడీ బాస్, కర్తవ్యం, ఆశయం, స్ట్రీట్ ఫైటర్, మొండి మొగుడు - పెంకి పెళ్లాం, శ్రీవారంటే మావారే, శ్రీ శ్రీమతి సత్యభామ, మగరాయుడు, యంగ్ టర్క్స్, ఒసేయ్ రాములమ్మా, రౌడీ దర్బార్, గూండా గర్దీ, కల్లుకొండూరు పెణ్ణు, సి. ఐ. డి., అడవి చుక్క, వైజయంతి, ఇందిరమ్మ, నాయుడమ్మ, శాంభవి ఐ. పి. యస్., తేజస్విని, అత్తాకోడళ్లు, రైఫిల్స్, సాహస బాలుడు - విచిత్ర కోతి, తడయం.
విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసే పోరాటాలే కాదు, అమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటువంటి చిత్రాలలో కొన్ని: దేశోద్ధారకుడు, పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, రౌడీ ఇన్స్ పెక్టర్, కధానాయకుడు, భానుమతిగారి మొగుడు, ముద్దుల కృష్ణయ్య, ఛాలెంజ్, యుద్ధభూమి, చాణక్య శపధం, మంచిదొంగ, కొండవీటి రాజా, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, దొంగల్లో దొర, దర్జా దొంగ, విజయ్, జానకి రాముడు, సక్కనోడు, దొంగపెళ్లి, ఊరికి సోగ్గాడు, అగ్ని పర్వతం, నాగాస్త్రం, శ్రీరామచంద్రుడు, సంసారం ఓ సంగీతం, రజంగం (తమిళం), నెంజిలే తునివిరుంతాల్ (తమిళం), మదులై ముత్తుకల్ (తమిళం), తలై మగన్ (తమిళం), కేరళిద హెన్ను (కన్నడం).
విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పూర్తి అయినవి, కొన్ని పూర్తి కానివి, మరి కొన్ని ముహూర్తం తరువాత ముందుకు జరగనివి. అవి: అడవి రాణి, రాయల సీమ రక్తం, జిందాబాద్, జైహింద్, హోం మినిస్టర్.
(మూలము : థట్స్ తెలుగు)
మూలము : వికీపెడియా.
- దక్షిణ భారత సినీ రంగంలో విశ్వ నట భారతి గా వినుతికెక్కిన విజయశాంతి తెలుగు చలన చిత్రాలలో ప్రసిద్ధిగాంచిన నటి. ఈమె జూన్ 24, 1964న వరంగల్లో జన్మించి, మద్రాసులో పెరిగింది. విజయశాంతి పిన్ని విజయలలిత కూడా అలనాటి తెలుగు సినిమా నటే. విజయశాంతి అసలు పేరు శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది. విజయశాంతి తన 7వ సంవత్సరములోనే బాలనటిగా సినీరంగములో ప్రవేశించినట్లు వినికిడి, కానీ ఆమె బాలనటిగా నటించిన చిత్రాల వివరాలు అందుబాటులో లేవు. ఆమెను కథానాయకిగా తెరకు పరిచయము చేసినది ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా. ఆయన దర్శకత్వంలో 1979లో వచ్చిన తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కధానాయికగా విజయశాంతి మొదటి సినిమా. తన మాతృభాష తెలుగులో విజయశాంతి తొలి చిత్రం అదే ఏడాది (1979) అక్టోబర్ లో ప్రారంభమై ఆ తరువాతి ఏడు విడుదలైన కిలాడి కృష్ణుడు. ఈ చిత్రంలో హీరో సూపర్ స్టార్ కృష్ణ; చిత్ర దర్శకురాలు విజయనిర్మల .
- పేరు : విజయశాంతి ,
- అసలు పేరుః-- శాంతి. ఆమె తెరపేరు లోని విజయ తన పిన్ని విజయలలిత పేరు నుండి గ్రహించబడింది.
- ముద్దు పే రుః చిన్ని
- పుట్టిన తే దీః జూన్ 24-1964. రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్.
- పుట్టిన ఊరు : రామన్న గూడెం (తెలంగాణా ఏరియా),
- ఎత్తు = 5.7,
- భర్త : నందమూరి శ్రీనివాస్ ప్రసాద్-ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా కలిగినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తుంటాయి.,
- తొలి చిత్రము - --తమిళ సినిమా కల్లుక్కుళ్ ఈరమ్ (రాళ్లకూ కన్నీరొస్తాయి) కధానాయికగా విజయశాంతి మొదటి సినిమా.
- ప్లస్ పాయింట్‌ః ఫ్రాంక్ నెస్,
- మైనస్ పాయింట్‌ః అదే ఫ్రాంక్ నెస్ ,
- మీలో మీకు నచ్చేది అబద్దం చెప్పని నిజాయితీ,
- ఇతరులలో నచ్చేదిః సిన్సియారిటీ,
- చిన్ననాటి అనుభూతులుః తల్లిదండ్రుల అభిమానం, క్లాస్ మేట్స్ తో అల్లరిచేయడం,
- ఇష్టమైన ఆహారంః సౌత్ ఇండియన్,
- ఇష్టమైన వ్యవహారం : నా వృత్తి,
- అభిమాన హీరోః ఎన్టీఆర్,
- అభిమాన హీరోయిన్ : బాగా నటించే ప్రతి హీరోయిన్,
- ఇష్టమైన హాలిడే స్పాట్ : ప్రత్యేకించి ఏదీ లేదు,
Career:
- విజయశాంతి కధానాయికగా పరిచయమైన మొదటి నాలుగు సంవత్సరాల పాటు పరిశ్రమలో నిలదొక్కుకోవటానికి గ్లామర్ ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా పోషించింది. వాటిలో చెప్పుకోదగ్గవి ఏవీ లేనప్పటికీ ఉన్నంతలో మహానటులు ఎన్టీయార్, ఏయెన్నార్ ల కలయికలో వచ్చిన 'సత్యం - శివం'లో ఆమె పోషించిన పాత్ర కొద్దిగా గుర్తు పెట్టుకోదగ్గది. ఈ నాలుగేళ్లలో ఆమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించింది. విజయశాంతికి తెలుగులో నటిగా గుర్తింపు తెచ్చిన సినిమా టి.కృష్ణ దర్శకత్వంలో ఈ తరం సంస్థ 1983 లో నిర్మించిన నేటి భారతం. అప్పటి నుండి ఆమె వెనుదిరిగి చూసుకోనవసరం లేకుండాపోయింది. క్రమంగా కధానాయికగా ఒక్కో మెట్టే అధిరోహిస్తూ దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే మరే నటీ అందుకోలేని స్థాయికి చేరింది.
జయసుధ, జయప్రద అభినయంతో, శ్రీదేవి, మాధవి అందచందాలతో తెలుగు తెరను ఏలుతున్న రోజుల్లో ప్రారంభమైంది విజయశాంతి సినీ ప్రస్థానం. 1979లో తొలిసారి కధానాయికగా కెమెరా ముందుకొచ్చేనాటికి ఆమె వయసు కేవలం పదిహేనేళ్లు. భారతీరాజా వంటి సృజనశీలి వద్ద నటనలో ఓనమాలు దిద్దుకున్నా ఆమె తనదంటూ ఓ గుర్తింపుకోసం నాలుగేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. తొలి నాలుగేళ్లలో కిలాడీ కృష్ణుడు, పెళ్లీడు పిల్లలు, సత్యం -శివం, వంశగౌరవం, కృష్ణావతారం, రాకాసి లోయ, పెళ్లిచూపులు మొదలైన తెలుగు చిత్రాల్లో ఆడి పాడే కధానాయిక వేషాలే వరించాయామెని. ఈ కాలంలో రాశి పరంగా తెలుగుకన్నా తమిళంలో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ అవేవీ ఆమె గుర్తుంచుకోదగ్గవి కావు. పైపెచ్చు వాటిలో కొన్ని మర్చిపోదగ్గ చిత్రాలు కూడా. 1981లో వచ్చిన రజంగం అనే తమిళ చిత్రంలో స్విమ్ సూట్ ధరించి కొద్దిపాటి సంచలనం సృష్టించిందామె.
1983లో టి. కృష్ణ రూపంలో అదృష్టం ఆమె తలుపు తట్టింది. ప్రజా నాట్య మండలి నాటకాల ద్వారా ప్రగతిశీల భావాలుగల ప్రయోక్తగా అప్పటికే పేరొందిన టి. కృష్ణ తొలిసారిగా ఒక తెలుగు చలనచిత్రాన్ని రూపొందిస్తూ అందులో ఒక ప్రధాన పాత్రకు అనేకమందిని పరిశీలించిన పిమ్మట విజయశాంతిని ఎంచుకున్నాడు. ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ ఆ చిత్ర కధానాయిక పాత్రలో జీవించడం ద్వారా నేటి భారతం ఘన విజయానికి పరోక్షంగా కారణమైంది విజయశాంతి. అలా, తెలుగు తెరపై అప్పటికే పాతుకుపోయిన కధానాయికలను సవాలు చేస్తూ మరో తార ఉద్భవించింది. అటుపై అందొచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుని మరో రెండేళ్లలో ఆ తార ఎవరికీ అందనంత ఎత్తెదిగి ధృవతారగా నిలిచింది. నేటి భారతం చిత్రంలో తన నటనకు మొదటిసారిగా ఉత్తమ నటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది బహుమతిని కూడా గెలుచుకుంది.
ఆమె అవివాహిత. కానీ 1987లో ఆమె శ్రీనివాస్ ప్రసాద్ అనే యువకుడిని రహస్యంగా పెళ్లాడిందనీ అతడి ద్వారా ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా కలిగినట్లు చిత్రసీమలో గుసగుసలు వినిపిస్తుంటాయి.
చిరంజీవితో అత్యధికంగా 19, బాలకృష్ణతో 17, కృష్ణతో 12, శోభన్ బాబుతో 11, సుమన్ తో 7 చిత్రాలలో నటించింది.
టి. కృష్ణ దర్శకత్వం వహించిన ఆరు ఆణిముత్యాల్లోనూ ఆమె కధానాయిక. అవి వందేమాతరం, నేటి భారతం, దేశంలో దొంగలు పడ్డారు, ప్రతిఘటన, రేపటి పౌరులు మరియు దేవాలయం.
విజయశాంతి నటించిన ఎక్కువ చిత్రాలకు దర్శకుడు కోడి రామకృష్ణ. ఈయన దర్శకత్వంలో 12 చిత్రాలలో నటించింది. ఇంకా, కె. రాఘవేంద్ర రావు దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వాన 10 చిత్రాల్లోనూ, దాసరి నారాయణ రావు దర్శకత్వాన 6 చిత్రాల్లోనూ, కె. విశ్వనాధ్ దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ, బాపు దర్శకత్వాన 2 చిత్రాల్లోనూ నటించింది.
సూర్యా మూవీస్ పతాకం పై కర్తవ్యం, ఆశయం, నిప్పురవ్వ చిత్రాలు నిర్మించింది. ఇవికాక శాసనం, పెద్దరికం చిత్రాలకు సహ నిర్మాత.
సూరజ్ మూవీస్ పతాకం పై అడవి చుక్క చిత్రాన్ని నిర్మించింది.
నేటి ప్రముఖ నిర్మాత ఎ. ఎం. రత్నం చాలా కాలం పాటు విజయశాంతికి రూపశిల్పిగా పని చేశాడు. ఆమె స్థాపించిన సూర్యా మూవీస్ నిర్మాణ సంస్థకు తొలినాళ్లలో భాగస్వామిగా ఉండి తరువాత స్వంతం చేసుకున్నాడు.
విజయశాంతి మొదటి చిత్రం కల్లుక్కుళ్ ఈరం (1979). తెలుగులో మొదటి చిత్రం కిలాడీ కృష్ణుడు (1980). నూరవ చిత్రం భారత నారి (1989). ఇప్పటికి చివరిగా విడుదలైన తెలుగు చిత్రం నాయుడమ్మ (2006). చివరిగా విడుదలైన చిత్రం జమానత్ (హిందీ, 2007).
తెలుగులో మాత్రమే కాకుండా భారతదేశంలోని ఏ భాషలోనూ విజయశాంతి కన్నా ఎక్కువ కధానాయిక ప్రాధాన్యత ఉన్నన్ని చిత్రాల్లో నటించిన మరో నటి లేదు. ఆమె నటించిన కధానాయిక ప్రాధాన్యతగల చిత్రాలు: నేటి భారతం, రేపటి పౌరులు, ప్రతిఘటన, దేశంలో దొంగలు పడ్డారు, వందేమాతరం, దేవాలయం, సమాజంలో స్త్రీ, అరుణ కిరణం, భారత నారి, భారత రత్న, పోలీస్ లాకప్, లేడీ బాస్, కర్తవ్యం, ఆశయం, స్ట్రీట్ ఫైటర్, మొండి మొగుడు - పెంకి పెళ్లాం, శ్రీవారంటే మావారే, శ్రీ శ్రీమతి సత్యభామ, మగరాయుడు, యంగ్ టర్క్స్, ఒసేయ్ రాములమ్మా, రౌడీ దర్బార్, గూండా గర్దీ, కల్లుకొండూరు పెణ్ణు, సి. ఐ. డి., అడవి చుక్క, వైజయంతి, ఇందిరమ్మ, నాయుడమ్మ, శాంభవి ఐ. పి. యస్., తేజస్విని, అత్తాకోడళ్లు, రైఫిల్స్, సాహస బాలుడు - విచిత్ర కోతి, తడయం.
విజయశాంతి పేరు చెబితే తెరపై ఆమె చేసే పోరాటాలే కాదు, అమె ఒలికించిన శృంగారం కూడా గుర్తుకొస్తుంది. అటువంటి చిత్రాలలో కొన్ని: దేశోద్ధారకుడు, పట్టాభిషేకం, అపూర్వ సహోదరులు, భార్గవ రాముడు, సాహస సామ్రాట్, రౌడీ ఇన్స్ పెక్టర్, కధానాయకుడు, భానుమతిగారి మొగుడు, ముద్దుల కృష్ణయ్య, ఛాలెంజ్, యుద్ధభూమి, చాణక్య శపధం, మంచిదొంగ, కొండవీటి రాజా, దేవాంతకుడు, మహానగరంలో మాయగాడు, దొంగల్లో దొర, దర్జా దొంగ, విజయ్, జానకి రాముడు, సక్కనోడు, దొంగపెళ్లి, ఊరికి సోగ్గాడు, అగ్ని పర్వతం, నాగాస్త్రం, శ్రీరామచంద్రుడు, సంసారం ఓ సంగీతం, రజంగం (తమిళం), నెంజిలే తునివిరుంతాల్ (తమిళం), మదులై ముత్తుకల్ (తమిళం), తలై మగన్ (తమిళం), కేరళిద హెన్ను (కన్నడం).
విజయశాంతి నటించిన కొన్ని చిత్రాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. వాటిలో కొన్ని పూర్తి అయినవి, కొన్ని పూర్తి కానివి, మరి కొన్ని ముహూర్తం తరువాత ముందుకు జరగనివి. అవి: అడవి రాణి, రాయల సీమ రక్తం, జిందాబాద్, జైహింద్, హోం మినిస్టర్.
- --Courtesy with : http://www.tollywoodtimes.com/telugu/profiles/info/Vijayashanti/
(మూలము : థట్స్ తెలుగు)
- విజయశాంతి నటించిన చిత్రాలు
- సంవత్సరం - సినిమా పేరు - ఇతర నటీ నటులు - దర్శకుడు - భాష
- 1979 - కల్లుక్కుళ్ ఈరమ్ - సుధాకర్, భారతీ రాజా, ముచ్చెర్ల అరుణ - భారతీ రాజా - తమిళం
- 1980 కిలాడి కృష్ణుడు కృష్ణ విజయ నిర్మల -తెలుగు
- 1981 సివప్పు మల్లి (తెలుగు ఎర్ర మల్లెలు చిత్రానికి తమిళ రీమేక్) విజయ్ కాంత్, చంద్ర శేఖర్, ముచ్చెర్ల అరుణ రామ నారాయణ- తమిళం
- 1981 పాట్టం పరక్కట్టమ్- తమిళం
- 1981 సందాన మలర్గళ్ -తమిళం
- 1981 సుమై- తమిళం
- 1981 ఎనక్కాగ కతిరు- తమిళం
- 1981 నెంజిలే తునివిరుంతాల్ విజయకాంత్, స్వప్న ఎస్. ఎ. చంద్రశేఖర్ -తమిళం
- 1981 నెట్రిగన్ రజనీకాంత్, మేనక ఎస్. పి. ముత్తురామన్- తమిళం
- 1981 రజంగం చంద్రశేఖర్ ఆర్. సి. శక్తి- తమిళం
- 1981 పండంటి జీవితం శోభన్ బాబు, సుజాత తాతినేని రామారావు - తెలుగు
- 1981 సత్యం - శివం ఎన్. టి. రామారావు, ఎ. నాగేశ్వర రావు -తెలుగు
- 1981 పులి బిడ్డ నరేష్ వి. మధుసూధన రావు -తెలుగు
- 1982 వెడిక్కై మనిదర్గళ్ - తమిళం
- 1982 నెళల్ తెడమ్ నెంజంగళ్ -తమిళం
- 1982 మంజల్ నిల్లా- తమిళం
- 1982 ఇళన్ జోడిగళ్ -తమిళం
- 1982 కృష్ణావతారం కృష్ణ బాపు -తెలుగు
- 1982 ప్రతీకారం మోహన్ బాబు, శారద గుత్తా రామినీడు -తెలుగు
- 1982 వంశ గౌరవం శోభన్ బాబు రవీందర్ రెడ్డి -తెలుగు
- 1982 శ్రీరంగనీతులు ఎ. నాగేశ్వర రావు, చంద్ర మోహన్ ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1982 పెళ్లీడు పిల్లలు సురేష్, సుమలత బాపు -తెలుగు
- 1983 తలైమగన్ సురేష్ - తమిళం
- 1983 విల్లియనూర్ మాత శరత్ బాబు కె. తంగప్పన్ -తమిళం
- 1983 మదులై ముత్తుక్కల్ సురేష్ - తమిళం
- 1983 నీరు పూత్త నెరుప్పు రమేష్ కె. విజయన్ -తమిళం
- 1983 కేరళిద హెన్ను శంకర్ నాగ్ జి. ఆర్. కె. రాజు -కన్నడం
- 1983 సింహ గర్జనె విష్ణు వర్ధన్ ఎస్. వి. చంద్రశేఖర్ -కన్నడం
- 1983 పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలు సుమన్ రవిరాజా పినిశెట్టి -తెలుగు
- 1983 ధర్మాత్ముడు కృష్ణం రాజు, జయసుధ, రాజేష్ బి. భాస్కర రావు- తెలుగు
- 1983 పెళ్లి చేసి చూపిస్తాం -తెలుగు
- 1983 అమాయక చక్రవర్తి చంద్ర మోహన్ వల్లభనేని జనార్ధన్ -తెలుగు
- 1983 సంఘర్షణ చిరంజీవి, నళిని కె. మురళీ మోహన రావు- తెలుగు
- 1983 నవోదయం సుమన్, రాజేంద్ర ప్రసాద్ పి. చంద్రశేఖర రెడ్డి - తెలుగు
- 1983 ముక్కు పుడక భాను చందర్, చంద్ర మోహన్, సుహాసిని కోడి రామకృష్ణ- తెలుగు
- 1983 నేటి భారతం టి. కృష్ణ -తెలుగు
- 1983 పెళ్లి చూపులు చంద్ర మోహన్ పి. సాంబశివ రావు -తెలుగు
- 1983 రాకాసి లోయ నరేష్, రాజేష్, ముచ్చెర్ల అరుణ - తెలుగు
- 1984 కుర్ర చేష్టలు తెలుగు
- 1984 కళ్యాణ కనవుగల్ శివరాజన్ కె. శివరాజన్- తమిళం
- 1984 కుటుంబ గౌరవం మురళీ మోహన్, దీప -తెలుగు
- 1984 ఆడదాని సవాల్ మురళీ మోహన్, విజయ లలిత కె. ఎస్. ఆర్. దాస్- తెలుగు
- 1984 వీరభద్రుడు కృష్ణం రాజు - తెలుగు
- 1984 దొంగల్లో దొర సుమన్- తెలుగు
- 1984 రారాజు కృష్ణం రాజు జి. రామమోహన రావు- తెలుగు
- 1984 జడ గంటలు - తెలుగు
- 1984 ఇంకెన్నాళ్లీ చరిత్ర -తెలుగు
- 1984 అభిమన్యుడు శోభన్ బాబు దాసరి నారాయణ రావు- తెలుగు
- 1984 ఛాలెంజ్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, సుహాసిని ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1984 కధానాయకుడు బాల కృష్ణ కె. మురళీ మోహన రావు -తెలుగు
- 1984 మహానగరంలో మాయగాడు చిరంజీవి విజయ బాపినీడు -తెలుగు
- 1984 ఎస్. పి. భయంకర్ కృష్ణం రాజు, ఎ. నాగేశ్వర రావు, శ్రీదేవి, సురేష్ వి. బి. రాజేంద్ర ప్రసాద్- తెలుగు
- 1984 సుందరి - సుబ్బారావ్ చంద్ర మోహన్ రేలంగి నరసింహా రావు- తెలుగు
- 1984 దేవాంతకుడు చిరంజీవి ఎస్. ఎ. చంద్రశేఖర్- తెలుగు
- 1985 ప్రతిఘటన చంద్ర మోహన్, రాజ శేఖర్, చరణ్ రాజ్ టి. కృష్ణ- తెలుగు
- 1985 శ్రీవారు శోభన్ బాబు, చంద్ర మోహన్ బి. భాస్కర రావు -తెలుగు
- 1985 ఊరికి సోగ్గాడు శోభన్ బాబు బి. వి. ప్రసాద్- తెలుగు
- 1985 దర్జా దొంగ సుమన్ మణివణ్ణన్ -తెలుగు
- 1985 చిరంజీవి చిరంజీవి, భాను ప్రియ -తెలుగు
- 1985 తిరుగుబాటు -తెలుగు
- 1985 అగ్ని పర్వతం కృష్ణ, రాధ కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1985 దేశంలో దొంగలు పడ్డారు సుమన్, రాజేంద్ర ప్రసాద్ టి. కృష్ణ- తెలుగు
- 1985 దేవాలయం శోభన్ బాబు టి. కృష్ణ -తెలుగు
- 1985 బందీ కృష్ణం రాజు కోడి రామకృష్ణ -తెలుగు
- 1985 కొత్త పెళ్లికూతురు కె. యస్. రామి రెడ్డి -తెలుగు
- 1985 పట్టాభిషేకం బాల కృష్ణ కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1985 వందేమాతరం రాజ శేఖర్ టి. కృష్ణ -తెలుగు
- 1986 దేశోద్ధారకుడు .. తమిళంలోకి కూడా అనువదించబడింది బాల కృష్ణ ఎస్. ఎస్. రవిచంద్ర -తెలుగు
- 1986 జీవన పోరాటం శోభన్ బాబు రాజాచంద్ర - తెలుగు
- 1986 సంసారం ఒక సంగీతం చంద్ర మోహన్, శరత్ బాబు, స్వప్న రేలంగి నరసింహారావు- తెలుగు
- 1986 అరుణ కిరణం రాజ శేఖర్ ముత్యాల సుబ్బయ్య -తెలుగు
- 1986 సమాజంలో స్త్ర్రీ సుమన్, భాను చందర్ ఎం. రామకృష్ణ -తెలుగు
- 1986 బ్రహ్మాస్త్రం కృష్ణ జి. రామ్మోహన్ రావు -తెలుగు
- 1986 ధైర్యవంతుడు చిరంజీవి పి. లక్ష్మీ దీపక్ - తెలుగు
- 1986 రేపటి పౌరులు రాజ శేఖర్ టి. కృష్ణ -తెలుగు
- 1986 చాణక్య శపధం చిరంజీవి కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1986 కొండవీటి రాజా చిరంజీవి, రాధ కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1986 నాగ దేవత అర్జున్ రామ నారాయణ -తెలుగు
- 1986 శ్రావణ సంధ్య శోభన్ బాబు, సుహాసిని ఎ. కోదండరామి రెడ్డి - తెలుగు
- 1986 సక్కనోడు శోభన్ బాబు బి. భాస్కర రావు - తెలుగు
- 1986 అపూర్వ సహోదరులు బాల కృష్ణ, భాను ప్రియ కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1986 ముద్దుల కృష్ణయ్య బాల కృష్ణ, రాధ కోడి రామకృష్ణ -తెలుగు
- 1987 పడమటి సంధ్యారాగం టామ్, గుమ్మలూరి శాస్త్రి జంధ్యాల -తెలుగు
- 1987 భార్గవ రాముడు బాల కృష్ణ, మందాకిని కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1987 కళ్యాణ తాంబూలం శోభన్ బాబు బాపు - తెలుగు
- 1987 భానుమతిగారి మొగుడు బాల కృష్ణ, అశ్వని ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1987 యముడికి మొగుడు చిరంజీవి, రాధ రవిరాజా పినిశెట్టి -తెలుగు
- 1987 ముద్దాయి కృష్ణ కె. యస్. ఆర్. దాస్ - తెలుగు
- 1987 స్వయంకృషి చిరంజీవి, సుమలత కె. విశ్వనాధ్ -తెలుగు
- 1987 దొంగగారూ స్వాగతం కృష్ణ జి. రామ మోహన రావు -తెలుగు
- 1987 పసివాడి ప్రాణం చిరంజీవి, సుమలత ఎ. కోదండరామి రెడ్డి - తెలుగు
- 1987 మువ్వ గోపాలుడు బాల కృష్ణ కోడి రామకృష్ణ- తెలుగు
- 1987 సాహస సామ్రాట్ బాల కృష్ణ కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1988 ఇన్స్ పెక్టర్ ప్రతాప్ బాల కృష్ణ ముత్యాల సుబ్బయ్య- తెలుగు
- 1988 దొంగ పెళ్లి శోభన్ బాబు రవిరాజా పినిశెట్టి - తెలుగు
- 1988 అశ్వద్ధామ కృష్ణ బి. గోపాల్- తెలుగు
- 1988 యుద్ధ భూమి చిరంజీవి కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1988 మంచి దొంగ చిరంజీవి కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1988 జానకి రాముడు నాగార్జున, జీవిత కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1989 భలే దొంగ బాల కృష్ణ ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1989 విజయ్ నాగార్జున బి. గోపాల్ -తెలుగు
- 1989 కొడుకు దిద్దిన కాపురం కృష్ణ, మహేష్ బాబు విజయ నిర్మల -తెలుగు
- 1989 గూండా రాజ్యం కృష్ణ కోడి రామకృష్ణ - తెలుగు
- 1989 భారత నారి వినోద్ కుమార్ ముత్యాల సుబ్బయ్య - తెలుగు
- 1989 దొరికితే దొంగలు శోభన్ బాబు కె. మురళీ మోహన రావు - తెలుగు
- 1989 రుద్రనేత్ర చిరంజీవి, రాధ కె. రాఘవేంద్ర రావు -తెలుగు
- 1989 ఈశ్వర్ అనిల్ కపూర్ కె. విశ్వనాధ్ -హిందీ
- 1989 అత్తకు యముడు - అమ్మాయికి మొగుడు చిరంజీవి, వాణిశ్రీ ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1989 ఇంద్రుడు - చంద్రుడు .. ఇంద్రన్ - చంద్రన్గా తమిళంలోనికి అనువదించబడింది కమల్ హాసన్ సురేష్ కృష్ణ -తెలుగు
- 1989 ముద్దుల మామయ్య బాల కృష్ణ, సీత కోడి రామకృష్ణ- తెలుగు
- 1990 కర్తవ్యం .. వైజయంతి ఐ.పి.ఎస్.గా తమిళంలోనికి అనువదించబడింది వినోద్ కుమార్, చరణ్ రాజ్ ఎ. మోహన గాంధీ - తెలుగు
- 1990 పల్నాటి రుద్రయ్య సుమన్ బి. ఎల్. వి. ప్రసాద్ -తెలుగు
- 1990 కొండవీటి దొంగ చిరంజీవి, రాధ ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1990 మకద్దర్ కా బాద్షా వినోద్ ఖన్నా, షబానా ఆజ్మీ తాతినేని రామారావు -హిందీ
- 1990 నాగాస్త్రం కృష్ణ కృష్ణ - తెలుగు
- 1990 శత్రువు .. శత్రుగా తమిళంలోనికి అనువదించబడింది వెంకటేష్ కోడి రామకృష్ణ -తెలుగు
- 1991 జైత్ర యాత్ర నాగార్జున ఉప్పలపాటి నారాయణ రావు -తెలుగు
- 1991 గ్యాంగ్ లీడర్ .. అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది చిరంజీవి విజయ బాపినీడు -తెలుగు
- 1991 స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ చిరంజీవి యండమూరి వీరేంద్రనాధ్- తెలుగు
- 1991 తల్లిదండ్రులు .. తమిళంలోకి కూడా అనువదించబడింది బాలకృష్ణ తాతినేని రామారావు - తెలుగు
- 1991 లారీ డ్రైవర్ బాల కృష్ణ బి. గోపాల్ -తెలుగు
- 1991 ముద్దుల మేనల్లుడు .. తమిళంలోకి కూడా అనువదించబడింది బాల కృష్ణ కోడి రామకృష్ణ -తెలుగు
- 1992 మన్నన్ రజనీ కాంత్, కుష్బూ పి. వాసు -తమిళం
- 1992 మొండి మొగుడు - పెంకి పెళ్లాం సుమన్ వై. నాగేశ్వర రావు -తెలుగు
- 1992 రౌడీ ఇన్స్ పెక్టర్ .. ఆటోరాణిగా తమిళంలోనికి అనువదించబడింది బాలకృష్ణ బి. గోపాల్ -తెలుగు
- 1992 అపరాధి అనిల్ కపూర్, శిల్పా శిరోద్కర్ కె. రవి శంకర్- హిందీ
- 1993 ఆశయం .. అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది జగపతి బాబు ఎ. మోహన గాంధీ- తెలుగు
- 1993 దొరగారికి దొంగ పెళ్లాం కృష్ణ, జయసుధ ఎస్. ఎస్. రవిచంద్ర -తెలుగు
- 1993 సూర్య ఐ.పి.ఎస్. వెంకటేష్ ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1993 చినరాయుడు వెంకటేష్ బి. గోపాల్ -తెలుగు
- 1993 నిప్పు రవ్వ .. సూర్యగా తమిళంలోనికి అనువదించబడింది బాలకృష్ణ ఎ. కోదండరామి రెడ్డి -తెలుగు
- 1993 పోలీస్ లాకప్.. అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింద్ వినోద్ కుమార్ కోడి రామకృష్ణ -తెలుగు
- 1993 మెకానిక్ అల్లుడు .. మెకానిక్ మాప్పిళ్లైగా తమిళంలోనికి అనువదించబడింది చిరంజీవి బి. గోపాల్ -తెలుగు
- 1993 రౌడీ మొగుడు మోహన్ బాబు, వాణిశ్రీ ఎ. మోహన గాంధీ -తెలుగు
- 1993 కుంతీ పుత్రుడు మోహన్ బాబు దాసరి నారాయణ రావు -తెలుగు
- 1994 లేడీ బాస్ .. అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది కోడి రామకృష్ణ -తెలుగు
- 1994 మగ రాయుడు కార్తీక్ ఇ. వి. వి. సత్యనారాయణ తెలుగు
- 1994 తేజస్విని సంజయ్ దత్,చరణ్ రాజ్ ఎన్. చంద్ర -హిందీ
- 1994 అత్తాకోడళ్లు ఆనంద్, శారద శరత్ -తెలుగు
- 1995 స్ట్రీట్ ఫైటర్ .. అదే పేరుతో తమిళంలోనికి అనువదించబడింది బి. గోపాల్ -తెలుగు
- 1996 యంగ్ టర్క్స్ .. ఢిల్లీ డైరీ గా తెలుగులోకి అనువదించబడింది సురేష్ గోపి - మళయాళం
- 1996 సి. ఐ. డి. .. అదే పేరుతో తెలుగులోకి అనువదించబడింది రఘు -తమిళం
- 1997 రౌడీ దర్బార్ సాయి కుమార్, దాసరి నారాయణ రావు దాసరి నారాయణ రావు- తెలుగు
- 1997 గూండా గర్దీ ధర్మేంద్ర, ఆదిత్య పంచోలి బి. సాయి ప్రసాద్- హిందీ
- 1997 ఒసేయ్ రాములమ్మా .. అడిమై పెణ్ గా తమిళం లోకి అనువదించబడింది రాంకీ, కృష్ణ, దాసరి నారాయణ రావు దాసరి నారాయణ రావు - తెలుగు
- 1998 తడయం .. తెలుగులోకి చట్టం గా అనువదించబడింది రాంకీ -తమిళం
- 1998 శ్రీవారంటే మావారే సుమన్ వై. నాగేశ్వర రావు -తెలుగు
- 1998 కల్లుకొండూరు పెణ్ణు సురేష్ గోపి, దిలీప్ శ్యామా ప్రసాద్ -మళయాళం
- 1999 రాజస్థాన్ .. తెలుగులోకి అదే పేరుతో అనువదించబడింది శరత్ కుమార్ సెల్వ మణి -తమిళం
- 1999 భారత రత్న కోడి రామకృష్ణ -తెలుగు
- 2000 వైజయంతి పృధ్వీరాజ్, సుమలత కె. యస్. నాగేశ్వర రావు -తెలుగు
- 2000 అడవి చుక్క సుమన్, చరణ్ రాజ్ దాసరి నారాయణ రావు -తెలుగు
- 2000 శ్రీ శ్రీమతి సత్యభామ రఘు ఎస్. వి. కృష్ణారెడ్డి -తెలుగు
- 2001 సాహస బాలుడు - విచిత్ర కోతి- తెలుగు
- 2002 రైఫిల్స్ .. తెలుగులోకి 'వందేమాతరం' గా అనువదంచబడింది -కన్నడం
- 2002 శివాని అరుణ్ కుమార్, నెపోలియన్ ఆర్. సురేష్ వర్మ -తెలుగు
- 2003 బన్నారి అమ్మన్ .. తెలుగులోకి మహా చండి గా అనువదించబడింది లయ, కరణ్ భారతి కణ్ణన్ - తమిళం
- 2003 శాంభవి ఐ.పి.ఎస్. కె. యస్. నాగేశ్వర రావు - తెలుగు
- 2004 ఇందిరమ్మ ఎ. మాధవ సాయి- తెలుగు
- 2006 నాయుడమ్మ ఎ. మాధవ సాయి -తెలుగు
- 2007 జమానత్ అమితాబ్ బచ్చన్, అర్షద్ వార్సి, కరిష్మా కపూర్ ఎస్. రామనాధన్ -హిందీ
మూలము : వికీపెడియా.
- ============================
- Visit my website : dr.seshagirirao.com